కొత్త GSTతో Maruti Swift మహా చవక - ఏ వేరియంట్ బెస్ట్ డీల్ అవుతుందో తెలుసా?
Maruti Swift GST Price Cut: మారుతి సుజుకి స్విఫ్ట్ ఎక్స్-షోరూమ్ ధర ఆరున్నర లక్షల రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, జీఎస్టీ కోతతో ఈ రేటు దిగి వచ్చింది.

Maruti Swift New GST Price - Cheapest Variant: మారుతి సుజుకి పాపులర్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్‌లో తాజా మోడల్ స్పోర్టీగా, స్టైలిష్‌గా కనిపిస్తోంది. ముందు భాగంలో ఇచ్చిన షార్ప్ హెడ్‌ల్యాంప్స్ & అగ్రెసివ్ గ్రిల్ డిజైన్ యువతరాన్ని బాగా ఆకట్టుకుంటుంది. సైడ్ ప్రొఫైల్‌లో ఇచ్చిన స్మూత్ లైన్స్ కారుకి డైనమిక్ లుక్ ఇస్తాయి. వెనుక భాగంలో కొత్తగా డిజైన్ చేసిన టెయిల్‌ల్యాంప్స్ ఈ హ్యాచ్‌బ్యాక్ లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి.
మారుతి సుజుకి స్విఫ్ట్ ఇప్పుడు గతంలో కంటే తక్కువ ధరలో లభిస్తుంది. GST 2.0 సంస్కరణల తర్వాత, కంపెనీ అన్ని వేరియంట్‌ల ధరను తగ్గించింది. ఇప్పుడు, కొత్త GST నిర్మాణం కింద, స్విఫ్ట్ కొనే ప్రతి కస్టమర్ రూ. 1.06 లక్షల వరకు ఆదా చేసే బంపర్ ఆఫర్ పొందుతారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్-షోరూమ్ ధర
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో, మారుతి సుజుకి స్విఫ్ట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.49 లక్షల నుంచి ప్రారంభమై రూ. 9.65 లక్షల వరకు (Maruti Swift ex-showroom price, Hyderabad Vijayawada) ఉంటుంది. GST 2.0 తర్వాత స్విఫ్ట్ వివిధ వేరియంట్లపై వివిధ డిస్కౌంట్లు ఇస్తున్నారు.
మారుతి స్విఫ్ట్ ఏ వేరియంట్‌పై ఎంత సేవ్ అవుతుంది?
LXI 1.2L MT ---- రూ. 55,000 తగ్గింపు
VXI 1.2L MT ---- రూ. 63,000 తగ్గింపు
VXI (O) 1.2L MT ---- రూ. 65,000 తగ్గింపు
ZXI 1.2L MT ---- రూ. 71,000 తగ్గింపు
ZXI+ 1.2L MT ---- రూ. 77,000 తగ్గింపు
VXI 1.2L AMT ---- రూ. 67,000 తగ్గింపు
VXI (O) 1.2L AMT ---- రూ. 69,000 తగ్గింపు
ZXI 1.2L AMT ---- రూ. 75,000 తగ్గింపు
ZXI+ 1.2L AMT ---- రూ. 81,000 తగ్గింపు
VXI CNG 1.2L MT ---- రూ. 70,000 తగ్గింపు
VXI (O) CNG 1.2L MT ---- రూ. 73,000 తగ్గింపు
ZXI CNG 1.2L MT ---- రూ. 1.06,000 తగ్గింపు
మారుతి స్విఫ్ట్ CNG ఫీచర్లు
పెట్రోల్ వెర్షన్ కాకుండా, మారుతి స్విఫ్ట్ CNG తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్. CNG వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.20 లక్షల నుంచి రూ. 9.20 లక్షల వరకు (Maruti Swift CNG ex-showroom price, Hyderabad Vijayawada)ఉంటుంది. CNG మోడ్‌లో ఈ కారు లీటరకు 32.85 కి.మీ. మైలేజీ ఇస్తుంది. ప్రయాణీకుల భద్రత కోసం, ఈ కారులోని అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా ఇస్తున్నారు. స్విఫ్ట్‌లో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ & ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి చాలా మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌ల భద్రత, మోడ్రన్ ఫీచర్లు, స్టైలిష్ డిజైన్ & నమ్మకమైన పనితీరు కారణంగా మధ్య తరగతి కుటుంబాలకు మారుతి స్విఫ్ట్ ఒక ఉత్తమ ఎంపిక.






















