అన్వేషించండి

50,000 జీతంతో Land Rover Defender కారు మెయింటైన్ చేయవచ్చా? దాని మైలేజ్ ఎంత

Land Rover Defender Mileage: ల్యాండర్ రోవర్ డిఫెండర్ కారు అద్భుతమైన డిజైన్, ఆఫ్-రోడింగ్ సామర్థ్యం, ప్రీమియం ఫీచర్ల వల్ల బాగా ఫేమస్ అయింది. ఈ లగ్జరీ కారు ఎంత మైలేజీని ఇస్తుందో మీకు తెలుసా?

గతంలో బైక్ కొనాలన్నా కొంచెం ఆలోచించే రోజులు ఉండేవి. తరువాత ఖరీదై బైక్స్ కూడా రోజువారీ పనులకు వాడేస్తున్నారు. ఇప్పుడు లగ్జరీ కారు కొనడం తమ కలగా భావిస్తుంటారు. తమ స్టైల్, పవర్,  స్టేటస్ సింబల్‌ను చాటిచెప్పేలా కారు తమ వద్ద ఉండాలని చాలా మంది సెలబ్రిటీలే కాదు కొనగలిగే స్థోమత ఉన్న వారంతా కోరుకుంటారు. అటువంటి ఫేమస్ లగ్జరీ కార్లలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ (Land Rover Defender) ఒకటి. అద్భుతమైన డిజైన్, ఆఫ్ రోడింగ్ కెపాసిటీ, ప్రీమియం ఫీచర్ల కారణంగా ల్యాండ్ రోవర్ డిఫెండర్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. అయితే నెలకు 50 వేల రూపాయలు జీతం ఉన్న వారు, లేక అంతే మొత్తం సంపాదించే వారు ఈ కారు మెయింటైన్ చేయవచ్చా..? ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లడానికి వారికి ఎంత ఖర్చవుతుంది? ఈ కారు ఎంత మైలేజీ ఇస్తుంది లాంటి పూర్తి వివరాలను ఇక్కడ  తెలుసుకుందాం.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ధర ఎంత?

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ధర సుమారు 1 కోటి రూపాయల నుండి ప్రారంభమై రూ. 3.02 కోట్ల వరకు ఉంటుంది. ఈ SUV పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. కంపెనీ సమాచారం ప్రకారం, దీని యావరేజ్ మైలేజీ లీటరుకు సుమారు 9 నుంచి 14 కిలోమీటర్ల వరకు ఉంటుంది. డ్రైవింగ్ కండీషన్‌తో పాటు కారు ఇంజన్ రకాన్ని బట్టి మైలేజీ మారుతూ ఉంటుంది.

క్విక్ రీడ్ (Quick Read)

ఇప్పుడు  ఇంధన ఖర్చును అంచనా వేస్తే.. పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ. 100, కారు యావరేజ్ మైలేజీ లీటరుకు సుమారు 10 కిలోమీటర్లు ఇస్తుంది అనుకుందాం. అంటే ఒక కిలోమీటర్ ప్రయాణించడానికి సుమారు 10 రూపాయల పెట్రోల్ ఖర్చవుతుంది. ఒక వ్యక్తి ఆఫీసు తన ఇంటి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లయితే, రోజువారీ రాకపోకల మొత్తం ప్రయాణం 40 కిలోమీటర్ల మేర అవుతుంది. ఒక కిలోమీటరుకు రూ. 10 ఖర్చయితే, ప్రతిరోజూ ఆఫీసుకి వెళ్లి రావడానికి సుమారు రూ. 400 పెట్రోల్ ఖర్చవుతుంది. కానీ ట్రాఫిక్ వల్ల మైలేజీ తగ్గితే కనుక మరో 50 నుంచి వంద రూపాయలు సైతం ఖర్చు చేయక తప్పదు.

నెలలో ఎంత ఖర్చవుతుంది?

ఒకవేళ మీరు నెలలో 22 రోజులు ఆఫీసుకు వెళ్లాల్సి వస్తే, కేవలం పెట్రోల్ కోసమే రూ. 8,800 నుంచి రూ.9500 వరకు ఖర్చవుతుంది. అంటే రూ. 50,000 జీతంలో సుమారు 17 నుండి 20 శాతం డబ్బు కేవలం ఆఫీసు రాకపోకల కోసం పెట్రోల్ ఖర్చులకే సరిపోతుంది. ఇందులో కారు EMI, సర్వీసింగ్, ఇన్సూరెన్స్, ఇతర ఖర్చులు చేర్చలేదు. అలాంటప్పుడు 50 వేల రూపాయల జీతం ఉన్నవారు, నెలకు అంత మొత్తం సంపాదించే వారు డిఫెండర్ వంటి లగ్జరీ SUVలో ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయితే, ఒకవేళ ఎవరికైనా ఇప్పటికే డిఫెండర్ ఉండి, ఆఫీసు దూరం తక్కువగా ఉంటే ఈ లగ్జరీ కారులో వెళ్లడం వారికి అంత సమస్య కాదు. పైగా వారు తమ స్టేటస్, పవర్ సింబల్‌గా కంటిన్యూ చేయవచ్చు..

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

ఫుల్ ఛార్జ్‌పై 683 కిలోమీటర్ల రేంజ్ కారు కొన్న స్టార్ హీరో.. Mahindra BE 6 సేఫ్టీలో ది బెస్ట్
ఫుల్ ఛార్జ్‌పై 683 కిలోమీటర్ల రేంజ్ కారు కొన్న స్టార్ హీరో.. Mahindra BE 6 సేఫ్టీలో ది బెస్ట్
మగవాళ్ల కంటే ఆడవాళ్లే బెస్ట్‌ డ్రైవర్లు - రాత్రి 9-10 గంటల మధ్య డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం!
ఇండియాలో మహిళలే బెస్ట్ డ్రైవర్లు - రోజు మొత్తంలో ఆ ఒక్క గంటే అత్యంత డేంజర్!
2026 మారుతి బ్రెజ్జా రెడీగా ఉంది - కొత్త టర్బో ఇంజిన్, ADAS, వెంటిలేటెడ్ సీట్లతో అదిరిపోయే ఎంట్రీ!
లాంచ్‌కు ముందే 2026 మారుతి బ్రెజ్జా సీక్రెట్స్ అన్నీ లీక్ - టర్బో ఇంజిన్‌తో భారీ అప్‌డేట్!
కొత్త మారుతి కారు కొనాలనుకుంటున్నారా? వెంటనే బుక్ చేసుకోండి, మరోసారి ధరల పెంపు!
మారుతి సుజుకీ గట్టి షాక్‌ ఇవ్వబోతోంది, కొత్త కారు కొనేవాళ్ల జేబుకు చిల్లు!

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
Embed widget