అన్వేషించండి

Honda City Sport: సైలెంట్‌గా మార్కెట్‌లోకి వచ్చిన సిటీ 'స్పోర్ట్‌' - కేవలం కొన్ని కార్లే ఉన్నాయ్‌!

Honda City Sport Launched: హోండా తన ప్రసిద్ధ మిడ్-సైజ్ సెడాన్ సిటీలో కొత్త 'స్పోర్ట్' వేరియంట్‌ను మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. కంపెనీ ఈ మోడల్‌ను పరిమిత సంఖ్యలో అమ్మకానికి పెట్టింది.

Honda City Sport Price, Mileage And Features In Telugu: డా కార్స్ ఇండియా, తన పాపులర్‌ మిడ్-సైజ్ సెడాన్ సిటీ స్పోర్ట్ 2025 కొత్త స్పోర్టీ వెర్షన్‌ను సైలెంట్‌గా లాంచ్‌ చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర (Honda City Sport ex-showroom price) రూ. 14.89 లక్షలు. తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌-రోడ్‌ ధర (Honda City Sport on-road price) రూ. 17.25 లక్షల వరకు ఉంటుంది. ఇది పరిమిత యూనిట్ల ఎడిషన్, ముఖ్యంగా కుర్రకారును దృష్టిలో పెట్టుకుని ఈ కారును డిజైన్‌ చేశారు.

సిటీ స్పోర్ట్ ఎడిషన్‌ను హోండా సిటీ CVT పెట్రోల్ వెర్షన్ ఆధారంగా రూపొందించారు. దీనికి అద్భుతమైన విజువల్ అప్‌గ్రేడ్స్‌, ప్రీమియం ఇంటీరియర్‌ & అధునాతన భద్రత సాంకేతికతలతో ఈ కారును తయారు చేశారు. ఈ కారు లుక్‌ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచబడటమే కాకుండా యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా కొత్త స్థాయికి తీసుకెళ్లారు.

డిజైన్ ఎలా ఉంది?
స్పోర్టీ లుక్ & యూత్‌ఫుల్ డిజైన్‌తో హోండా సిటీ స్పోర్ట్ 2025 మార్కెట్లోకి టైరు పెట్టింది. దీని ముందు భాగంలో నిగనిగలాడే బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, బ్లాక్ ట్రంక్ లిప్ స్పాయిలర్ ఏర్పాటు చేశారు. ఇంకా.. షార్క్ ఫిన్ యాంటెన్నా, స్పోర్ట్ బ్యాడ్జింగ్, మల్టీ-స్పోక్ గ్రే అల్లాయ్ వీల్స్ & బ్లాక్ ORVM ఈ కారుకు బోల్డ్ & యునిక్‌ అప్పియరెన్స్‌ ఇచ్చాయి.

ఇంటీయర్‌ ఎలా ఉంది?
ఈ కారు లోపలి భాగంలో పూర్తిగా నల్లటి లెథరెట్ సీట్లు, ఎరుపు రంగు స్ట్రిచింగ్‌, డాష్‌బోర్డ్ & డోర్ ట్రిమ్‌లపై ఎరుపు రంగు యాక్సెంట్స్‌, నల్లటి రూఫ్ లైనర్, 7-కలర్‌ రిథమిక్ యాంబియంట్ లైటింగ్ వంటి ప్రీమియం లుకింగ్‌ ఫీచర్లు ఉన్నాయి. వీటివల్ల, ఈ కారులో కూర్చున్న ప్రయాణీకులకు స్పోర్టీ & ప్రీమియం ఫీలింగ్‌ కలుగుతుంది. మెకానికల్‌గా చూస్తే.. ఈ కారు 121 PS పవర్‌ను & 145 Nm టార్క్‌ను జనరేట్‌ చేసే మునుపటి 1.5-లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజిన్ (E20 అనుకూలత)ను కలిగి ఉంది. ఈ ఇంజిన్‌ను CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ & ప్యాడిల్ షిఫ్టర్స్‌తో యాడ్‌ చేశారు. హోండా సెన్సింగ్ ADAS టెక్నాలజీని ఈ మోడల్‌లో చేర్చారు, ఇది లేన్ కీప్ అసిస్ట్, కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ & హై బీమ్ అసిస్ట్ వంటి అత్యాధునిక భద్రత కవచాలను ప్రయాణీకులకు రక్షణగా మోహరిస్తుంది. సిటీ స్పోర్ట్ లీటరుకు 18.4 కి.మీ. మైలేజీ ఇవ్వగలదని కంపెనీ తెలిపింది. 

కలర్‌ ఆప్షన్స్‌
హోండా సిటీ స్పోర్ట్ సెడాన్‌ మూడు రంగుల్లో లభిస్తుంది - రేడియంట్ రెడ్ మెటాలిక్, మెటియోరాయిడ్ గ్రే మెటాలిక్ & ప్లాటినం వైట్ పెర్ల్ (ప్రీమియం కలర్). 

స్టైల్, డ్రైవింగ్‌ అంటే ఉత్సాహం & డైలీ యుటిలిటీని పొందాలనుకునే కస్టమర్ల కోసం హోండా సిటీ స్పోర్ట్‌ ఎడిషన్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు హోండా కార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కునాల్ బహల్ చెప్పారు. ఈ సెగ్మెంట్‌లో దీని ధర మరింత ఆకర్షణీయమైన ఆప్షన్‌గా వివరించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Modi congratulates Pawan Kalyan: కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
YSRCP Latest News:
"ఇరుసుమండ బ్లో అవుట్ వెనుక కుట్ర- కోట్లు చేతులు మారాయి" వైసీపీ సంచలన ఆరోపణలు 
Bhogi Mantalu 2026: ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
Digital Arrest Scams: డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం

వీడియోలు

Anil Ravipudi on Social Media Trolls | మీమర్స్ ట్రోల్స్ వేసుకుంటే వేసుకోండి..నేను ఎంజాయ్ చేస్తా |ABP
Rohit Sharma Records Ind vs NZ ODI | క్రిస్ గేల్ రికార్డును అధిగమించిన హిట్‌మ్యాన్
RCB vs UP WPL 2026 | ఆర్సీబీ సూపర్ విక్టరీ
Washington Sundar Ruled Out | గాయంతో బాధ‌ప‌డుతున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్
Devdutt Padikkal record in Vijay Hazare Trophy | దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi congratulates Pawan Kalyan: కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
YSRCP Latest News:
"ఇరుసుమండ బ్లో అవుట్ వెనుక కుట్ర- కోట్లు చేతులు మారాయి" వైసీపీ సంచలన ఆరోపణలు 
Bhogi Mantalu 2026: ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
Digital Arrest Scams: డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
Nara Vari Palle Sankranti: ముఖ్యమంత్రి కుటుంబం అంతా నారా వారి పల్లెలోనే - హుషారుగా సంక్రాంతి సంబరాలు !
ముఖ్యమంత్రి కుటుంబం అంతా నారా వారి పల్లెలోనే - హుషారుగా సంక్రాంతి సంబరాలు !
Adilabad Latest News: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
Jaggannathota Prabhala Teertham : సంక్రాంతి సంబరాలకు గోదావరి వెళ్తున్నారా? ఈ వేడుక చూడకుండా అసలు రావద్దు!
సంక్రాంతి సంబరాలకు గోదావరి వెళ్తున్నారా? ఈ వేడుక చూడకుండా అసలు రావద్దు!
PM Modi New Office: త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
Embed widget