Best Selling Scooter: జూపిటర్‌ను దాటిన ఆ స్కూటీ - సేల్స్‌లో టాప్‌లోకి!
Best Selling Scooter in India: భారతదేశంలో హోండా యాక్టివా స్కూటీ... అత్యధికంగా అమ్ముడుపోతున్న స్కూటీగా నిలుస్తోంది. ఇది టీవీఎస్ జూపిటర్‌ను కూడా దాటేసింది.
Honda Activa: హోండా ద్విచక్ర వాహనాలు దేశంలో అద్భుతాలు సృష్టిస్తున్నాయి. హోండా బైక్‌లు, స్కూటర్‌లను భారతీయ ప్రజలు ఇష్టపడతారు. ఇంతలో హోండా యాక్టివా మళ్లీ అద్భుతాలు చేసింది. ఈ స్కూటర్ టీవీఎస్ జూపిటర్‌ను ఓడించి అమ్మకాలలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. హోండా యాక్టివా స్కూటీని దేశంలో నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు అన్ని ప్రాంతాల ప్రజలు బాగా ఇష్టపడతారు.
హోండా యాక్టివా సేల్స్ విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2024 జూన్‌లో ఈ స్కూటర్‌కు సంబంధించి దాదాపు 2.33 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఈ స్కూటర్ అమ్మకాలతో పోలిస్తే ఇది దాదాపు 78 శాతం ఎక్కువ కావడం విశేషం. హోండా యాక్టివాలో 109 సీసీ ఇంజన్ అందించారు.
దీని ఇంజన్ 7.73 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ స్కూటర్ లీటరుకు 47 కిలోమీటర్ల ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజీని అందించనుంది. అలాగే దీని బరువు దాదాపు 106 కిలోలుగా ఉంది. హోండా యాక్టివా 5.3 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంది. హోండా యాక్టివా గరిష్టంగా గంటకు 85 కిలోమీటర్లు. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.78 వేల నుంచి మొదలై రూ.84 వేల వరకు ఉంది.
Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్ వెర్షన్ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్
టీవీఎస్ జూపిటర్ సేల్స్ ఇలా...
టీవీఎస్ కంపెనీకి సంబంధించి జూపిటర్ అత్యధికంగా అమ్ముడైన స్కూటర్‌గా పరిగణిస్తారు. 2024 జూన్‌లో దాదాపు 72,100 మంది టీవీఎస్ జూపిటర్‌ని కొనుగోలు చేశారు. గతేడాది ఈ స్కూటర్ విక్రయాలతో పోలిస్తే ఇది 12 శాతం పెరుగుదల కనబరిచింది. ఈ స్కూటర్‌లో కంపెనీ 109 సీసీ ఇంజన్‌ను అందించింది. ఈ ఇంజన్ 7.7 బీహెచ్‌పీ పవర్, 8.8 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ స్కూటర్ లీటరుకు 48 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదు. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 78 కిలోమీటర్ల వరకు ఉంది. టీవీఎస్ జూపిటర్‌లో 5.8 లీటర్ ఇంధన ట్యాంక్ అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ బరువు దాదాపు 107 కిలోలు. టీవీఎస్ జూపిటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.77 వేల నుంచి ప్రారంభమై రూ.92 వేల వరకు ఉంది.
మరోవైపు హోండా యాక్టివా 125లో ఐడిలింగ్ స్టాప్ సిస్టంను అనే ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ సహాయంతో స్కూటీ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు దానంతట అదే ఆగిపోతుంది. దీని కారణంగా పెట్రోల్ సేవ్ అవుతుందని కంపెనీ అంటోంది.
Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి
The Idling stop system of Activa 125 lets you navigate through traffic stops easily and save fuel consumption.
— Honda 2 Wheelers India (@honda2wheelerin) August 20, 2024
For further details, please give us a missed call at +919484865040 or visit our website. #Honda #ThePowerOfDreams #Activa125 pic.twitter.com/adu8ofW3N7