అన్వేషించండి

E20 Vs E85 ఫ్యూయల్ - ఏది ఎక్కువ మైలేజ్ ఇస్తుంది? ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ టెస్ట్‌లో తేలిన నిజం

E20, E85 ఇంధనాల్లో ఏది ఎక్కువ మైలేజ్ ఇస్తుంది? Suzuki Gixxer SF 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌పై నిర్వహించిన రియల్ వరల్డ్ టెస్ట్‌లో E85 మైలేజ్, ఖర్చు, ప్రయోజనాలపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

E85 vs E20: భారత్‌లో ఇథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇటీవలే E85 ఇంధనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టగా, ఇది సాధారణ E20 పెట్రోల్ కంటే లీటర్‌ కంటే దాదాపు రూ.20 తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. దీంతో చాలామందిలో ఒకే ప్రశ్న మొదలైంది. E85 నిజంగా చౌకైన ఇంధనమేనా? లేక తక్కువ ధర వెనుక మరో కథ ఉందా?

ఈ సందేహానికి సమాధానం కనిపెట్టేందుకు, ఎక్స్‌పర్ట్‌లు ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో వచ్చిన సుజుకి గిక్సర్ SF 250 FFV బైక్‌పై ప్రత్యేక రియల్ వరల్డ్ టెస్ట్ నిర్వహించారు. ఈ బైక్‌కు E20, E85 రెండు రకాల ఇంధనాలపైనా నడిచే సామర్థ్యం ఉంది.

ముందుగా E85తో పరీక్ష

పరీక్ష కోసం బైక్ ట్యాంక్‌లోని పాత ఇంధనాన్ని పూర్తిగా తొలగించి, E85తో నింపారు. ఢిల్లీలోని వివిధ రహదారులపై సుమారు 80 కిలోమీటర్ల ప్రయాణం చేశారు. నగర ట్రాఫిక్, ఓపెన్ రోడ్లు రెండింటినీ కలిపి సగటున గంటకు 29 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం సాగింది.

ఈ టెస్ట్ పూర్తయ్యాక బైక్ 2.79 లీటర్ల E85 వినియోగించింది. అంటే, E85 ఫ్యూయల్‌తో ఈ బండి లీటరుకు 28.81 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చింది.

E20తో మళ్లీ పరీక్ష

తర్వాత, ట్యాంక్‌ను మళ్లీ పూర్తిగా ఖాళీ చేసి E20 పెట్రోల్ నింపి అదే మార్గంలో, అదే సమయానికి, దాదాపు ఒకే విధమైన ట్రాఫిక్ పరిస్థితుల్లో మరోసారి టెస్ట్ నిర్వహించారు.

ఈసారి 80 కిలోమీటర్ల ప్రయాణానికి కేవలం 1.93 లీటర్ల ఇంధనం మాత్రమే అవసరమైంది. అంటే, E20తో ఈ బైక్ లీటరుకు 38.1 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చింది.

ఎంత తేడా వచ్చింది?

ఈ రెండు టెస్టుల ఫలితాలను పరిశీలిస్తే E85 ఇంధనంతో మైలేజ్ గణనీయంగా తగ్గినట్లు స్పష్టమైంది. E20తో పోలిస్తే E85 మైలేజ్ లీటరుకు 9 కిలోమీటర్ల పైనే తగ్గింది, దాదాపు 24.4 శాతం తక్కువగా నమోదైంది.

ఈ వ్యత్యాసానికి కారణం ఇథనాల్ స్వభావం. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో శక్తి సాంద్రత తక్కువగా ఉంటుంది. అందువల్లే ఎక్కువ ఇంధనం వినియోగించాల్సి వస్తుంది.

ఖర్చు పరంగా ఏది లాభం?

ప్రస్తుతం ఢిల్లీలో E85 ధర లీటరుకు రూ.82.12 కాగా, E20 ధర రూ.102.12గా ఉంది. అంటే E85 సుమారు 20 శాతం చౌక.

అయితే, మైలేజ్ తగ్గిపోవడం వల్ల ఆ ధర ప్రయోజనం పూర్తిగా వినియోగదారుడికి అందడం లేదు. లెక్కల ప్రకారం సుజుకి గిక్సర్ SF 250 FFVలో E20పై కిలోమీటరుకు సుమారు రూ.2.68 ఖర్చవుతుండగా, E85పై కిలోమీటరుకు రూ.2.85 ఖర్చవుతోంది. అంటే, E85తోనే ఖర్చు ఎక్కువ అవుతుంది.

ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, 10,000 కిలోమీటర్ల ప్రయాణానికి, E20తో పోలిస్తే, E85ని ఉపయోగించినప్పుడు సుమారు రూ.1,700 వరకు అదనంగా ఖర్చయ్యే అవకాశం ఉంది.

ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు కూడా ఖరీదే

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల ధరలు కూడా సాధారణ వాహనాల కంటే ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు గిక్సర్ SF 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ ధర రూ.1.98 లక్షలు కాగా, సాధారణ వెర్షన్ ధర రూ.1.89 లక్షలుగా ఉంది.

భవిష్యత్తులో పరిస్థితి మారుతుందా?

ప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై-పుణే-నాగ్‌పూర్ కారిడార్‌లలో E85, E100 ఇంధన స్టేషన్లను ఏర్పాటు చేసే ప్రణాళికలు కొనసాగుతున్నాయి. 2026 చివరి నాటికి 500 స్టేషన్లు, 2027 నాటికి దేశవ్యాప్తంగా 5,000 స్టేషన్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

అయితే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు నిజంగా ప్రజాదరణ పొందాలంటే E85 ధర మరింత తగ్గి, E20 కంటే తక్కువ రన్నింగ్ కాస్ట్‌ను అందించాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం మాత్రం E85 చౌకగా కనిపించినా, వాస్తవ వినియోగంలో E20నే ఆర్థికంగా మెరుగైన ఎంపికగా నిలుస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

E85 పెట్రోల్, E20 పెట్రోల్ కంటే చవకైనదా?

అవును, లీటరుకు E85 ధర E20 కంటే తక్కువ. అయితే, మైలేజ్ తగ్గడం వల్ల వాస్తవ వినియోగ ఖర్చు E20 కంటే E85కే ఎక్కువ.

E85 ఇంధనం ఉపయోగించినప్పుడు మైలేజ్ ఎందుకు తగ్గుతుంది?

ఇథనాల్‌లో శక్తి సాంద్రత సాధారణ పెట్రోల్ కంటే తక్కువగా ఉంటుంది. అందుకే వాహనం నడపడానికి ఎక్కువ E85 ఇంధనం వినియోగించాల్సి వస్తుంది.

ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల ధరలు ఎక్కువగా ఉంటాయా?

అవును, సాధారణ మోడల్‌లతో పోలిస్తే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల ధరలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు, గిక్సర్ SF 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ ధర ఎక్కువ.

E85 ఇంధన స్టేషన్ల విస్తరణకు ప్రభుత్వ ప్రణాళిక ఏమిటి?

కేంద్ర ప్రభుత్వం 2026 నాటికి 500 స్టేషన్లు, 2027 నాటికి దేశవ్యాప్తంగా 5,000 E85/E100 ఇంధన స్టేషన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఒకే ఛాసిస్‌.. కానీ లుక్‌, ఇంటీరియర్‌, ఫీచర్లలో భారీ తేడాలు.. మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌!
మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌ మధ్య ఇంత తేడానా? కొత్త పికప్‌ ట్రక్‌లో మారినవేంటో తెలుసా?
BE 6 రేసింగ్‌ లుక్‌ను పక్కన పెట్టిన మహీంద్రా.. త్రివర్ణాలు, 540 డిగ్రీల కెమెరాతో కొత్త 'ఫ్రీడమ్‌ ఎడిషన్‌'
ఆగస్టు 15 సందర్భంగా మహీంద్రా BE 6కు కొత్త లుక్‌.. ఫార్ములా ఈ ఫ్రీడమ్‌ ఎడిషన్‌లో ప్రత్యేక మార్పులు!
స్కార్పియో ఎన్‌ కంటే రఫ్‌ అండ్‌ టఫ్‌ లుక్స్‌.. మహీంద్రా కొత్త లైఫ్‌స్టైలర్‌ పికప్‌ ట్రక్‌ వచ్చేసింది!
మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్‌ పికప్‌ ట్రక్‌.. టయోటా, ఇసుజుకి స్ట్రాంగ్‌ కాంపిటీషన్‌!
Clean Cloudy Car Headlights: వర్షంలో హెడ్‌లైట్లు మసకగా కనిపిస్తున్నాయా? ఈ చిట్కాలు మీకు హెల్ప్ అవుతాయి!
వర్షంలో హెడ్‌లైట్లు మసకగా కనిపిస్తున్నాయా? ఈ చిట్కాలు మీకు హెల్ప్ అవుతాయి!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Embed widget