By: ABP Desam | Updated at : 15 Apr 2022 12:46 AM (IST)
Edited By: Eleti Saketh Reddy
హోండా సిటీ ఈ: హెచ్ఈవీ హైబ్రిడ్ కారు మనదేశంలో లాంచ్ అయింది. (Image Credits: Honda)
హోండా మనదేశంలో కొత్త కారును రివీల్ చేసింది. అదే హోండా సిటీ ఈ:హెచ్ఈవీ. ఇది ఒక హైబ్రిడ్ కారు. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. మేలో ఈ కారు లాంచ్ కానుంది. ఈ కొత్త హైబ్రిడ్ సెడాన్ కారు మెరుగైన మైలేజ్, మంచి టెక్నాలజీని అందించనుంది. ఈ కారు నిజానికి మనదేశంలో ఇప్పటికే లాంచ్ కావాల్సింది కానీ కరోనా వైరస్ కారణంగా ఆలస్యం అయింది.
ఈ కారు ఎక్స్‌టీరియర్స్ చూడటానికి ఐదో తరం హోండా సిటీ తరహాలో ఉంది. అయితే ఇంతకు ముందు వచ్చిన వెర్షన్ల కంటే ఇందులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కారు బయటవైపు బ్లాక్ కలర్ హైలెట్‌గా నిలిచింది. కారు ముందువైపు కొత్త తరహా గ్రిల్‌ను అందించారు. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ కూడా ఈ కారులో ఉన్నాయి. వెహికిల్ వెనకవైపు ఈ:హెచ్ఈవీ హైబ్రిడ్ బ్యాడ్జ్ చూడటానికి స్టైలిష్‌గా ఉంది.
హోండా సిటీ ఈ:హెచ్ఈవీ క్యాబిన్‌లో డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్‌ను అందించారు. వన్ టచ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ కూడా ఉంది. దీంతోపాటు ఎల్ఈడీ ఇంటీరియర్ రూం ల్యాంప్స్, యాంబియంట్ లైటింగ్‌లు కారులో ప్రత్యేక ఆకర్షణ. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో కొత్త తరహా డిజైన్‌ను అందించారు. దీంతోపాటు హెచ్‌డీ డిస్‌ప్లే కూడా ఉండనుంది.
ఈ కారు ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టంలో 8 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 8 స్పీకర్ సరౌండ్ సౌండ్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, హోండా సెన్స్ టెక్నాలజీ, ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఎజైల్ హ్యాండ్లింగ్ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు అందించారు. నాలుగు టైర్లకు డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఆటోమేటిక్ బ్రేక్ హోల్డ్‌లు కూడా ఉండటం విశేషం. లేన్ కీప్ కెమెరాను కూడా కంపెనీ అందించింది.
రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్న ఐసీఈ ఇంజిన్‌ను ఈ కారులో అందించారు. మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. దీని మైలేజ్ 26.5 కిలోమీటర్లుగా ఉంది. హోండా ప్రత్యేకమైన సెల్ఫ్ చార్జింగ్ ఫీచర్‌ను అందించారు. 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ డీవోహెచ్‌సీ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్, ఇంటెలిజెంట్ పవర్ ఇంజిన్‌ను ఇందులో అందించారు. ఇందులో లిథియం ఇయాన్ బ్యాటరీని అందించారు. ఈ కారు లీటర్ పెట్రోలుకు 26.5 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుంది.
ఈ కారును ఎక్స్‌టర్నల్‌గా చార్జ్ చేసే అవకాశం లేదు. ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్ అందించే రీజనరేటివ్ బ్రేకింగ్ ద్వారా బ్యాటరీ చార్జ్ అవుతుంది. ఆ పవర్‌నే డ్రైవింగ్‌కు ఉపయోగించుకోగలం. ప్రస్తుతం మనదేశంలో వోల్వో ఎక్స్‌సీ 90, బీఎండబ్ల్యూ 7 సిరీస్, లెక్సస్ ఎన్ఎక్స్, లెక్సస్ ఎల్‌సీ, ఎంజీ హెక్టర్ ప్లస్‌లే హైబ్రిడ్ కార్లు. వీటిలో మొదటి మూడు కార్లూ ప్రీమియం విభాగంలో ఉన్నాయి. వీటి ధర రూ.60 లక్షలకు పైగానే ఉంది. ఎంజీ హెక్టర్ ప్లస్ ధర రూ.16.14 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. హోండా సిటీ హైబ్రిడ్ మోడల్ ఎంజీ హెక్టర్ ప్లస్‌తో పోటీ పడనుంది. హోండా లేటెస్ట్ హైబ్రిడ్ కారును డీలర్ల వద్ద రూ.25 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలంటే కంపెనీ వెబ్ సైట్ ద్వారా రూ.5,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
World Costliest Car: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు - ఏకంగా రూ.1108 కోట్లు - దీని ప్రత్యేక ఏంటంటే?
Mahindra Scorpio N: కొత్త మహీంద్రా స్కార్పియో లాంచ్ అయ్యేది అప్పుడే - ప్రకటించిన కంపెనీ!
Maruti Suzuki New Facility: కొత్త ప్లాంట్ పెడుతున్న మారుతి సుజుకి - రూ.20 వేల కోట్ల పెట్టుబడి, 13 వేల ఉద్యోగాలు - ఎక్కడో తెలుసా?
Santro Stopped: ఆ బడ్జెట్ కారును ఆపేసిన హ్యుండాయ్ - ఉత్పత్తి నిలిపివేసిన కంపెనీ!
Hyundai Santro: చిన్న కార్లు కొనే కస్టమర్లకు ‘హ్యుందాయ్’ బ్యాడ్ న్యూస్, ఆ హ్యాచ్‌బ్యాక్ కారు ఇక కనిపించదా?
Whatsapp End Support: ఈ ఫోన్లకు వాట్సాప్ ఇక పనిచేయదు - అధికారికంగా తెలిపిన మెటా - మీ మొబైల్స్ ఉన్నాయేమో చూసుకోండి!
CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ పాఠాలు- టెక్ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్‌లో బిగ్ డీల్
Thank You: 'థాంక్యూ' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
Sara Ali Khan: లండన్ లో ఎంజాయ్ చేస్తోన్న సారా అలీఖాన్