ప్రస్తుతం మనదేశంలో రూ.లక్షలోపు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏవో చూద్దాం. ఓలా ఎస్1 - దీని ధర మనదేశంలో రూ.85 వేల రేంజ్‌లో ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 121 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. బౌన్స్ ఇన్‌ఫినిటీ ఈ1 - దీని ధర రూ.68,999 నుంచి ప్రారంభం కానుంది. సింగిల్ ఛార్జ్‌తో ఇది 85 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. హీరో ఎలక్ట్రిక్ ఎన్‌వైఎక్స్ హెచ్ఎక్స్ - దీని ధర రూ.67,540గా ఉంది. దీన్ని ఛార్జింగ్ పెట్టడానికి నాలుగైదు గంటలు పడుతుంది. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా హెచ్ఎక్స్ - దీని ధర రూ.65,640గా ఉంది. సింగిల్ ఛార్జ్‌తో ఇది 122 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది ఫుల్‌గా ఛార్జ్ అవ్వడానికి నాలుగైదు గంటల సమయం తీసుకుంటుంది.