అన్వేషించండి

Most Selling Bikes: ప్రతినెలా అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్స్.. గరిష్టంగా 70 కి.మీ మైలేజ్, వాటి ధరలిలా

Most Selling Bikes: భారత్‌లో Hero, Bajaj, TVS తో పాటు Honda కంపెనీల మోటార్‌సైకిల్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్‌లు ప్రత్యేకంగా రోజువారీ వినియోగం కోసం రూపొందించారు.

పెట్రోల్ ధరలు పెరిగితే మన ఖర్చులు పెరుగుతాయి. కనుక  సామాన్యులు తక్కువ ధర, మెరుగైన మైలేజీ, తక్కువ మెయింటెనెన్స్ ఉన్న బైకులను కొంటున్నారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా భారత మార్కెట్లో హీరో స్ప్లెండర్, హెచ్‌ఎఫ్ డీలక్స్, బజాజ్ ప్లాటినా వంటి పలు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రతి నెలా అత్యధిక విక్రయాలతో దూసుకుపోతున్నాయి. బడ్జెట్ ధరలో లీటరుకు 60 నుండి 70 కిలోమీటర్ల పైగా మైలేజీని ఇచ్చే ఈ బైకులు రోజువారీ రాకపోకలకు అత్యంత అనుకూలమైన ఎంపికలుగా ఉన్నాయి. 

బజాజ్ ప్లాటినా (Bajaj Platina 100)
బజాజ్ ప్లాటినా 100 (Bajaj Platina 100) అధిక మైలేజీ ఇచ్చే బైకులలో ఒకటి. అధిక మైలేజీ కారణంగా విక్రయాల్లో ఎప్పుడూ టాప్ జాబితాలో ఉంటుంది. బజాజ్ ప్లాటినా దాదాపు 73 kmpl వరకు మైలేజీని ఇస్తుంది. ఇది అత్యంత పొదుపైన ఆప్షన్లలో ఒకటిగా చెప్పవచ్చు. దీని సాధారణ డిజైన్, తక్కువ బరువు సిటీలోని రద్దీ రోడ్లపై సైతం డ్రైవింగ్ సులభతరం చేస్తుంది.

హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus)
ఈ జాబితాలో మరో బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus). దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ ఇది. ఈ బైక్ ధర సుమారు 73,410 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ఆయా రాష్ట్రాలు, నగరాలను బట్టి ధరలో వ్యత్యాసం ఉంటుంది. ఇది దాదాపు లీటరుకు 60 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది.

హీరో కంపెనీకి చెందిన రెండవ స్ప్లెండర్ బైక్ స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ (Splendor Plus Xtec) కూడా ఈ బెస్ట్ జాబితాలో ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర 79, 705 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ప్లస్ ఎక్స్‌టెక్ సైతం 60 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది.

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe)
ఈ జాబితాలో తర్వాత పేరు హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe) బైక్. దీని ధర కేవలం 56 వేల నుండి ప్రారంభమవుతుంది. హెచ్ఎఫ్ డీలక్స్ దాదాపు 65 kmpl వరకు మైలేజీని ఇవ్వగలదు. హీరో మోటోకార్ప్ నుండి రెండవ అత్యధికంగా అమ్ముడవుతున్న బైకుగా నిలిచింది.

హోండా షైన్ 100, హోండా ఎస్పీ 125 
పైన తెలిపిన బైకులే కాకుండా అధిక మైలేజీ ఇచ్చే వాటిలో హోండా షైన్ 100 (Honda Shine 100), హోండా ఎస్పీ 125 (Honda SP 125) వంటి బైకులు ఉన్నాయి. ఇవి కాస్త ధర ఎక్కువ. కనుక ఎక్కువ పవర్‌తో వస్తాయి. సుమారు 55 నుంచి 65 kmpl వరకు మైలేజీని ఇస్తాయి. హోండా షైన్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 79,757 కాగా, హోండా ఎస్పీ 125 బైక్ ధర రూ. 88,528గా ఉంది. ఆయా నగరాల్లో ధరలలో కొంచెం వ్యత్యాసం ఉంటుంది.

టీవీఎస్ రైడర్ 125 (TVS Raider 125)
మీరు కొంచెం స్టైల్, ఫీచర్లను కోరుకుంటే టీవీఎస్ రైడర్ 125 (TVS Raider 125) కూడా మీకు మంచి ఆప్షన్. ఈ బైక్ ధర రూ. 81,950 వరకు ఉంటుంది. ఒక లీటర్ పెట్రోలుతో మీరు 55– 56 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. ఈ బైక్ అటు మైలేజీతో పాటు ఇటు ధరను బ్యాలెన్స్ చేసి కస్టమర్లలో నమ్మకాన్ని పెంచుతోంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
మారుతి బలెనో కొనేవాళ్లు కొన్ని రోజులు ఆగండి, సెప్టెంబర్‌ 5న వచ్చే కొత్త మోడల్‌లో కీలక మార్పులు!
మారుతి బలెనోకు కొత్త లుక్‌ - సన్‌రూఫ్‌, యాంబియంట్‌ లైటింగ్‌ సహా చాలా కొత్త ఫీచర్లు
ఒకే ఛాసిస్‌.. కానీ లుక్‌, ఇంటీరియర్‌, ఫీచర్లలో భారీ తేడాలు.. మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌!
మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌ మధ్య ఇంత తేడానా? కొత్త పికప్‌ ట్రక్‌లో మారినవేంటో తెలుసా?
BE 6 రేసింగ్‌ లుక్‌ను పక్కన పెట్టిన మహీంద్రా.. త్రివర్ణాలు, 540 డిగ్రీల కెమెరాతో కొత్త 'ఫ్రీడమ్‌ ఎడిషన్‌'
ఆగస్టు 15 సందర్భంగా మహీంద్రా BE 6కు కొత్త లుక్‌.. ఫార్ములా ఈ ఫ్రీడమ్‌ ఎడిషన్‌లో ప్రత్యేక మార్పులు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget