అన్వేషించండి

Ethanol Ready Bikes: త్వరలో మార్కెట్లోకి ఇథనాల్ రెడీ బైక్స్.. Royal Enfield నుంచి Yamaha వరకు వీటిపైనే ఫోకస్

Royal Enfield | భారత ఆటోమొబైల్ రంగంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పు కేవలం ఎలక్ట్రిక్ వాహనాలకే కాలేదు. పెట్రోల్ ప్రత్యామ్నాలయపై కంపెనీలు ఫోకస్ చేస్తున్నాయి.

భారత ఆటోమొబైల్ రంగం వేగంగా మారుతోంది. ఇప్పుడు ఈ మార్పు కేవలం ఎలక్ట్రిక్ వాహనాలకే పరిమితం కాలేదు. పెట్రోల్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి, కాలుష్యాన్ని మరింత  తగ్గించడానికి ప్రభుత్వం, ఆటోమొబైల్ కంపెనీలు కలిసి కొత్త ఇంధన వ్యవస్థలపై వర్క్ చేస్తున్నాయి. ఈ దిశగా ఇప్పుడు ఇథనాల్-రెడీ బైక్‌లపై పనులు జరుగుతున్నాయి. ఇవి కేవలం సాధారణ పెట్రోల్‌తోనే కాకుండా ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20, E85 వంటివి) తో కూడా వెళ్తాయి. దాంతో మీ ప్రయాణాన్ని మరింత తేలిక చేస్తాయి.  

భారత్‌లోని కొన్ని ప్రధాన టూవీలర్ కంపెనీలకు చెందిన ఇలాంటి బైక్‌లు టెస్టింగ్ సమయంలో కనిపించాయి. వీటిలో Royal Enfield, సుజుకీ (Suzuki) Yamaha Motor Company వంటి ప్రముఖ కంపెనీల పేర్లు ఉన్నాయి. ఈ కంపెనీల కొన్ని ప్రోటోటైప్ బైక్‌లు రోడ్డుపై టెస్టింగ్ సమయంలో కనిపించడంతో వైరల్ అవుతున్నాయి. ఇది రాబోయే రోజుల్లో  భారత్‌లో ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ కలిగిన బైక్‌లకు షిఫ్ట్ చేయనున్నాయి. 

ఇథనాల్ అంటే ఏమిటి?
ప్రభుత్వం తరపున కూడా ఆటో కంపెనీలకు మంచి ప్రోత్సాహం లభిస్తోంది. భవిష్యత్తులో ఇథనాల్ బ్లెండింగ్‌ను E85, అంతకంటే ఎక్కువ స్థాయికి తీసుకువెళ్లాలని యోచిస్తున్నారు. దీని ఉద్దేశ్యం కేవలం ఇంధన ధర, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం మాత్రమే కాదు. రోజురోజుకూ కాలుష్యాన్ని నియంత్రించడం. ఇథనాల్ అనేది చెరకు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల నుండి తయారు అవుతున్న ఒక బయో-ఫ్యూయల్. అందువల్ల ఇది పర్యావరణానికి సాపేక్షంగా మెరుగైనదిగా భావిస్తారు. పెట్రోల్, డీజిల్ కంటే తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. 

Royal Enfield కి చెందిన ఒక బైక్ టెస్టింగ్ సమయంలో అత్యధికంగా చర్చల్లో నిలిచింది. దీని ఒక టెస్ట్ మోడల్‌ రోడ్డుపై కనిపించడంతో దీనిపై ఆశలు పెరుగుతున్నాయి. దానిపై E85 fuel అనే స్టిక్కర్ ఉంది. అంటే ఈ బైక్ 85 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనంతో డ్రైవ్ చేయడానికి రెడీ చేస్తున్నారు. లేదా కనీసం ఆ స్థాయి టెస్టింగ్‌ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.  డిజైన్ చాలా వరకు ప్రస్తుత మోడల్ లాగే ఉంది. కానీ ఇంజిన్, ఫ్యూయల్ సిస్టమ్‌లో తగినట్లు మార్పులు చేశారు. ఈ తద్వారా ఇథనాల్‌తో ఎక్కువ కాలం నడిచినా ఎలావంటి ఇబ్బంది కలగవు.

పలు మోడళ్లపై టెస్టింగ్ 
అదేవిధంగా Suzuki, యమహా మోటార్ కంపెనీ (Yamaha Motor Company) కూడా తమ మోడళ్లపై పనిచేస్తున్నాయి. ఈ కంపెనీల వెహికల్స్ గురించి ఎక్కువ వివరాలు బహిర్గతం కాలేదు. కానీ ఈ కంపెనీలు తమ పాపులర్ కమ్యూటర్, మిడ్-సెగ్మెంట్ బైక్‌లను భవిష్యత్ ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేస్తున్నాయి. ముఖ్యంగా 100cc నుంచి 350cc సెగ్మెంట్‌లో ఈ సాంకేతికతను వేగంగా అమలు చేసే అవకాశం ఉంది. భారత్‌లో ఈ సెగ్మెంట్ అతిపెద్ద బైక్ మార్కెట్.

ఇథనాల్-రెడీ బైక్‌ల వల్ల ప్రయోజనం..
కొత్తగా సిద్ధం అవుతున్న ఈ ఇథనాల్ బైకులతో కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. ఎక్కువ సాంకేతిక సమస్యలు లేకుండా పలు రకాల ఇంధనాలతో వెళ్తాయి. దీనివల్ల పెట్రోల్‌లో ఎంత ఇథనాల్ కలిసి ఉందనే ఆందోళన ఉండదు. అలాగే, ఇథనాల్ వాడకం వల్ల కర్బన ఉద్గారాలు కొంతమేర తగ్గే అవకాశం ఉండటంతో ఇది పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

యూత్‌ కోసం కొత్త 4V ఇంజిన్‌తో వచ్చిన Bajaj Pulsar N160.. ఏ వేరియంట్‌ కొనాలి?
కొత్త Bajaj Pulsar N160 లో ఐదు వేరియంట్లు.. మీరు ఏ వేరియంట్‌ కొంటారు?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget