అన్వేషించండి

Car Movie Projecting Headlights: చైనా కార్ల కంపెనీల నెక్స్ట్ లెవల్ ఇన్నోవేషన్ - హెడ్‌లైట్లతోనే వంద అంగుళాల స్క్రీన్ పై మూవీస్.. హువావే, బీఏఐసీ క్రేజీ ఫీచర్!

చైనీస్ కార్ల తయారీదారులు హెడ్‌లైట్ల ద్వారా గోడలపై సినిమాలు ప్రొజెక్ట్ చేసే సరికొత్త టెక్నాలజీని తెచ్చారు. హువావే స్టెలాటో S9 సెడాన్ ఇప్పుడు రోడ్డుపైనే థియేటర్ అనుభూతిని అందిస్తోంది.

Chinese Carmakers Innovate with Movie-Projecting Headlights Updates: అమెరికన్ డ్రైవ్-ఇన్ థియేటర్లు ఇప్పుడు గతం కావొచ్చు కానీ, చైనా కార్ల తయారీదారులు వాటిని మళ్ళీ సరికొత్త రూపంలో తీసుకువస్తున్నారు. కారు హెడ్‌లైట్ల ద్వారానే గోడల మీద సినిమాలు ప్రొజెక్ట్ చేసే వినూత్న టెక్నాలజీని వారు పరిచయం చేశారు. హువావే టెక్నాలజీస్, బీఏఐసీ మోటార్ కార్ప్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 'స్టెలాటో S9' (Stelato S9) సెడాన్ దీనికి ఒక నిదర్శనం. ఈ కారులో ఉన్న స్పెషల్ లైటింగ్ సిస్టమ్ కేవలం రోడ్డుపై వెలుగునివ్వ‌డమే కాకుండా, బయట గోడల మీద 100 అంగుళాల స్క్రీన్ సైజులో లేటెస్ట్ మార్వెల్ సినిమాలను ప్రొజెక్ట్ చేయగలదు. చైనాలోని అత్యంత పోటీ ఉన్న ఆటోమొబైల్ మార్కెట్లో తమ ప్రత్యేకతను చాటుకోవడానికి స్థానిక కంపెనీలు చేస్తున్న ప్రయోగాల్లో ఇది ఒకటి.

2-మెగాపిక్సెల్ హెడ్‌లైట్ల పవర్..
ఈ కారులో అమర్చిన 2-మెగాపిక్సెల్ హెడ్‌లైట్లు సినిమా ప్రొజెక్టర్లుగానే కాకుండా, రోడ్డు భద్రతకు కూడా ఉపయోగపడతాయి. ఇవి రోడ్డు మీద క్రాస్ వాక్ (Crosswalk) గుర్తులను, నావిగేషన్ కోసం అవసరమైన యారో మార్కులను నేరుగా నేల మీద ప్రొజెక్ట్ చేస్తాయి. దీనివల్ల డ్రైవింగ్ చాలా సులభం అవుతుంది. హువావేతో కలిసి కార్లను తయారు చేస్తున్న సైరస్ గ్రూప్ (Seres Group) ప్రెసిడెంట్ జాన్ జాంగ్ మాట్లాడుతూ.. తమ పాపులర్ 'M' లైన్ వాహనాల్లో ఈ ఫీచర్ ఒక మెయిన్ సెల్లింగ్ పాయింట్ గా నిలిచిందని తెలిపారు. డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్ తో పాటు ఈ ప్రొజెక్టర్ ఫీచర్ కు కస్టమర్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

గ్లోబల్ రేసులో చైనా దూకుడు..
కేవలం చైనీస్ కంపెనీలే కాకుండా బీఎండబ్ల్యూ (BMW), మెర్సిడెస్ బెంజ్ వంటి దిగ్గజాలు కూడా పిక్సెలేటెడ్ హెడ్‌లైట్ టెక్నాలజీ మీద పనిచేస్తున్నాయి. అయితే కొత్త ఫీచర్లను జోడించడంలో మాత్రం చైనా కంపెనీలే అందరి కంటే ముందున్నాయి. ఇంటెల్ మార్కెట్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం, ఇటువంటి అడ్వాన్స్‌డ్ లైటింగ్ సిస్టమ్స్ మార్కెట్ విలువ 2025 నాటికి 1.1 బిలియన్ డాలర్లుగా ఉండబోతోంది. రాబోయే పదేళ్లలో ఇది రెట్టింపు అయ్యే అవకాశం కనిపిస్తోంది. హువావే ఈ కాన్సెప్ట్‌ను కారు లోపల కూడా ఇంప్లిమెంట్ చేస్తోంది. ముందు సీట్ల వెనుక ఉండే రోల్-అప్ స్క్రీన్ల మీద లేదా వెనుక టైల్‌గేట్ నుండి ఇమేజ్ లను ప్రొజెక్ట్ చేసే సిస్టమ్ ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

రెగ్యులేటరీ సవాళ్లు..
టెక్నాలజీ పరంగా ఇది చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, దీనివల్ల కొన్ని భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కారు ప్రయాణంలో ఉన్నప్పుడు ఇలా రోడ్ల మీద ఇమేజ్ లను ప్రొజెక్ట్ చేయడం వల్ల ఇతర వాహనదారులు డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్ని నియంత్రించేందుకు అధికారులు ఎటువంటి రూల్స్ తెస్తారో చూడాలి. మొత్తానికి, చైనీస్ కార్ మేకర్లు కేవలం కారు డిజైన్ తోనే కాకుండా, ఇలాంటి క్రేజీ టెక్నాలజీతో ప్రపంచ ఆటోమొబైల్ రంగాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ కొత్త టెక్నాలజీ త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి కూడా అందుబాటులోకి వస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

17 వేల EMIపై Hyundai Creta కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి
17 వేల EMIపై Hyundai Creta కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి
Maruti Dzireకు ప్రత్యామ్నాయంగా Honda Amaze కొనబోతున్నారా? ముందు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోండి
కొత్త Honda Amaze కొనేవాళ్లకు అలెర్ట్‌! ఈ సెడాన్‌లో మీకు తెలియాల్సిన 3 ప్లస్‌లు, 3 మైనస్‌లు!
Ethanol: పెట్రోల్ తర్వాత డీజిల్‌పైనా ప్రయోగం.. ఇథనాల్‌పై కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గింది?
డీజిల్‌లో ఇథనాల్ కలపడం కుదరదు.. అసలు కారణం ఇదే!
బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
హోండా రెబెల్ 300 vs రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350 - ఏది స్పెషల్‌ బైక్‌?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget