iVoomi JeetX ZE: రూ.80 వేలలోపు ఎలక్ట్రిక్ స్కూటర్ - ఒక్క ఛార్జ్‌తో 170 కిలోమీటర్లు!
iVoomi Electric Scooter: ఐవూమీ బ్రాండ్ మనదేశంలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. అదే ఐవూమీ జీట్ఎక్స్ జెడ్ఈ.
iVoomi JeetX ZE Electric Scooter: భారతీయ మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఐవూమి సంస్థ విడుదల చేసింది. ఐవూమీ జీట్ఎక్స్ జెడ్ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతీయ మార్కెట్లో మూడు బ్యాటరీ ప్యాక్ సైజులలో విడుదల అయింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జింగ్‌లో 170 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఐవూమీ జీట్ఎక్స్ బుకింగ్ మే 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ స్కూటర్ డెలివరీ తేదీ గురించి కంపెనీ ఇంకా ఎలాంటి సమాచారాన్ని పంచుకోలేదు. కానీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడంతో బడ్జెట్ ఫ్రెండ్లీ ఈ-స్కూటర్లు కొనాలనుకునే వారికి మరొక ఆప్షన్ లభించినట్లు అయింది.
ఈ కొత్త స్కూటర్‌ను తయారు చేయడానికి తమకు 18 నెలలు పట్టిందని, ఈ స్కూటర్‌ను లక్ష కిలోమీటర్లకు పైగా డ్రైవ్ చేసి పరీక్షించామని ఐవూమీ తెలిపింది. ఇంతకుముందు కంపెనీ భారతీయ మార్కెట్లో జీట్ఎక్స్‌ను విడుదల చేసింది. ఇది ఇప్పటికీ మార్కెట్లో అందుబాటులో ఉంది. మూడు సంవత్సరాల క్రితం జీట్ఎక్స్ మార్కెట్లో లాంచ్ అయింది. అప్పటి నుంచి ఈ స్కూటర్ సుమారు 10 మిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.
8 కలర్ ఆప్షన్లలో కొత్త ఈ-స్కూటర్
ఐవూమీ జీట్ఎక్స్ జెడ్ఈ ఎనిమిది కలర్ వేరియంట్‌లతో మార్కెట్లోకి వచ్చింది. నార్డో గ్రే, ఇంపీరియల్ రెడ్, అర్బన్ గ్రీన్, పెరల్ రోజ్, ప్రీమియం గోల్డ్, సెరూలియన్ బ్లూ, మార్నింగ్ సిల్వర్, షాడో బ్రౌన్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. వీటిలో మీకు నచ్చిన ఏ వేరియంట్‌లోనైనా ఈ-స్కూటర్‌ని కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ 1,350 మిల్లీమీటర్ల వీల్ బేస్‌తో వస్తుంది. ఈ ఈ-స్కూటర్ పొడవు 760 మిల్లీమీటర్లు కాగా, సీటు ఎత్తు 770 మిల్లీమీటర్లుగానూ ఉంది. దీని వలన ప్రతి ఒక్కరూ ఈ స్కూటర్‌ను సులభంగా నడపవచ్చు. ఐవూమీ జీట్ఎక్స్ జెడ్ఈలో ఫుట్ స్పేస్, బూట్ స్పేస్ రెండూ ఎక్కువగా అందించారు.
ఫీచర్లు ఇలా...
ఐవూమీ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్లూటూత్ పరికరాలతో కనెక్ట్ చేయగల అప్లికేషన్‌తో వస్తోంది. దీని ద్వారా డిస్టెన్స్ టు ఎంప్టీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్‌లను కూడా స్క్రీన్‌పై చూడవచ్చు. ఇది కాకుండా జియో ఫేసింగ్ ఆఫర్ కూడా ఇస్తోంది.
ఐవూమీ ఎలక్ట్రిక్ స్కూటర్ పవర్‌ట్రెయిన్
ఐవూమీ జీట్ఎక్స్ జెడ్ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు బ్యాటరీ ప్యాక్ సైజులతో మార్కెట్లోకి వచ్చింది. ఇది 2.1 కేడబ్ల్యూహెచ్, 2.5 కేడబ్ల్యూహెచ్, 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను కలిగి ఉంది. ఇందులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 9.38 బీహెచ్‌పీ పవర్‌ను డెలివర్ చేస్తుంది. ఈ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ మోటార్ కంటే 20 శాతం తేలికగా ఉంటుంది. కంపెనీ ఈ బ్యాటరీ ప్యాక్ తయారీలో కూలింగ్ సిస్టంను మెరుగుపరిచింది. ఇది స్కూటర్‌ను 2.4 రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా చేసింది.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?
ఐవూమీ జీట్ఎక్స్ జెడ్ఈ ధర
ఐవూమీ జీట్ఎక్స్ జెడ్ఈ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.79,999గా ఉంది. రూ.80 వేల రేంజ్‌లో ఈ స్కూటర్ బెటర్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 170 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలదు.