అన్వేషించండి

Number Plate Cloning: ఎవరైనా మీ నంబర్ ప్లేట్ క్లోన్ చేశారా ? గుర్తించకపోతే వాళ్లకు థ్రిల్, మీ జేబుకు చిల్లు !

Number Plate Cloning: వేరొక వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ను దుర్వినియోగం చేయడం ద్వారా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్న కేసులు హైదరాబాద్‌లోనూ పెరుగుతున్నాయి. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

Number Plate Cloning: రోడ్లపై వేగంగా దూసుకెళ్లడమే కాదు, ఫేక్ నెంబర్ ప్లేట్లతో సైతం ట్రాఫిక్ పోలీసులను కొందరు బురిడీ కొట్టిస్తున్నారు. నిరంతరం పెరుగుతున్న నిఘా, ట్రాఫిక్ కెమెరాల రికార్డింగ్‌తో నంబర్ ప్లేట్ క్లోనింగ్ అనే కొత్త ముప్పు వెలుగులోకి వస్తోంది. నంబర్ ప్లేట్ క్లోనింగ్‌లో ఒక వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ను కాపీ చేసి, దానిని వేరే వాహనం నెంబర్‌ ప్లేట్ తగిలిస్తారు. తద్వారా తప్పు ఒకరు చేస్తే, చలానా మాత్రం ఆ వెహికల్ నెంబర్ అసలైన యజమాని వద్దకు వెళ్తుంది. హైదరాబాద్‌లో ఇటీవల వెలుగుచూసిన ఘటనలు ఈ సమస్యపై వాహనదారుల్లో ఆందోళనను పెంచాయి.

నంబర్ ప్లేట్ క్లోనింగ్ ఎలా సాధ్యం
కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఇతర వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను కాపీ చేస్తారని లేదా క్లోన్ చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసుల విచారణలో ఇటీవల తేలింది. వేరే వెహికల్ నెంబర్ నోట్ చేసి డూప్లికేట్ నంబర్ ప్లేట్‌ను తమ వాహనానికి తగిలించుకుని ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తున్నారు. సిటీ రోడ్లపై ఉన్న ట్రాఫిక్ కెమెరాలు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు వ్యవస్థలు కేవలం నంబర్‌ను మాత్రమే రికార్డ్ చేస్తాయి. కనుక ఒకరు తప్పు చేసినా సరే, ట్రాఫిక్ చలానా మాత్రం ఆ నెంబర్ అసలైన యజమానికి వెళ్తుంది. తాము వెళ్లని ప్రాంతాల నుండి కూడా చలానాలు వస్తున్నాయని పోలీసులకు అనేక ఫిర్యాదులు అందాయి.

హైదరాబాద్ క్లోనింగ్ కేసులు
ఒక కేసులో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన వ్యక్తికి, తాను వెళ్లకపోయినా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నుంచి ట్రాఫిక్ ఉల్లంఘించినట్లు చలానాలు వస్తున్నాయి. విచారణలో ఫుడ్ అగ్రిగేటర్ సంస్థలో పనిచేసే 26 ఏళ్ల వి. సురేష్ కుమార్ అనే వ్యక్తి తన స్కూటర్ నంబర్‌ ప్లేట్ తొలగించి, నిబంధనలు ఉల్లంఘించినా తప్పించుకోవడానికి వేరే వాహనం నంబర్‌ ప్లేట్ వాడుతున్నట్లు తెలిసింది. అలాగే ఒక మహిళకు ట్రాఫిక్ చలానాలు వచ్చాయి. పోలీసులు సిసిటివి ఫుటేజ్ సాయంతో నిందితుడిని పట్టుకోగా, అతడు తన వాహనం నంబర్‌లో చిన్న మార్పు చేసి నకిలీ ప్లేట్ తయారు చేసినట్లు తేలింది. ఇలాంటి ఫిర్యాదులు ఈ మధ్యకాలంలో చాలా వస్తున్నాయని, తమ వాహనం నంబర్ దుర్వినియోగం అవుతున్నట్లు అనుమానం ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని అధికారులు సూచించారు. నివేదికల ప్రకారం, 2025 మొదటి 10 నెలల్లోనే హైదరాబాద్‌లో 36,000 కంటే ఎక్కువ రాంగ్ చలానాలు జారీ అయ్యాయి. అంటే వాహనం ఒకరిదైతే ట్రాఫిక్ చలానా మాత్రం మరొకరికి వెళ్తున్నాయి.

ఫిర్యాదు చేయడం ఇలా
మీకు కూడా అనవసరంగా ట్రాఫిక్ చలానాలు వస్తుంటే, అది నంబర్ ప్లేట్ క్లోనింగ్‌ కారణం కావచ్చు. అలాంటప్పుడు ముందుగా మీ వాహనం ఉన్న ప్రాంతం, వినియోగాన్ని చలానా తేదీ, స్థలంతో చెక్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది. మీరు వివరాలు, లొకేషన్ మ్యాచ్ అవ్వకపోయినా, అనుమానం ఉంటే వెంటనే ట్రాఫిక్ పోలీసులను సంప్రదించి, ఈ-చలానా వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. నకిలీ నెంబర్ ప్లేట్ లేదా మార్చిన నంబర్ ప్లేట్ వాడటం తీవ్రమైన నేరమని, దీనికి శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సిసిటివి కెమెరాలు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు వంటి టెక్నాలజీతో ఇలాంటి ఫేక్ నెంబర్ ప్లేట్, క్లోనింగ్ నెంబర్ ప్లేట్లపై కేసులపై నిఘా ఉంచారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. కొత్త గ్రీన్‌ కలర్‌తో అదిరిపోయే లుక్‌! ధర ఎంతో తెలుసా?
ఆర్మీ స్ఫూర్తితో RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. ఎంత బాగుందో!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget