Hyundai Venue Facelift: హ్యుండాయ్ కొత్త కారు వచ్చేస్తుంది... వావ్ అనిపించే లుక్, డిజైన్లు
హ్యుండాయ్ వెన్యూ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ వచ్చే సంవత్సరం మార్కెట్లో లాంచ్ కానుంది.
కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ తన కొత్త కారును వచ్చే సంవత్సరం లాంచ్ చేయనుంది. అదే హ్యుండాయ్ వెన్యూ ఫేస్ లిఫ్టెడ్ వెర్షన్. వెన్యూ కారు ఎప్పటినుంచో మార్కెట్లో ఉంది. ఇప్పుడు దీని ఫేస్ లిఫ్ట్ వెర్షన్ సేల్స్‌ను మరింత పెంచే అవకాశం ఉంది. క్రెటా, వెన్యూ మోడళ్లు మనదేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే హ్యుండాయ్ కార్లు. ఇప్పుడు లాంచ్ కానున్న కొత్త వెర్షన్ విటారా బ్రెజా, నెక్సాన్, సోనెట్‌లతో పోటీ పడనుంది.
ఇక స్టైలింగ్ విషయానికి వస్తే.. ఇందులో ఫ్రంట్ ఎండ్ డిజైన్ అందించారు. కొత్త గ్రిల్ లేదా బంపర్ డిజైన్ ఇందులో ఉండే అవకాశం ఉంది. దీని సైడ్‌లో కొత్త అలోయ్ వీల్ డిజైన్లు ఉండనున్నాయి. దీని వెనకవైపు కొత్త లుక్, డిఫరెంట్ టెయిల్ ల్యాంప్స్ ఉండనున్నాయి. దీని వెనకవైపు బంపర్ లుక్ కూడా మారనుంది. ఇందులో కొత్త కలర్ ఆప్షన్లు కూడా ఉండనున్నాయి.
దీని ఇంటీరియర్లు కూడా మారే అవకాశం ఉంది. పెద్ద టచ్ స్క్రీన్ కూడా ఇందులో అందించనున్నారు. సోనెట్‌కు పోటీనిచ్చే విధంగా ఇందులో కూడా 10.25 అంగుళాల టచ్ స్క్రీన్, అప్‌డేటెడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న వెన్యూ తరహాలో సన్‌రూఫ్, వైర్‌లెస్ చార్జర్, క్లైమెట్ కంట్రోల్ కూడా ఉండనున్నాయి.
ఇప్పుడు లాంచ్ కానున్న వేరియంట్‌లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉండనున్నాయి. కొంచెం స్పోర్ట్స్ లుక్‌తో ఉండే మోడల్‌తో పాటు ఐ20 లుక్‌తో ఉండే మోడల్ కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది.
ఈ కొత్త ఫేస్ లిఫ్ట్ వేరియంట్ వచ్చే సంవత్సరం లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు హ్యుండాయ్ మరిన్ని కార్లను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. క్రెటా, కొత్త టక్సన్, ఇతర ఎలక్ట్రానిక్ వాహనాల సరసన వెన్యూ ఫేస్ లిఫ్ట్ చేరనుంది.
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?