By: ABP Desam | Updated at : 16 Feb 2022 01:02 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
కియా కారెన్స్ మనదేశంలో లాంచ్ అయింది. (Image: Kia)
Kia Carens MPV: కియా కారెన్స్ కారు మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.8.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది. సెల్టోస్, కార్నివాల్, సోనెట్ తర్వాత మనదేశంలో కియా లాంచ్ చేసిన నాలుగో కారు ఇదే. ఈ కారును గతేడాది డిసెంబర్‌లోనే పరిచయం చేశారు. ఈ సంవత్సరం జనవరి నుంచి బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఈ మూడు వరుసల కారును కొనుగోలు చేయాలనుకున్నవారు కియా వెబ్ సైట్‌లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా లేదా డీలర్ షిప్‌ను సంప్రదించడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. అయితే బుకింగ్ అమౌంట్ కింద రూ.25,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించి 19,089 ప్రీ-ఆర్డర్లు వచ్చాయని కంపెనీ ప్రకటించింది.
ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ వేరియంట్లలో ఈ కారు లాంచ్ అయింది. వీటిలో లగ్జరీ ప్లస్ ట్రిమ్ వేరియంట్‌లో ఆరు సీట్లే ఉండగా... మిగతా అన్ని వేరియంట్లూ సెవెన్ సీటర్సే కావడం విశేషం.
కియా కారెన్స్ డిజైన్ (Kia Carens Design)
మిగతా కియా కార్లకు సంబంధించిన డిజైన్ కంటే దీని డిజైన్ కొత్తగా ఉంది. ఇందులో కొత్త స్లీక్ రేడియేటర్ గ్రిల్‌ను అందించారు. దీన్ని కియా ‘స్టార్ మ్యాప్’ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ అని పిలుస్తోంది. ఇందులో ప్రధాన ఎల్ఈడీ హెడ్‌లైట్ యూనిట్‌ను గ్రిల్ కింద అందించారు. ముందువైపు బంపర్ డిజైన్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ఎల్ఈడీ ఫాగ్‌ల్యాంప్స్, సైడ్ క్లాడింగ్, 16 అంగుళాల అలోయ్ వీల్స్ కూడా ఉన్నాయి. దీని వెనకవైపు డిజైన్ కూడా కొత్తగా ఉండనుంది. 2,780 మిల్లీమీటర్ల పొడవైన వీల్ బేస్ ఇందులో ఉంది. ఈ విభాగంలో పొడవైన వీల్ బేస్ ఉన్న కారు ఇదే.
కియా కారెన్స్ ఫీచర్లు (Kia Carens Features)
ఇందులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టంను అందించారు. మొత్తం 66 కనెక్టెడ్ కార్ టెక్నాలజీలు ఉన్న కియా కనెక్ట్ సూట్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. దీంతోపాటు 4.2 అంగుళాల టీఎఫ్‌టీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రెండో, మూడో వరుసల కోసం పైభాగంలో అమర్చిన ఏసీ వెంట్లు ఇందులో ఉన్నాయి. దీంతోపాటు ఆటోమేటిక్ ఏసీ, ముందువైపు వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రెండో వరుస సీట్ల కోసం ఎలక్ట్రిక్ ట్రంబుల్ కూడా ఉన్నాయి. దీంతోపాటు ఎయిర్ ప్యూరిఫయర్, వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ చార్జర్, బోస్ సౌండ్ సిస్టం ఉన్న ఎనిమిది స్పీకర్లు, స్పీడ్ లిమిటర్ ఉన్న ఆటో క్రూయిజ్ కంట్రోల్, స్పోర్ట్, ఎకో, నార్మల్ డ్రైవింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి.
కియా కారెన్స్ సేఫ్టీ ఫీచర్లు (Kia Carens Safety Features)
ఇందులో అదిరిపోయే సేఫ్టీ ఫీచర్లు కూడా అందించారు. ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్ హిల్ బ్రేక్ కంట్రోల్, వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్ మెంట్, హైలైన్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి. మొత్తం నాలుగూ డిస్క్ బ్రేకులే. దీంతోపాటు బ్రేక్ అసిస్టట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఇందులో అందించారు. దీంతోపాటు రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, రివర్సింగ్ కెమెరా కూడా ఉన్నాయి.
కియా కారెన్స్ స్పెసిఫికేషన్లు (Kia Carens Specifications)
ఇందులో 1.5 లీటర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ డీజిల్ ఇంజిన్, 1.4 లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 113 బీహెచ్‌పీ, 144 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. ఇందులో కేవలం సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇక 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 113 బీహెచ్‌పీ, 250 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. ఇందులో కేవలం సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందించారు. 1.4 లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ 138 బీహెచ్‌పీ, 242 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. ఇందులో కేవలం సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, సెవెన్-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లు లాంచ్ అయ్యాయి.
కియా కారెన్స్ ధర (Kia Carens Price)
1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ ధర మోడల్‌ను బట్టి రూ.8.99 లక్షల నుంచి రూ.9.99 లక్షల వరకు ఉంది. 1.4 లీటర్ టర్బోచార్జ్‌డ్ వేరియంట్ ధర మోడల్‌ను బట్టి రూ.10.99 లక్షల నుంచి రూ.16.99 లక్షల వరకు ఉంది. ఇక 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ వేరియంట్ ధర మోడల్‌ను బట్టి రూ.10.99 లక్షల నుంచి రూ.16.99 లక్షల వరకు ఉంది.
Also Read: Tata Altroz: రూ.8 లక్షల్లోపే టాటా కొత్త కారు, అల్ట్రోజ్‌లో కొత్త వేరియంట్ వచ్చేసింది!
Also Read: Skoda Kodiaq: ఈ సూపర్ హిట్ కారు అవుట్ ఆఫ్ స్టాక్.. 2022లో అస్సలు కొనలేరు!
Jeep Meridian: ఫార్చ్యూనర్ కంటే చాలా తక్కువ ధరకే - ఎంట్రీ ఇచ్చిన జీప్ మెరీడియన్ - అదిరిపోయే లుక్, ఫీచర్లు!
Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?
World Costliest Car: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు - ఏకంగా రూ.1108 కోట్లు - దీని ప్రత్యేక ఏంటంటే?
Mahindra Scorpio N: కొత్త మహీంద్రా స్కార్పియో లాంచ్ అయ్యేది అప్పుడే - ప్రకటించిన కంపెనీ!
Maruti Suzuki New Facility: కొత్త ప్లాంట్ పెడుతున్న మారుతి సుజుకి - రూ.20 వేల కోట్ల పెట్టుబడి, 13 వేల ఉద్యోగాలు - ఎక్కడో తెలుసా?
Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!
Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !
Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరపై..!