అన్వేషించండి

Hyundai i20 Mileage: హ్యుందాయ్ i20 వాస్తవ మైలేజ్‌ ఇంతా? - తెలుగు యూజర్ల అభిప్రాయాలు

Hyundai i20 Real Mileage: ఎంత గొప్ప బ్రాండ్‌ నుంచి వచ్చిన కార్‌ అయినా, భారతీయులు అడిగే మొదటి ప్రశ్న ఎంత ఇస్తుంది?. హ్యుందాయ్ i20 కారు మైలేజ్ ఎలా ఉందనే ప్రశ్నకు ఈ కథనంలో సమాధానం దొరుకుతుంది.

Hyundai i20 Real Mileage Real and Feedback: హ్యుందాయ్ ఐ20 కారుకు పాన్ ఇండియా రేంజ్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. మన దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన హాచ్‌బ్యాక్ కార్లలో ఇది ఒకటి. స్టైలిష్ డిజైన్, నమ్మదగిన బ్రాండ్, ఆధునిక ఫీచర్లు అన్నీ కలిసి ఈ ఫోర్‌వీలర్‌కు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనూ దీనికి డిమాండ్ పెరుగుతోంది. అయితే, "ఈ కార్ మైలేజ్ ఎలా ఉంది?" అనే ప్రశ్నకు, ఇప్పటికే ఈ కారును వినియోగిస్తున్న తెలుగు ప్రజల సమాధానం ఎలా ఉందో ఈ కథనంలో చూద్దాం.

వేరియంట్   ట్రాన్స్‌మిషన్  యూజర్లు తెలిపిన మైలేజ్ (kmpl)
ఐ20 మాగ్నా  మాన్యువల్  16 – 18
ఐ20 స్పోర్ట్‌  మాన్యువల్  16 – 18
ఐ20 ఆస్టా   మాన్యువల్  16 – 17
ఐ20 IVT   ఆటోమేటిక్   15 – 16
టాప్-ఎండ్   ఆటోమేటిక్   15 – 16

సిటీ డ్రైవింగ్: 13 – 15 kmpl

హైవే డ్రైవింగ్: 17 – 19 kmpl

ఆటోమేటిక్ వేరియంట్లలో: 14 – 16 kmpl

2. Hyundai i20 విషయంలో తెలుగు ప్రజల అనుభవాలు

బిల్ట్ క్వాలిటీ & ఫీచర్లపై మెచ్చుకోలు: ‘‘i20ని సంవత్సరం నుంచి వినియోగిస్తున్నాను. మైలేజ్ 17–18 వస్తోంది. ఫీచర్లు, ఇంటీరియర్ ప్రీమియమ్ లుక్ ఇస్తాయి.’’

సిటీ మైలేజ్‌పై అసంతృప్తి: ‘‘హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే మైలేజ్ కేవలం 13–14 kmpl రావడం కాస్త నిరాశపరిచింది.’’

ఆటోమేటిక్ వేరియంట్లు: ‘‘IVT వేరియంట్ తీసుకున్నా. సిటీలో 14, హైవేలో 16 వచ్చింది. పెట్రోల్ మాన్యువల్‌తో పోలిస్తే తక్కువ.’’

దీర్ఘకాలిక వినియోగదారుల వాఖ్యలు: ‘‘i20తో 1 లక్ష కిలోమీటర్లు దాటి ప్రయాణించాను. మైలేజ్ 15 kmpl స్థిరంగా వచ్చింది. చిన్నపాటు నిర్వహణలు తప్ప పెద్దగా ఖర్చు పడలేదు.’’

3. మైలేజ్‌ను ప్రభావితం చేసే అంశాలు

డ్రైవింగ్ స్టైల్: త్వరగా గేర్లు మార్చడం, అధిక వేగం, బ్రేకింగ్ ఎక్కువగా వాడటం వల్ల మైలేజ్ తగ్గుతుంది.

వాహన ఆరోగ్యం: టైర్ ప్రెషర్, ఇంజిన్ ఆయిల్, ఫిల్టర్ వంటి వాటిని క్రమం తప్పకుండా చెక్ చేస్తే మైలేజ్ మెరుగవుతుంది.

లోడ్ & ట్రాఫిక్: ఎక్కువ మంది ప్రయాణిస్తే, ట్రాఫిక్‌లో ఎక్కువగా స్టాప్-స్టార్ట్ ఉండడం వల్ల మైలేజ్ ప్రభావితమవుతుంది.

4. సోషల్ మీడియాలో వినిపిస్తున్న అభిప్రాయాలు:

‘‘2024లో ఐ20 స్పోర్ట్‌ కొనుగోలు చేశాను. హైవేలో 18 వచ్చింది, సర్‌ప్రైజ్ అయ్యాను. కానీ సిటీలో మాత్రం 14–15 kmplకి పరిమితమైంది.’’

‘‘ప్రియాంక (హైదరాబాద్): ‘16-17 మైలేజ్ వస్తోంది. ఫ్యామిలీ ట్రిప్స్‌కి ఐ20 బెస్ట్.’’

‘‘N-Line మోడల్ డ్రైవ్ చాలా ఫన్. కానీ మైలేజ్ మాత్రం 14–15 kmpl మాత్రమే వచ్చింది.’’

5. ఇతర కార్లతో పోల్చితే ఎలా?

మార్కెట్లో ఉన్న బాలెనో, ఆల్ట్రోస్ లాంటి హ్యాచ్‌బ్యాక్‌లతో పోలిస్తే మైలేజ్‌లో ఐ20 కొంత వెనుకబడింది.

మోడల్ యూజర్లు చెప్పిన మైలేజ్ (kmpl)
మారుతి బాలెనో 20 – 22
టాటా ఆల్ట్రోస్  18 – 20
హ్యుందాయ్ ఐ20 15 – 19

6. మైలేజ్ పెంచాలంటే ఏం చేయాలి?

  • సాఫ్ట్ డ్రైవింగ్ చేయాలి
  • టైర్ ప్రెషర్ కరెక్ట్‌గా ఉంచాలి
  • ట్రాఫిక్‌లో ఆగినప్పుడు ఇంజిన్ ఆఫ్ చేయాలి
  • నిబంధనలు పాటిస్తూ డ్రైవ్ చేయాలి

చివరిగా, నిజాయితీగా ఏం చెప్పొచ్చు? 
తెలుగు వినియోగదారుల అనుభవాల ప్రకారం, హ్యుందాయ్ ఐ20 మైలేజ్ సిటీ ట్రాఫిక్‌లో సాధారణంగా 13–15 kmpl, హైవేలో 17–19 kmpl మధ్య ఉంటోంది. ఆటోమేటిక్ వేరియంట్‌లో ఈ నంబర్‌ ఇంకాస్త తగ్గొచ్చు. అయితే మైలేజ్ కంటే ఎక్కువగా ఫీచర్లు, స్టైల్, బ్రాండ్‌ను చూసేవాళ్లు ఐ20 విషయంలో ఆసక్తిని కనబరుస్తున్నారు. డ్రైవింగ్‌ స్టైల్‌, మెయింటెనెన్స్‌ బాగుంటే మంచి మైలేజ్ సాధించడం సాధ్యమే.

టాప్ హెడ్ లైన్స్

Driving Licence Renewal: RTO ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు! డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్‌ను ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో ఇలా చేయండి!
డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగుస్తోందా? ఇంట్లోనే ఆన్‌లైన్‌లో రెన్యూవల్ చేసుకోండి.. కేవలం 12 స్టెప్స్‌లో!
Kia Carens Clavisలో ఏ వేరియంట్‌ ధర ఎంత? మిడ్‌ వేరియంట్‌లో ఏ ఫీచర్లున్నాయి? పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో పూర్తి వివరాలు
Kia Carens Clavis లో 11 వేరియంట్లు.. ధర, ఫీచర్ల పరంగా మీకు ఏది బెస్ట్?
Tata Cars Price Hike: టాటా కారు కొనేవాళ్లకు భారీ షాక్‌.. డిసెంబర్ నుంచి పెరగనున్న ICE, EV మోడళ్ల ధరలు
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌.. దాదాపు రూ.15,000 అదనపు భారం వేస్తున్న టాటా
AdBlue In Cars: డీజిల్ కారు ఓనర్లు, డ్రైవర్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం.. AdBlue ఎప్పుడు నింపాలి? ధర ఎంత?
డీజిల్ కారులో AdBlue అంటే ఏమిటి? ఇది అయిపోతే ఇంజిన్ మళ్లీ స్టార్ట్ కాదా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Union Cabinet Decisions: ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Dog Kills Leopard Cub: కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
MyTDP App: 10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Embed widget