అన్వేషించండి

BaaS స్కీమ్‌తో ఎలక్ట్రిక్‌ కార్లు - రేటు తగ్గేను రూ.లక్షల్లో, km చొప్పున చెల్లిస్తే చాలు

భారత్‌లో MG, టాటా, మారుతీ ఎలక్ట్రిక్‌ కంపెనీలు తమ కార్లను BaaS స్కీమ్‌తో అందిస్తున్నాయి. దీనివల్ల కొనుగోలు ధర లక్షల్లో తగ్గుతుంది, కిలోమీటర్‌ చొప్పున బ్యాటరీకి అద్దె చెల్లించవచ్చు.

Electric Cars BaaS Scheme India: భారత్‌లో ఎలక్ట్రిక్‌ కార్లపై ఆసక్తి పెరుగుతోంది. కానీ ఒక పెద్ద సమస్య మాత్రం ఇంకా చాలామందిని వెనక్కి తగ్గిస్తోంది - అదే అధిక ముందస్తు ధర/కొనుగోలు ధర. బ్యాటరీ ప్యాక్‌ ఖరీదు ఎక్కువగా ఉండటం వల్లే ఎలక్ట్రిక్‌ కార్లు సాధారణ పెట్రోల్‌, డీజిల్‌ కార్ల కంటే ఖరీదుగా కనిపిస్తాయి.

ఈ సమస్యకు పరిష్కారంగా కొన్ని కంపెనీలు "బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌" (Battery as a Service, BaaS) స్కీమ్‌ను తీసుకొచ్చాయి. ఈ స్కీమ్‌ కింద, మీరు కారు కొనుగోలు చేసే సమయంలో బ్యాటరీ ధర చెల్లించాల్సిన అవసరం ఉండదు. దానికి బదులుగా, ప్రతి కిలోమీటర్‌ ప్రయాణానికి ఒక నిర్దిష్ట చార్జీ చెల్లిస్తారు. దీనివల్ల ముందస్తు ఖర్చు/కొనుగోలు ధర రూ.లక్షల్లో తగ్గుతుంది.

ప్రస్తుతం భారత్‌లో మూడు ప్రధాన కంపెనీలు ఈ విధానాన్ని అందిస్తున్నాయి - MG Motor India, Tata Motors & Maruti Suzuki. ప్రస్తుతం ఈ స్కీమ్‌తో అందుబాటులో ఉన్న మోడళ్లు ఇవే:

MG Comet EV

సాధారణ ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹7.63 లక్షల నుంచి

BaaS ప్రారంభ ధర: ₹4.92 లక్షలు

బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ఫీజు: ₹3.2 ప్రతి కిలోమీటర్‌కు

BaaS స్కీమ్‌తో ముందస్తు ధర సుమారు ₹2.71 లక్షలు తగ్గుతుంది. అంటే మీరు సేవ్‌ చేసే మొత్తంతో దాదాపు 85,000 కిలోమీటర్ల వరకు బ్యాటరీ అద్దె చెల్లించవచ్చు.

Tata Punch EV

సాధారణ ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹9.69 లక్షల నుంచి

BaaS ప్రారంభ ధర: ₹6.49 లక్షలు

సబ్‌స్క్రిప్షన్ ఫీజు: ₹2.6 ప్రతి కిలోమీటర్‌కు

ఇది ప్రస్తుతం భారత్‌లో అత్యల్ప బ్యాటరీ అద్దె చార్జీ ఉన్న ఎలక్ట్రిక్‌ కారు. ముందస్తు ధరలో సుమారు ₹3.20 లక్షలు తగ్గుతుంది.

MG Windsor EV

BaaS ప్రారంభ ధర: ₹9.99 లక్షలు

బ్యాటరీ ఎంపికపై ఆధారపడి చార్జీ: ₹3.9 నుంచి ₹4.5 ప్రతి కిలోమీటర్‌కు

ముందస్తు ఖర్చు తగ్గింపు: గరిష్టంగా ₹5.11 లక్షలు

చిన్న 38kWh బ్యాటరీకి తక్కువ చార్జీ, పెద్ద 52.9kWh బ్యాటరీకి ఎక్కువ చార్జీ ఉంటుంది.

Maruti Suzuki e Vitara

BaaS ప్రారంభ ధర: ₹10.99 లక్షలు

సబ్‌స్క్రిప్షన్ ఫీజు: ₹3.99 నుంచి ₹4.39 ప్రతి కిలోమీటర్‌కు

ముందస్తు ధర తగ్గింపు: గరిష్టంగా ₹5.50 లక్షలు

ఇది ప్రస్తుతం భారత్‌లో అత్యధిక ఆదా ఇస్తున్న ఎలక్ట్రిక్‌ మోడల్‌గా నిలిచింది.

MG ZS EV

BaaS ప్రారంభ ధర: ₹13 లక్షలు

బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్: ₹4.5 ప్రతి కిలోమీటర్‌కు

ముందస్తు ఖర్చు తగ్గింపు: గరిష్టంగా ₹5.24 లక్షలు

50.3kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే ఈ మోడల్‌ MG ఎలక్ట్రిక్‌ లైన్‌అప్‌లో ప్రీమియం ఎంపికగా నిలుస్తోంది.

BaaS తీసుకోవాలా?

రోజూ ఎక్కువగా ప్రయాణించే వాళ్లు, ప్రారంభంలో తక్కువ పెట్టుబడితో ఎలక్ట్రిక్‌ కారు కొనాలనుకునే వారు BaaS స్కీమ్‌ను పరిగణలోకి తీసుకోవచ్చు. కానీ కిలోమీటర్‌కు చెల్లించే అద్దె దీర్ఘకాలంలో ఎంత ఖర్చవుతుందో ముందుగానే లెక్కించుకోవాలి.

మొత్తంగా చూస్తే, తక్కువ ధరతో మరింత మందిని ఎలక్ట్రిక్‌ కార్ల వైపు మళ్లించేందుకు ఈ స్కీమ్ ఒక మంచి ఉపాయం. మీరు కూడా EV కొనాలని ఆలోచిస్తుంటే, ఈ BaaS ఆప్షన్లు మీకు ఉపయోగపడవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
మారుతి బలెనో కొనేవాళ్లు కొన్ని రోజులు ఆగండి, సెప్టెంబర్‌ 5న వచ్చే కొత్త మోడల్‌లో కీలక మార్పులు!
మారుతి బలెనోకు కొత్త లుక్‌ - సన్‌రూఫ్‌, యాంబియంట్‌ లైటింగ్‌ సహా చాలా కొత్త ఫీచర్లు
ఒకే ఛాసిస్‌.. కానీ లుక్‌, ఇంటీరియర్‌, ఫీచర్లలో భారీ తేడాలు.. మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌!
మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌ మధ్య ఇంత తేడానా? కొత్త పికప్‌ ట్రక్‌లో మారినవేంటో తెలుసా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget