News
News
X

Maruti Suzuki Brezza 2022: రూ.8 లక్షల్లోపే కొత్త బ్రెజా - మోస్ట్ ప్రీమియం ఫీచర్లు, లుక్!

మారుతి సుజుకి బ్రెజా 2022 మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

FOLLOW US: 

మారుతి సుజుకి కొత్త బ్రెజాను మనదేశంలో లాంచ్ చేసింది. ప్రస్తుతం మనదేశంలో మోస్ట్ అవైటెడ్ కార్లలో ఇది కూడా ఒకటి. గత ఎనిమిది రోజుల్లో ఈ కారు కోసం ఏకంగా 45,000కు పైగా బుకింగ్స్ వచ్చాయని కంపెనీ లాంచ్ సమయంలో ప్రకటించింది.

మారుతి సుజుకి బ్రెజా 2022 ధర
ఇందులో మొత్తం నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మోడల్‌లో ఎల్ఎక్స్‌ఐ వేరియంట్ ధర రూ.7.99 లక్షలుగానూ, వీఎక్స్ఐ వేరియంట్ ధర రూ.9.46 లక్షలుగానూ, జెడ్ఎక్స్ఐ వేరియంట్ ధర రూ.10.86 లక్షలుగానూ ఉంది. జెడ్ఎక్స్ఐ డ్యూయల్ టోన్ వేరియంట్ ధరను రూ.11.02 లక్షలుగానూ, జెడ్ఎక్స్ఐ ప్లస్ మోడల్ ధరను రూ.12.3 లక్షలుగానూ, జెడ్ఎక్స్ఐ ప్లస్ డ్యూయల్ టోన్ మోడల్ ధరను రూ.12.46 లక్షలుగానూ నిర్ణయించారు.

ఇక పెట్రోల్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మోడల్లో వీఎక్స్ఐ వేరియంట్ ధర రూ.10.96 లక్షలుగా ఉండగా, జెడ్ఎక్స్ఐ వేరియంట్ ధర రూ.12.36 లక్షలుగా నిర్ణయించారు. జెడ్ఎక్స్ఐ డ్యూయల్ టోన్ ధర రూ.12.52 లక్షలుగానూ, జెడ్ఎక్స్ఐ ప్లస్ ధర రూ.13.8 లక్షలుగానూ, జెడ్ఎక్స్ఐ ప్లస్ డ్యూయల్ టోన్ వేరియంట్ ధర రూ.13.96 లక్షలుగానూ ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూం ధరలే. ఆన్ రోడ్ ధరలు రాష్ట్రాన్ని బట్టి మారే అవకాశం ఉంది.

మారుతి సుజుకి బ్రెజా 2022 ఫీచర్లు
దీని ముందు వెర్షన్‌తో పోలిస్తే కారు ఎక్స్‌టీరియర్‌కు చాలా మార్పులు చేశారు. కొత్త గ్రిల్, ట్విన్ పోడ్ హెడ్ ల్యాంప్స్, డ్యూయల్ ఎల్ షేప్డ్ ఎల్ఈడీ ఉన్నాయి. ఇక వెనకవైపు సన్నని టెయిల్ ల్యాంప్స్ అందించారు. 16 అంగుళాల డ్యూయల్ టోన్ అలోయ్ వీల్స్ ఇందులో ఉండటం విశేషం.

కొత్త బ్రెజా లోపల డ్యూయల్ టోన్ డ్యాష్ బోర్డ్ అందించారు. 9 అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం ఈ కారులో ఉంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీని ఇది సపోర్ట్ చేయనుంది. వైర్‌లెస్ చార్జింగ్, అర్కామిస్ సౌండ్ సిస్టం, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, వెనకవైపు ఏసీ వెంట్లు, హెడ్స్ అప్ డిస్‌ప్లే ఉన్నాయి.

ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఈఎస్‌పీ, ఏబీఎస్ విత్ ఈబీడీ, 360 డిగ్రీల కెమెరా, హిల్ హోల్డ్ అసిస్ట్, ఐఎస్ఓఫిక్స్ వంటి సేఫ్టీ ఫీచర్లను అందించారు. ఎర్టిగాతో పాటు లాంచ్ అయిన 1.5 లీటర్ కే-సిరీస్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. 102 బీహెచ్‌పీ, 135 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఇది అందించనుంది.

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

Published at : 30 Jun 2022 09:55 PM (IST) Tags: Maruti Suzuki Brezza 2022 Maruti Suzuki Brezza Maruti Suzuki Brezza 2022 Price Maruti Suzuki Brezza 2022 Features Maruti Suzuki Brezza 2022 Launched

సంబంధిత కథనాలు

Ola Electric Car: చూడగానే కొనాలనిపించే ఓలా ఎలక్ట్రిక్ కారు - కేవలం నాలుగు సెకన్లలోనే - మోస్ట్ అడ్వాన్స్‌డ్ ఫీచర్లు!

Ola Electric Car: చూడగానే కొనాలనిపించే ఓలా ఎలక్ట్రిక్ కారు - కేవలం నాలుగు సెకన్లలోనే - మోస్ట్ అడ్వాన్స్‌డ్ ఫీచర్లు!

Ola New Electric Scooter: ఓలా - కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరిపోలా - ఈసారి తక్కువ ధరలోనే!

Ola New Electric Scooter: ఓలా - కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరిపోలా - ఈసారి తక్కువ ధరలోనే!

Ola Electric Car: సింగిల్ చార్జ్‌తో హైదరాబాద్ టు తిరుపతి - ఓలా ఎలక్ట్రిక్ కార్‌తో మామూలుగా ఉండదు!

Ola Electric Car: సింగిల్ చార్జ్‌తో హైదరాబాద్ టు తిరుపతి - ఓలా ఎలక్ట్రిక్ కార్‌తో మామూలుగా ఉండదు!

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

జులైలో మనదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఎస్‌యూవీలు ఇవే!

జులైలో మనదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఎస్‌యూవీలు ఇవే!

టాప్ స్టోరీస్

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Tummmala Nageswararao :  హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన

CM Jagan :  ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన