Honda Ye S7 EV: టెస్లాకు పోటీనిచ్చే హోండా యే ఎస్7 ఈవీ - సింగిల్ ఛార్జ్‌తో ఎన్ని కిలోమీటర్లు!
Honda New Car: హోండా కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని పరిచయం చేసింది. అదే హోండా యే ఎస్7 ఈవీ. ఇది టెస్లాకు గట్టి పోటీని ఇవ్వనుందని సమాచారం. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
Honda Ye S7 EV Unveiled: హోండా ఇటీవల చైనాలో కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని పరిచయం చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి హోండా యే ఎస్7 అని పేరు పెట్టారు. ఈ ఎలక్ట్రిక్ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. టెస్లా కార్లకు ఈ కారు గట్టి పోటీనిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది బీజింగ్ ఆటో షోలో హోండా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని పరిచయం చేసింది.
హోండా యే ఎస్7 ఈవీ డిజైన్ ఎలా ఉంది?
ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రూపకల్పన గురించి మాట్లాడుతూ కంపెనీ దీనికి షార్ప్, ఆకర్షణీయమైన ఫ్రంట్ ఫాసియాను అందించింది. ఇది వై ఆకారపు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌ను కలిగి ఉంది. అలాగే ఎల్ఈడీ డీఆర్ఎల్స్ కూడా ఇందులో చూడవచ్చు. ప్రక్కన, కారులో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, కెమెరా ఆధారిత ఓఆర్వీఎం కూడా ఉన్నాయి. అలాగే వెనుక భాగంలో ఎల్ఈడీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి కారు లుక్‌ను మరింత ఎలివేట్ చేస్తాయి.
హోండా యే ఎస్7 ఈవీ ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఇప్పుడు మనం దీని ఫీచర్లను పరిశీలిస్తే హోండా కొత్త ఎస్‌యూవీ పెద్ద డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. దీనితో పాటు డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా ఉంది. ఇది కారు ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేయడానికి సహాయపడుతుంది. ఇవి మాత్రమే కాకుండా మల్టీ ఫ్లేర్డ్ డ్యాష్‌బోర్డ్‌తో డ్యూయల్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్‌ను కూడా కలిగి ఉంది. ఇది మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌తో పాటు అనేక ఇతర ఆధునిక ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో ఉన్నాయి.
Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్ వెర్షన్ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్
హోండా యే ఎస్7 ఈవీ పవర్‌ట్రెయిన్ ఇలా...
హోండా యే ఎస్7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌ను కలిగి ఉంటుంది. ఇది బోర్న్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ కారు సింగిల్ మోటార్ ఆర్‌డబ్ల్యూడీ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 268 బీహెచ్‌పీ శక్తిని జనరేట్ చేస్తుంది.
దీంతో పాటు ఏడబ్ల్యూడీ డ్యూయల్ మోటార్ సెటప్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది 469 బీహెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఫుల్ ఛార్జింగ్‌తో దాదాపు 500 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలదని తెలుస్తోంది. అయితే దీని ధరల గురించి ఎటువంటి సమాచారం అందుబాటులోకి రాలేదు. ఈ కారు భారతదేశంలో లాంచ్ అవుతుందా కాదా అన్నది కూడా తెలియరాలేదు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ కారు టెస్లా కార్లకు గట్టి పోటీనిస్తుంది.
హోండా ఇప్పటివరకు మనదేశంలో ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయలేదు. అయితే త్వరలో కొన్ని ఎలక్ట్రిక్ కార్లు హోండా కంపెనీ నుంచి మనదేశంలో లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా హోండా ఎలివేట్ ఈవీ గురించి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏది ముందు లాంచ్ అవుతుందో చూడాలి!
Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి