5 Star Safety Cars: ధర ₹10 లక్షల లోపే - అన్నీ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ గెలుచుకున్న టాప్ కార్లు, పూర్తి లిస్ట్
5 Star Safety Budget Cars: భారత్ NCAP, గ్లోబల్ NCAPల్లో 5 స్టార్ రేటింగ్ గెలుచుకున్న రూ.10 లక్షల లోపు టాప్ కార్ల లిస్ట్. EV, SUV, సెడాన్ వేరియంట్లు ఈ లిస్ట్‌లో ఉన్నాయి.

Cars Under Rs 10 Lakh With 5 Star Safety Rating: ఇప్పటి కార్ల కొనుగోళ్లలో సేఫ్టీ కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ధర, మైలేజ్ మాత్రమే చూసే యుగాన్ని మనం దాటి వచ్చాం. కార్ల వేగం & ట్రాఫిక్ పెరిగిన నేపథ్యంలో, కారు బయ్యర్లు ఇప్పుడు ఫ్యామిలీ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. భారత్ NCAP, గ్లోబల్ NCAP లాంటి సంస్థలు వాహనాలను పరీక్షించి, 1 నుంచి 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నాయి. ఈ రేటింగ్ ఆధారంగా కారు ఎంత సురక్షితం అనేది తేలిపోతుంది.
రూ.10 లక్షల ధర లోపులో, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ గెలుచుకున్న కార్ల లిస్ట్:
1. నిస్సాన్ మాగ్నైట్
- ధర: రూ. 5.62 లక్షలు (ఎక్స్-షోరూమ్)
- ఇది లిస్ట్‌లో అతి చౌకైన 5 స్టార్ కార్. గ్లోబల్ NCAPలో 26.51 పాయింట్లు (AOP) & 36 పాయింట్లు (COP) సాధించింది. సేఫ్టీ ఫీచర్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్, ABS, ట్రాక్షన్ కంట్రోల్, ESP, TPMS ఉన్నాయి.
2. మారుతి సుజుకి డిజైర్
- ధర: రూ. 6.84 లక్షలు
- ఇది 5 స్టార్ రేటింగ్ సాధించిన ఏకైక సెడాన్. భారత్ NCAP, గ్లోబల్ NCAP రెండింటిలోనూ 5 స్టార్ సాధించింది. సేఫ్టీ కిట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్, ESC, ISOFIX సీటు అంకరేజ్, ఓవర్‌స్పీడ్ అలర్ట్స్ ఉన్నాయి.
3. టాటా నెక్సాన్
- ధర: రూ. 7.99 లక్షలు
- భారత్ NCAP, గ్లోబల్ NCAP రెండు టెస్టుల్లోనూ 5 స్టార్ సాధించిన SUV. 6 ఎయిర్‌బ్యాగ్స్, హిల్ హోల్డ్, రివర్స్ సెన్సార్లు వంటి ఫీచర్లతో సేఫ్టీ విషయంలో బెస్ట్ ఎంపిక.
4. మహీంద్రా XUV 3XO
- ధర: రూ. 7.99 లక్షలు
- చౌకైన SUV అయినా సేఫ్టీ విషయంలో కంప్రమైజ్ కాలేదు. 29.36 పాయింట్లు (AOP) & 43 పాయింట్లు (COP) సాధించింది. బేస్ వేరియంట్ నుంచే 6 ఎయిర్‌బ్యాగ్స్, ESC స్టాండర్డ్‌గా వస్తాయి.
5. స్కోడా కైలాక్ (Kylaq)
- ధర: రూ. 8.25 లక్షలు
- స్కోడా పేరుకి తగినట్టే క్వాలిటీని నిలబెట్టుకుంది. 5 స్టార్ రేటింగ్‌తో పాటు, 45 COP స్కోరు కూడా అందుకుంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, ట్రాక్షన్ కంట్రోల్, రోల్-ఓవర్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
6. కియా సైరోస్
- ధర: రూ. 9.50 లక్షలు
- కియా కంపెనీకి భారత్ NCAPలో మొదటి 5 స్టార్ రేటింగ్ తెచ్చిన కారు ఇదే. AOPలో 30.21 పాయింట్లు సాధించింది. సేఫ్టీ కిట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్, హిల్ హోల్డ్, VSM, TPMS ఉన్నాయి.
7. టాటా పంచ్ EV
- ధర: రూ. 9.99 లక్షలు
- లిస్ట్‌లో ఉన్న ఏకైక EV. భారత్ NCAPలో 31.46 పాయింట్లు (AOP), 45 పాయింట్లు (COP) సాధించింది. 6 ఎయిర్‌బ్యాగ్స్, హిల్ హోల్డ్, ISOFIX, ESP వంటి ఫీచర్లతో EV సెగ్మెంట్‌లో బెస్ట్.
8. టాటా కర్వ్ (Curvv)
- ధర: రూ. 10 లక్షలు
- కూపే స్టైల్ SUV అయిన కర్వ్, AOPలో 29.50 పాయింట్లు, COPలో 43.66 పాయింట్లు సాధించింది. 6 ఎయిర్‌బ్యాగ్స్, ESP, 3-పాయింట్ సీటు బెల్ట్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్‌గా ఉంటాయి.
కారు కొనుగోలు సమయంలో ధర మాత్రమే కాదు, సేఫ్టీ రేటింగ్ కూడా ముఖ్యం. రూ.10 లక్షల లోపు కార్లలో 5 స్టార్ రేటింగ్ సాధించిన ఈ మోడల్స్, మీ కుటుంబాన్ని సురక్షితంగా కాపాడటమే కాకుండా, మీ బడ్జెట్‌కు కూడా సరిపోతాయి.





















