Mahindra Thar ROXX: మహీంద్రా థార్ 5 డోర్స్ వెర్షన్ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్
Thar ROXX Latest News: మహీంద్రా థార్ ROXX మరిన్ని ఫీచర్స్‌ను జోడిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది పనోరమిక్ సన్‌రూఫ్‌తో వస్తుందని తాజాగా కంపెనీనే ప్రకటించింది.

Mahindra Thar ROXX Price: మహీంద్రా కంపెనీకి చెందిన థార్ మోడల్ ఎస్‌యూవీ ఏ రేంజ్‌లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడు డోర్లు (రెండు వైపులా ఒక్కోటి, వెనుక మరొకటి) ఉండే ఈ వెహికిల్ ను కార్ లవర్స్ చాలా ఆదరించారు. అయితే, థార్‌లో అన్ని కార్ల మాదిరిగా ఒక్కోవైపున రెండు డోర్లు ఉంటే బాగుండు అని ఆశించేవారు చాలా మందే ఉన్నారు. వారికోసమే మహీంద్రా కొత్త థార్ ROXX ను లాంచ్ చేస్తున్నట్లుగా ఎప్పుడో ప్రకటించింది.
మహీంద్రా థార్ 3 డోర్ మోడల్‌లో చాలా ఫీచర్లు లోటుగా ఆటో లవర్స్ చెబుతుంటారు. అందుకే అయితే కొత్తగా రాబోయే థార్ ROXX మరింత ఎక్కువ ఫీచర్స్‌ను జోడిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇది పనోరమిక్ సన్‌రూఫ్‌తో వస్తుందని కంపెనీ వెల్లడించింది. థార్ 5-డోర్ ఇప్పుడు XUV 700 మాదిరిగానే పనోరమిక్ సన్‌రూఫ్‌ను కలిగి ఉండనుంది. స్కార్పియో Nలో కూడా అందుబాటులో లేని ఫీచర్‌ను కొత్త థార్ ROXX లో మహీంద్రా అందిస్తోంది. స్కార్పియో Nలో సాధారణ సన్‌రూఫ్ మాత్రమే ఉంటుంది. అయితే ROXX లో ఈ పనోరమిక్ సన్ రూఫ్ ఇవ్వడం అంటే అది ప్రీమియంగానే భావిస్తున్నారు.
పనోరమిక్ సన్‌రూఫ్ వాయిస్ కమాండ్‌ల ద్వారా కూడా తెరుచుకునేలా డిజైన్ చేశారు. రూఫ్ టాప్ లో ఎక్కువ భాగాన్ని ఇది కవర్ చేస్తుంది. థార్ ROXX 5-డోర్ల థార్ మాత్రమే కాదు.. ఇది స్కార్పియో N ప్లాట్‌ఫారమ్‌పై బేస్ అయి ఉంటుంది. ROXX పనోరమిక్ సన్‌రూఫ్‌తో పాటు 360 డిగ్రీ కెమెరా, ADAS లెవల్ 2 సహ మరిన్ని ప్రీమియం ఫీచర్‌లను థార్ ROXX లో అందిస్తున్నారు.
అయితే, థార్ ROXX లో బహుశా టాప్ ఎండ్‌లో ఈ పనోరమిక్ సన్‌రూఫ్‌తో వస్తుందని అంటున్నారు. ఇతర వేరియంట్‌లు చిన్న స్టాండర్డ్ సన్‌రూఫ్ కలిగి ఉండొచ్చని అంటున్నారు. ROXX టర్బో పెట్రోల్, డీజిల్ వేరియంట్స్‌లో అందుబాటులోకి రానుంది. ROXX థార్ 3 డోర్ కంటే ఎక్కువ ప్రీమియమ్‌గా ఉండడం వల్ల దాని ధర కూడా అదే స్థాయిలో ఉంటుందని అంటున్నారు.
SUV అయిన ఈ మహీంద్రా థార్ ROXX ధరను వచ్చే నెల 15వ తేదీన లాంచ్ చేయబోతున్నారు. అప్పుడే దాని అసలైన ధర వివరాలు తెలుస్తాయి. థార్ లో చాలా కాలంగా ఎదురుచూస్తున్న 5 డోర్ వెర్షన్ కావడంతో, ROXX వేరియంట్.. 3 డోర్స్ వేరియంట్ కన్నా సేల్స్ లో దుమ్ములేపాలనే లక్ష్యంతో ఉన్నట్లుగా ఆటో నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

