నిస్సాన్ ఎక్స్-ట్రయిల్ కారు మనదేశంలో లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. రూ.లక్ష టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఈ కారు ధరను రేపే (ఆగస్టు 1) రివీల్ చేయనున్నారు. 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇందులో ఉండనుంది. 20 అంగుళాల అల్లోయ్ వీల్స్‌తో ఈ కారు మార్కెట్లోకి రానుంది. పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్‌తో నిస్సాన్ ఎక్స్-ట్రయిల్ లాంచ్ కానుందని తెలుస్తోంది. క్రోమ్ అవుట్ లైన్, వీ ఆకారంలోని గ్రిల్‌తో ఈ కారు లాంచ్ కానుంది. మూడు కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఆగస్టులోనే ఈ కారు మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది.