Audi A8 L: కియారా లాంచ్ చేసిన ఆడీ కొత్త కారు - ఇది చాలా కాస్ట్లీ గురూ!
లగ్జరీ కార్ల బ్రాండ్ ఆడీ మనదేశంలో కొత్త లగ్జరీ సెడాన్ అయిన ఆడీ ఏ8 ఎల్‌ను లాంచ్ చేసింది.
ఆడీ మనదేశంలో కొత్త లగ్జరీ సెడాన్‌ను లాంచ్ చేసింది. అదే ఆడీ ఏ8 ఎల్. దీని ధర రూ.1.29 కోట్లుగా (ఎక్స్-షోరూం) ఉంది. ఇది ఒక ఫ్లాగ్‌షిప్ లగ్జరీ కారు. ఈ కారులో కొత్త లగ్జరీ ఫీచర్లు, కొత్త టెక్నాలజీని కంపెనీ అందించింది. ఈ కారును దేశంలోని టాప్ హీరోయిన్లలో ఒకరైన కియారా అద్వానీ లాంచ్ చేశారు.
ముందువైపు కొత్త గ్రిల్, మెష్ ప్యాటర్న్‌ను అందించారు. డిజిటల్ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ కూడా ఇందులో ఉన్నాయి. 19 అంగుళాల టర్బైన్ డిజైన్ అలోయ్ వీల్స్ ఇందులో ఉన్నాయి. కారు వెనకవైపు ఓఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. లైట్ సిగ్నేచర్ చేంజ్ ఓవర్ కూడా ఉంది.
వెనకవైపు 3-సీటర్ రిలాక్సేషన్ ప్యాకేజ్, ఫుట్ మసాజర్ కూడా ఉన్నాయి. బీఅండ్ఓ 3డీ ఆడియో సిస్టం, 23 స్పీకర్లు, 4-జోన్ క్లైమెట్ కంట్రోల్, సాఫ్ట్ క్లోజ్ డోర్స్, 3డీ సరౌండ్ వ్యూ కెమెరా, వెనకవైపు ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్, హెడ్స్ అప్ డిస్‌ప్లే కూడా ఇందులో ఉండనున్నాయి.
ఆల్ వీల్ స్టీరింగ్ ఫీచర్‌ను కంపెనీ ఆడీ ఏ8 ఎల్‌లో అందించింది. 3.0 లీటర్ టర్బో పెట్రోల్ వీ6 ఇంజిన్‌ను ఇందులో అందించారు. 340 హెచ్‌పీని ఈ ఇంజిన్ డెలివర్ చేయనుంది. 5-సీటర్, 4-సీటర్ మోడల్స్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇక పర్సనలైజేషన్ విషయానికి వస్తే... ఇందులో 55 ఎక్స్‌టీరియర్ కలర్స్, 8 ఇంటీరియర్ కలర్స్, 7 వుడెన్ ఇన్‌లేలు ఉండనున్నాయి.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
View this post on Instagram