Skoda Kodiaq: ఈ సూపర్ హిట్ కారు అవుట్ ఆఫ్ స్టాక్.. 2022లో అస్సలు కొనలేరు!

స్కోడా కోడియాక్ ఫేస్ లిఫ్ట్ కారు 2022 సంవత్సరానికి గానూ పూర్తిగా అమ్ముడుపోయింది.

FOLLOW US: 

స్కోడా తన కోడియాక్ ఫేస్ లిఫ్ట్ కారును మనదేశంలో గత నెలలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని ధర మనదేశంలో రూ.34.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర. ఇక స్పోర్ట్ లైన్ వేరియంట్ ధర రూ.35.99 లక్షల నుంచి, ఎల్ అండ్ కే వేరియంట్ ధర రూ.37.49 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం మనదేశంలో 7-సీటర్ ప్రీమియం ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతోంది.

2022 సంవత్సరానికి గానూ ఈ కారు బుకింగ్స్ పూర్తిగా అయిపోయాయని కంపెనీ సేల్స్ డైరెక్టర్ జాక్ హొల్లిస్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కేవలం 20 రోజుల్లోనే పూర్తి బుకింగ్స్ అయిపోయాయని జాక్ తెలిపారు. ఈ కారు ధర ఎక్కువ అయినా వినియోగదారులు కొనుగోళ్లలో మాత్రం తగ్గేదే లే అంటున్నారు.

ఈ కారు ముందు వెర్షన్‌లో డీజిల్ ఇంజిన్‌ను స్కోడా అందించింది. ఇప్పుడు లాంచ్ అయిన కొత్త కోడియాక్‌లో డైనమిక్ చాసిస్ కంట్రోల్ (డీసీసీ)ని అందించారు. డీసీసీ ద్వారా డ్రైవర్ ఎకో, కంఫర్ట్, స్పోర్ట్స్, స్నో, ఇండివిడ్యువల్ డ్రైవింగ్ మోడ్స్ కూడా ఇందులో ఉన్నాయి. కోడియాక్‌లో హెక్సాగోనల్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్స్, కొత్త డీఆర్ఎల్ సిగ్నేచర్ అందించడం ద్వారా ఈ కారుకు చాలా అప్‌గ్రేడ్లు చేశారు.

స్కోడా కోడియాక్ వెనకవైపు డైనమిక్ టర్న్ ఇండికేటర్లు కూడా ఉన్నాయి. ఇది ఒక 7-సీటర్ కారు కావడం విశేషం. అప్‌డేట్ చేసిన కేబిన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 2 స్పోక్ స్టీరింగ్ వీల్ కూడా ఇందులో అందించారు. ఇందులో 12-వే అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ సీట్లను అందించారు. మై స్కోడా కనెక్ట్ యాప్ ద్వారా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు.

ఈ ధరలో ప్రస్తుతానికి 7-సీటర్ ప్రీమియం పెట్రోల్ ఎస్‌యూవీ ఇదొక్కటే. దీనికి పోటీ కూడా లేవు. 9 ఎయిర్‌బ్యాగ్స్, అడాప్టివ్ లైట్స్, హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ యూఎస్‌బీ టైప్-సీ పోర్టులు, 12-స్పీకర్ ఆడియో సిస్టం, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

View this post on Instagram
 
A post shared by ŠKODA India (@skodaindia)

Published at : 06 Feb 2022 10:26 PM (IST) Tags: Skoda Kodiaq Facelift launch Skoda Kodiaq Facelift Skoda Kodiaq Facelift SUV Skoda Kodiaq Facelift Price Skoda Kodiaq Facelift features Skoda Kodiaq Facelift specifications Skoda Kodiaq Facelift 2022 Soldout

సంబంధిత కథనాలు

Toyota Urban Cruiser Hyryder: టొయోటా హైరైడర్ వచ్చేసింది - టాప్ క్లాస్ ఫీచర్లతో - కారు మామూలుగా లేదుగా!

Toyota Urban Cruiser Hyryder: టొయోటా హైరైడర్ వచ్చేసింది - టాప్ క్లాస్ ఫీచర్లతో - కారు మామూలుగా లేదుగా!

Maruti Suzuki Brezza 2022: రూ.8 లక్షల్లోపే కొత్త బ్రెజా - మోస్ట్ ప్రీమియం ఫీచర్లు, లుక్!

Maruti Suzuki Brezza 2022: రూ.8 లక్షల్లోపే కొత్త బ్రెజా - మోస్ట్ ప్రీమియం ఫీచర్లు, లుక్!

Hero Passion XTEC: కొత్త ప్యాషన్ వచ్చేసింది - రూ.లక్ష లోపు బెస్ట్ బైక్!

Hero Passion XTEC: కొత్త ప్యాషన్ వచ్చేసింది - రూ.లక్ష లోపు బెస్ట్ బైక్!

Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!

Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!

Kia Sonet Sales Record: రెండేళ్లలోనే 1.5 లక్షల యూనిట్లు - కియా సోనెట్ సూపర్ సేల్స్ రికార్డు!

Kia Sonet Sales Record: రెండేళ్లలోనే 1.5 లక్షల యూనిట్లు - కియా సోనెట్ సూపర్ సేల్స్ రికార్డు!

టాప్ స్టోరీస్

KTR Letter To PM Modi : బీజేపీ సమావేశాల రియల్ అజెండా విద్వేషం, ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ లేఖ

KTR Letter To PM Modi : బీజేపీ సమావేశాల రియల్ అజెండా విద్వేషం, ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ లేఖ

Raghurama hIghcourt : 3, 4 తేదీల్లో అరెస్ట్ చేయవద్దు - రఘురామకు రిలీఫ్ ఇచ్చిన హైకోర్టు

Raghurama hIghcourt : 3, 4 తేదీల్లో  అరెస్ట్ చేయవద్దు - రఘురామకు రిలీఫ్ ఇచ్చిన హైకోర్టు

Ramya Raghupathi: ఆమెకు మాటిచ్చాను, నరేష్‌కు విడాకులు ఇవ్వను: రమ్య రఘుపతి

Ramya Raghupathi: ఆమెకు మాటిచ్చాను, నరేష్‌కు విడాకులు ఇవ్వను: రమ్య రఘుపతి

Gold Rate Hike: బంగారం భగ భగ! దిగుమతి పన్ను రెట్టింపు చేసిన కేంద్రం!

Gold Rate Hike: బంగారం భగ భగ! దిగుమతి పన్ను రెట్టింపు చేసిన కేంద్రం!