RC Book Transfer Online: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సులభంగా ఆర్సీని మార్చుకోవడం ఎలా? పూర్తి గైడ్!
Transfer RC Online: మీరు కొత్త వాహనం లేదా పాత వాహనం కొంటే, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను (RC) మీ పేరిట బదిలీ చేయించుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియలను ఈ కథనంలో చూద్దాం.

Transfer RC Book Online: వాహనం అమ్మినా, కొత్తగా కొనుగోలు చేసినా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) ట్రాన్స్‌ఫర్ చేయడం లీగల్‌గా తప్పనిసరి. ప్రస్తుతం... ఆంధ్రప్రదేశ్ (AP) & తెలంగాణ (TS) రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ఆన్‌లైన్‌లో సులభంగా పూర్తి చేయవచ్చు. మీరు నేరుగా RTOకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎక్కువ పనులు ఇంట్లో నుంచే పూర్తి చేయవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో RC బుక్ ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ విధానం
అవసరమైన డాక్యుమెంట్లు:
- ఒరిజినల్ RC బుక్
- ఫారం 29, 30 (తప్పులు లేకుండా నింపండి. అమ్మకందారు & కొనుగోలుదారు సంతకాలు ఉండాలి)
- వాహనం బీమా సర్టిఫికేట్ జికాక్స్ కాపీ
- PUC సర్టిఫికేట్
- అమ్మిన, కొనుగోలు చేసిన వ్యక్తుల PAN కార్డ్ జికాక్స్ కాపీలు
- చిరునామా రుజువు (ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ మొదలైనవి)
- ఛాసిస్ & ఇంజిన్ నంబర్ ఇన్‌ప్రింట్
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
- పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ (అవసరమైతే)
- కొనుగోలుదారుని అండర్‌టేకింగ్ డిక్లరేషన్
ఆన్‌లైన్ అప్లికేషన్ విధానం:
- → వెబ్‌సైట్: https://parivahan.gov.in
- → ‘Online Services’ లోకి వెళ్లి 'Vehicle Related Services' సెలెక్ట్ చేయండి
- → మీ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి ‘Proceed’ పై క్లిక్ చేయండి
- → మెనూలో ‘Miscellaneous’ → ‘Transfer of Ownership’ ఎంపిక చేయండి
- → కొత్త యజమాని వివరాలు, బీమా, చిరునామా సమాచారం ఇచ్చి ఫారాన్ని పూర్తి చేయండి
- → అవసరమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి
- → ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించండి
- → పేమెంట్ రసీదు & నింపిన ఫారం డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి
- → స్థానిక RTOలో వాహనాన్ని చూపించి డాక్యుమెంట్లు సమర్పించండి
- → మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (MVI) వాహన తనిఖీ పూర్తి చేసిన తర్వాత కొత్త యజమాని పేరుతో RC వస్తుంది
తెలంగాణలో RC బుక్ ట్రాన్స్‌ఫర్ - T-App Folio ద్వారా
అవసరమైన డాక్యుమెంట్లు:
- ఒరిజినల్ RC బుక్
- ఫారం 29, 30 (తప్పులు లేకుండా నింపండి. అమ్మకందారు & కొనుగోలుదారు సంతకాలు ఉండాలి)
- వాహనం బీమా సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ
- చిరునామా రుజువు (ఓటర్ ID, ఆధార్, విద్యుత్ బిల్ వంటివి)
- PUC సర్టిఫికేట్
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
ఆన్‌లైన్ స్టెప్స్ (T App Folio):
- → T App Folio మొబైల్ యాప్ ప్లే స్టోర్/యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి
- → రిజిస్టర్ పూర్తయ్యాక → Transport Department (RTA) సర్వీసెస్ సెలెక్ట్ చేయండి
- → ‘Registration’ → ‘Transfer of Ownership’ ఎంపిక చేయండి
- → Seller లేదా Buyer లో తగినదాని మీద క్లిక్ చేసి, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ & ఛాసిస్ చివరి 5 నంబర్లు ఎంటర్ చేయండి
- → కొత్త యజమాని వివరాలు, అడ్రస్, బీమా వివరాలు ఇవ్వండి
- → అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి
- → ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోండి
- → అపాయింట్‌మెంట్ తేదీన RTO కార్యాలయానికి ఒరిజినల్ డాక్యుమెంట్లు & వాహనం తీసుకెళ్లండి
- → వాహనం, పత్రాల పరిశీలన పూర్తయ్యాక 25 నుంచి 30 రోజుల్లో కొత్త RC జారీ అవుతుంది
RC ట్రాన్స్‌ఫర్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
→ Parivahan పోర్టల్‌లోకి వెళ్లండి
→ ‘Vehicle Related Services’ లోకి వెళ్లి ‘Transfer of Ownership’ మీద క్లిక్ చేయండి
→ మీ వాహనం నంబర్ ఎంటర్ చేసి స్టేటస్ ట్రాక్ చేయవచ్చు
మీ వాహనాన్ని ఇతర రాష్ట్రానికి బదిలీ చేస్తే, ముందుగా NOC (No Objection Certificate) తీసుకోవాలి. అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉండాలి. బదిలీ ఫీజులు వాహనం వయస్సు, ట్రాన్స్‌మిషన్, రంగు మార్పులు, మోడిఫికేషన్లు వంటి అంశాలపై ఆధారపడి మారవచ్చు. RCని ఆలస్యంగా ట్రాన్స్‌ఫర్ చేస్తే జరిమానా లేదా చట్టపరమైన ఇబ్బందులు రావచ్చు.





















