అన్వేషించండి

Great E-Scooter: రూ.60 వేలలోనే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

గుజరాత్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల బ్రాండ్ గ్రేటా మనదేశంలో కొత్త ఈ-స్కూటర్‌లను లాంచ్ చేసింది. వీటి ధర రూ.60 వేల నుంచి ప్రారంభం కానుంది.

గుజరాత్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ అయిన గ్రేటా ఎలక్ట్రిక్ స్కూటర్స్ భారతదేశంలో నాలుగు కొత్త ఈ-స్కూటర్‌లను విడుదల చేసింది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో చేరిన తాజా కంపెనీగా అవతరించింది. హార్పర్, ఎవెస్పా, గ్లైడ్, హార్పర్ జెడ్ఎక్స్‌లే ఈ నాలుగు స్కూటర్లు. వీటి ధర రూ.60,000 నుంచి రూ.92,000 మధ్య ఉంటాయి. 2019 చివరిలో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) నుండి తమ ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆమోదం లభించిందని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ఎప్పుడో లాంచ్ కావాల్సి ఉన్నప్పటికీ కరోనావైరస్ కారణంగా ఆలస్యం అయింది. 

ఈ గ్రేటా ఎలక్ట్రిక్ స్కూటర్‌లు 48-వోల్ట్ లేదా 60-వోల్ట్ లిథియం-అయాన్ బ్యాటరీని ఉపయోగించుకుంటాయి. వినియోగదారులకు నాలుగు బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అవే వీ2 (లిథియం + 48వీ), వీ2+ (లిథియం + 60వీ), వీ3 (లిథియం +  48వీ) మరియు వీ3+ (లిథియం + 60వీ). ఈ స్కూటర్‌లు ఒక్కో చార్జ్‌కు 70 కి.మీ నుండి 100 కి.మీ రైడింగ్ రేంజ్‌ని అందిస్తాయి. బ్యాటరీని పూర్తిగా చార్జ్ కావడానికి నాలుగు గంటల సమయం పడుతుంది.

ఇప్పుడు ఫీచర్ల విషయానికి వస్తే.. హార్పర్, ఎవెస్పా, హార్పర్ జెడ్ఎక్స్ వేరియంట్లలో డ్రమ్ డిస్క్ బ్రేక్‌లను అందించారు. అయితే గ్లైడ్ డ్యూయల్ డిస్క్‌లో హైడ్రాలిక్ బ్రేక్‌లు ఉన్నాయి. వీటితోపాటు కీలెస్ స్టార్ట్, స్మార్ట్ షిఫ్ట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్‌ప్లే, రివర్స్ మోడ్, ఏటీఏ సిస్టమ్, యాంటీ-థెఫ్ట్ అలారం వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ సందర్భంగా గ్రేటా ఎలక్ట్రిక్ స్కూటర్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ మెహతా మాట్లాడుతూ, "గ్రేటా ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్లో లభించిన స్పందనతో మేము చాలా సంతోషిస్తున్నాం. దేశీయ మార్కెట్ నుంచి మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ నుంచి కూడా చాలా మంది వీటిపై ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. నేపాల్ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి లభించాక, అక్కడ కూడా రెండు షోరూమ్‌లను ప్రారంభించాము. ప్రస్తుతం, గ్రేటా ఎలక్ట్రిక్ స్కూటర్ల లైనప్ యూరప్‌లో అడ్వాన్స్‌డ్ ట్రయల్స్‌లో ఉంది. త్వరలో చట్టపరమైన అనుమతులు కూడా వచ్చేస్తాయి. అది జరిగితే, మనం త్వరలో గ్రేటాను యూరోపియన్ రోడ్లపై కూడా చూడవచ్చు." అన్నారు.

Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!

Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!

Also Read: అదిరిపోయిన కొత్త సెలెరియో లుక్.. ఎలా ఉందో చూసేయండి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan:  అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ -  కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
YSRCP Leader Roja: తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
Advertisement

వీడియోలు

పాక్ ప్లేయర్ తిక్క కుదిర్చిన ICC.. కానీ మన సూర్యకి అన్యాయం!
రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ బర్త్ డే స్పెషల్
ఫెషాలీ, దీప్తి కాదు.. తెలుగమ్మాయి వల్లే గెలిచాం: రవిచంద్రన్ అశ్విన్
అబ్బాయిలకో న్యాయం?  అమ్మాయిలకో న్యాయమా?
3i Atlas interstellar object | 9 ఏళ్లలో 3 సార్లు.. భూమి కోసమా? సూర్యుడి కోసమా? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan:  అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ -  కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
YSRCP Leader Roja: తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
Mexican president kiss: మెక్సికో అధ్యక్షురాలికి చేదు అనుభవం - ప్రజల కష్టాలు తెలుసుకుంటూంటే హత్తుకుని ముద్దుపెట్టుకున్న వ్యక్తి !
మెక్సికో అధ్యక్షురాలికి చేదు అనుభవం - ప్రజల కష్టాలు తెలుసుకుంటూంటే హత్తుకుని ముద్దుపెట్టుకున్న వ్యక్తి !
India Test Team Against South Africa : దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టును ప్రకటించిన BCCI, టీంలోకి వచ్చిన రిషబ్ పంత్
దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టును ప్రకటించిన BCCI, టీంలోకి వచ్చిన రిషబ్ పంత్
Train Accident: చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
Kumbh Mela Mona Lisa: మహాకుంభ్ వైరల్ గర్ల్ మోనాలిసా కొత్త లుక్‌లో మళ్లీ సెన్సేషన్ -   తెలుగు సినిమాల్లో ఎంట్రీ
మహాకుంభ్ వైరల్ గర్ల్ మోనాలిసా కొత్త లుక్‌లో మళ్లీ సెన్సేషన్ - తెలుగు సినిమాల్లో ఎంట్రీ
Embed widget