అన్వేషించండి

Renault Duster Hybrid: రెనాల్ట్ డస్టర్‌కి సూప‌ర్ క్రేజ్: 2026 బుకింగ్స్ క్లోజ్.. సీఎన్జీ వేరియంట్‌పై అప్డేట్!

Renault Duster Hybrid: ఇండియాలో రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ మోడళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. లాంచ్‌కు ముందే 2026కి సంబంధించి యూనిట్ల బుకింగ్ పూర్త‌యిన‌ట్లు తెలుస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వేరియంట్లకు భారీ స్పందన.
  • 2026 వరకు కేటాయించిన మొత్తం హైబ్రిడ్ యూనిట్లు ఇప్పటికే బుక్ అయ్యాయి.
  • హైబ్రిడ్ మోడల్స్‌కు మెట్రో నగరాల్లో 39% కస్టమర్ల ఆసక్తి.
  • సీఎన్‌జీ వెర్షన్‌పై కంపెనీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Renault Duster Hybrid: ప్రముఖ కార్ల తయారీ సంస్థ రేనాల్ట్ (Renault), భారత్‌లో తన ఐకానిక్ మోడల్ 'డస్టర్'ను రూ. 10.49 లక్షల నుండి రూ. 18.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అధికారికంగా విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం కంపెనీ కేవలం టర్బో-పెట్రోల్ వేరియంట్ల ధరలను మాత్రమే వెల్లడించింది. దీపావళి సమయానికి హైబ్రిడ్ వేరియంట్లు రోడ్లపైకి రానున్నాయి. అయితే హైబ్రిడ్ మోడల్ ధరలు ప్రకటించకముందే కస్టమర్ల నుండి ఊహించని స్పందన లభించింది. 2026కి కేటాయించిన మొత్తం హైబ్రిడ్ యూనిట్లు ఇప్పటికే బుక్ అయిపోయిన‌ట్లు స‌మాచారం.

హైబ్రిడ్ వేరియంట్లపై అర్బన్ కస్టమర్ల మొగ్గు

జనవరి 26న డస్టర్ భారత్‌లో అడుగుపెట్టినప్పటి నుండి ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. తాజాగా జరిగిన లాంచ్ ఈవెంట్‌లో రేనాల్ట్ ఇండియా వీపీ ఫ్రాన్సిస్కో హిడాల్గో మాట్లాడుతూ, హైబ్రిడ్ పవర్‌ట్రైన్ పట్ల కస్టమర్ల ఆసక్తి తమ అంచనాలను మించిపోయిందని తెలిపారు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో సుమారు 39 శాతం మంది హైబ్రిడ్ వేరియంట్లనే ఎంచుకుంటున్నారని తెలిపారు. దీనివల్ల ప్రస్తుతం హైబ్రిడ్ ఆర్డర్లను కంపెనీ నిలిపివేసిందని, చెన్నై ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే పనుల్లో నిమగ్నమై ఉన్నామని వెల్ల‌డించారు. దీపావళి సమయంలో మళ్లీ బుకింగ్స్ ఓపెన్ చేస్తామని పేర్కొన్నారు.

డస్టర్ సీఎన్‌జీ (CNG) పై అప్డేట్

డస్టర్ బ్రాండ్ ఇమేజ్‌కు సీఎన్‌జీ సెట్ అవుతుందా లేదా అనే విషయంలో కంపెనీ ఆచితూచి అడుగులు వేస్తోంది. సాధారణంగా డస్టర్ ఒక స్పోర్టీ ఎస్‌యూవీగా గుర్తింపు పొందింది. సీఎన్‌జీ వల్ల ఆ ఇమేజ్ దెబ్బతినకూడదని ఇంజనీరింగ్ విభాగం భావిస్తోంది. ఒకవేళ భవిష్యత్తులో కస్టమర్ల నుండి గట్టి డిమాండ్ వస్తే మాత్రం సీఎన్‌జీ వెర్షన్‌ను పరిశీలిస్తామని హిడాల్గో పేర్కొన్నారు. అయితే ఆ వెర్ష‌న్ సాధారణ ఇంజిన్ కాకుండా 'టర్బో సీఎన్‌జీ' అయ్యే అవకాశం ఉందని ఆయన హింట్ ఇచ్చారు.

అదే ప్ల‌స్ పాయింట్..

మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీ విపరీతంగా ఉన్నప్పటికీ, డస్టర్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా హైబ్రిడ్ టెక్నాలజీతో ఇంధన ఖర్చును తగ్గించుకోవాలనుకునే నగరవాసులకు ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారింది. టర్బో-పెట్రోల్ ఇంజిన్ పవర్, హైబ్రిడ్ వేరియంట్ల మైలేజీ ఈ కారుకు ప్లస్ పాయింట్లుగా నిలుస్తున్నాయి. తాజా బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే, రేనాల్ట్ సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్‌గా మొదలైందని విశ్లేష‌కులు అంటున్నారు.

Frequently Asked Questions

కొత్త రేనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వేరియంట్లకు ఊహించని స్పందన ఎందుకు లభించింది?

హైబ్రిడ్ వేరియంట్లు రోడ్లపైకి రాకముందే, 2026కి కేటాయించిన మొత్తం యూనిట్లు బుక్ అయిపోయాయి. నగరవాసులు ముఖ్యంగా హైబ్రిడ్ మోడల్స్ పట్ల ఆసక్తి చూపారు.

డస్టర్ హైబ్రిడ్ వేరియంట్ బుకింగ్స్ ప్రస్తుతం ఎందుకు నిలిపివేశారు?

హైబ్రిడ్ పవర్‌ట్రైన్ పట్ల కస్టమర్ల ఆసక్తి అంచనాలను మించిపోయింది. దీంతో, చెన్నై ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే పనుల్లో కంపెనీ నిమగ్నమై ఉంది.

రేనాల్ట్ డస్టర్ సీఎన్‌జీ (CNG) వెర్షన్‌ను ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది?

ప్రస్తుతానికి సీఎన్‌జీ వెర్షన్‌పై కంపెనీ ఆచితూచి అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో కస్టమర్ల నుండి గట్టి డిమాండ్ వస్తే, 'టర్బో సీఎన్‌జీ' వెర్షన్‌ను పరిశీలించే అవకాశం ఉంది.

కొత్త డస్టర్‌కు ప్రధాన ఆకర్షణలు ఏమిటి?

హైబ్రిడ్ టెక్నాలజీతో ఇంధన ఖర్చును తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా మారింది. టర్బో-పెట్రోల్ ఇంజిన్ పవర్, హైబ్రిడ్ వేరియంట్ల మైలేజీ దీనికి ప్లస్ పాయింట్లు.

టాప్ హెడ్ లైన్స్

బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని 50 ఏళ్లుగా వాడుతున్న బ్రెజిల్.. ఇప్పుడు అక్కడి కార్లు, బైకుల పరిస్థితి ఏంటి?
బ్రెజిల్‌లో 50 ఏళ్లుగా ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వినియోగం - అక్కడి కార్లు, బైక్‌లకు ఏం కాలేదా?
రోజూ కాలేజీ, ఆఫీస్‌కు వెళ్లిరావడానికి బెస్ట్ ఆప్షన్.. రూ.15,000 లోపే వచ్చే ఎలక్ట్రిక్‌ సైకిళ్లు ఇవే
పెట్రోల్ ఖర్చుకు చెక్.. రూ.15,000 లోపే స్టైలిష్‌ ఎలక్ట్రిక్ సైకిళ్లు, 40km వరకు ప్రయాణం!
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget