అన్వేషించండి

Highest Resale value Bikes: అత్యధిక రీసేల్ వాల్యూ కలిగిన టూవీలర్స్ ఇవే.. 3 ఏళ్ల తర్వాత తగ్గని క్రేజ్

Hero Splendor to Bajaj Pulsar 150 | భారత్‌లో టూవీలర్స్ కొనుగోలు చేసేటప్పుడు రీసేల్ వాల్యూ గురించి ఆలోచిస్తుంటారు. సరైన బైక్‌ కొంటే దాన్ని అమ్మినా మంచి ధర పలుకుతుంది.

భారత్‌లో టూ-వీలర్ కేవలం ప్రతి ఇంటికి అవసరమైన వస్తువుగా మారుతోంది. కొత్త బైక్ లేదా స్కూటర్ కొనేటప్పుడు కేవలం ధర, మైలేజీ, ఫీచర్లతో పాటు రీసేల్ వాల్యూ కూడా చూస్తున్నారు. కొన్ని ఏళ్ల తర్వాత టూవీలర్ అమ్మితే ఎంత ధర వస్తుందో అని కూడా ఆలోచిస్తారు. ముఖ్యంగా 1 లక్ష రూపాయల కంటే తక్కువ బడ్జెట్‌లో ఉన్న విషయంలో రీసేల్ కీలకం అవుతుంది. హీరో (Hero), హోండా (Honda), బజాజ్ వంటి బ్రాండ్లు ఈ విషయంలో కస్టమర్లు నమ్మదగ్గ వాహనాలుగా ఉన్నాయి.  ఎందుకంటే ఈ కంపెనీల వాహనాలు ఎక్కువ కాలం మన్నిక రావడంతో పాటు సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో వీటి డిమాండ్ ఎప్పుడూ తగ్గదు.

హీరో స్ప్లెండర్, హోండా యాక్టివా (Honda Activa)
హీరో స్ప్లెండర్ (Hero Splendor) భారత్‌లో అత్యంత నమ్మదగిన బైక్‌గా భావిస్తారు. దీని ఇంజన్ సింపుల్‌గా ఉండటంతో మన్నికలోనూ కస్టమర్ల నమ్మకం చూరగొంది. దీనివల్ల ఈ బైక్ ఎక్కువ ఖర్చు లేకుండా ఏళ్ల తరబడి నడుస్తుంది. అందుకే 2-3 ఏళ్ల తర్వాత కూడా రీసేల్ చేస్తే మంచి ధర లభిస్తుంది. మరోవైపు, స్కూటర్ విభాగంలో హోండా యాక్టివా అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటీ. దీని స్మూత్ ఇంజన్, సులభమైన వాడకం దీనిని అన్ని ఆడ, మగ అని వ్యత్యాసం లేకుండా అన్ని వయసుల వారికి ఫేవరెట్‌గా మార్చాయి. నగరాల్లో దీనికి డిమాండ్ ఎంత ఎక్కువగా ఉందంటే, సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో కూడా త్వరగా అమ్ముడై క్యాష్ వచ్చేలా చేస్తుంది. 

హోండా షైన్, బజాజ్ పల్సర్ 150 (Bajaj Pulsar 150)
మీరు కొంచెం ఎక్కువ పవర్, ఫీచర్లు కోరుకుంటే, హోండా షైన్ (Honda Shine), బజాజ్ పల్సర్ 150 మంచి ఛాయిస్.  హోండా షైన్ 125cc విభాగంలో స్మూత్ పర్ఫార్మెన్స్‌తో రాణిస్తోంది. ఈ బైక్ ఎక్కువ కాలం మన్నుతుంది. రీసేల్ లో కూడా మంచి ధరను ఇస్తుంది. ఇక బజాజ్ పల్సర్ 150 యూత్ మెచ్చే బైక్. దీని స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ ఇంజన్ దీనిని సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో కూడా త్వరగా కొనేలా చేస్తాయి. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (Royal Enfield Classic 350)
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కేవలం బైక్ మాత్రమే కాదు. టాప్ క్లాస్ బైక్స్ కావాలనుకునేవారికి అదొక ఎమోషన్ లాంటిది. కొందరికి ఈ బైక్ తమ రిచ్ నెస్, హోదాకు సింబల్‌గా చూస్తారు. దీని రెట్రో డిజైన్, సౌండ్ దీనిని ఇతర బైకులతో ప్రత్యేకంగా చేస్తాయి. ధర ఎక్కువ ఉన్నప్పటికీ, వాడిన తర్వాత కూడా దీని విలువ అంత వేగంగా తగ్గదు. చాలాసార్లు పాత క్లాసిక్ 350కి డిమాండ్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే రీసేల్ లోనూ మంచి ధరకు త్వరగా అమ్ముడవుతుంది.

ఏ టూవీలర్ కొనడం బెస్ట్ ?
తక్కువ ధరకు లభించడంతో పాటు రీసేల్ చేయగా ఎక్కువ నష్టం కలగని టూవీలర్ మీరు కోరుకుంటే హీరో స్ప్లెండర్,  హోండా యాక్టివా బెస్ట్ ఛాయిస్. అదే సమయంలో పర్ఫార్మెన్స్‌తో పాటు వాల్యూ కోరుకునే వారికి హోండా షైన్, పల్సర్ 150 సరైన ఎంపికగా నిలుస్తాయి. ఒకవేళ మీకు ప్రీమియం, డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 సరిగ్గా సరిపోతుంది. మీ సౌలభ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

మారుతి కారు కొనాలనుకుంటున్నారా? ఈ నెలలో రూ.2.10 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు!
మారుతి కార్లపై వేలకు వేలు ఆదా, కళ్లు తిరిగే డిస్కౌంట్లు - ఏ మోడల్‌పై ఎంత ఆఫర్ ఉందంటే?
టీవీఎస్‌ X కు గట్టి పోటీగా వచ్చిన యమహా ఏరోక్స్-E - ధరకు తగ్గ విలువ, రేంజ్, ఫీచర్లలో ఏ స్కూటర్‌ బెస్ట్?
యమహా ఏరోక్స్ ఎలక్ట్రిక్‌ Vs టీవీఎస్‌ X - బెస్ట్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది?
యమహా నుంచి ప్రీమియం స్పోర్టీ ఎలక్ట్రిక్‌ స్కూటర్ - Aerox Electric ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
యూత్‌ కోసం హై ఎనర్జీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ - Yamaha Aerox Electric లాంచ్‌
భారత్‌లోకి Volkswagen Tayron కొత్త వేరియంట్‌ రాక ఖరారు - తక్కువ ధరతో అదిరే ఫీచర్లు!
తక్కువ ధరలో వోక్స్‌వ్యాగన్‌ టైరాన్‌ కొత్త వేరియంట్‌ - R-Lineతో పోలిస్తే ఏం మారింది?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Embed widget