Cars Bikes Price Hike: 2025 నుంచి ధరలు పెరగనున్న బైక్‌లు, కార్లు ఇవే - బీఎండబ్ల్యూ నుంచి మారుతి సుజుకి వరకు!
Vehicles Price Hike: 2025 జనవరి నుంచి మనదేశంలో బైక్‌లు, కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. బీఎండబ్ల్యూ, హ్యుందాయ్, మారుతి సుజుకి వంటి కంపెనీలు ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించాయి.

Car And Bike New Policy: 2024 సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగిసిపోనుంది. కొన్ని రోజుల తర్వాత కొత్త సంవత్సరం కూడా ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరం ప్రారంభంలో అనేక వస్తువుల ధరలు తగ్గుతాయి లేదా పెరుగుతాయి. అదే సమయంలో 2025 సంవత్సరంలో మోటార్‌సైకిళ్లు, కార్ల ధరలలో కూడా మార్పులు చూడవచ్చు. చాలా మంది వాహన తయారీదారులు కొత్త సంవత్సరం రాకముందే అనేక విషయాలను వెల్లడించారు.
జనవరి 1 నుంచి పెరగనున్న బైక్ ధరలు
భారతదేశంలో బీఎండబ్ల్యూ బైక్‌లకు చాలా క్రేజ్ ఉంది. ఈ కంపెనీకి చెందిన మోటార్ సైకిళ్లే కాకుండా స్కూటర్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. బీఎండబ్ల్యూ అనుబంధ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్ జనవరి 1వ తేదీ నుంచి తన అన్ని ద్విచక్ర వాహనాల ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించింది. ద్రవ్యోల్బణం ఒత్తిడి, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలలో ఈ పెరుగుదల చేయక తప్పని పరిస్థితి ఎదురైంది.
బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇండియా కంపెనీకి చెందిన అన్ని ద్విచక్ర వాహనాల ధరలను 2.5 శాతం పెంచబోతున్నట్లు సమాచారం. బైక్‌లు, స్కూటర్ల కొత్త ధరలు జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. బీఎండబ్ల్యూ మోటోరాడ్ 2017లో భారతదేశంలో తన ద్విచక్ర వాహనాలను విక్రయించడం ప్రారంభించింది. అదే సమయంలో భారతదేశంలోని ప్రజలు కూడా ఈ బ్రాండ్ ఉత్పత్తులను ఇష్టపడతారు.
Also Read: రూ.10 లక్షల్లో బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే - ఆల్టో కే10 నుంచి పంచ్ వరకు!
కార్లు కూడా ఖరీదైనవిగా మారతాయా?
వాహనాల ధరల పెంపు గురించి హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా తెలియజేసింది. డిసెంబరు 5వ తేదీ కంపెనీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఇన్‌పుట్ ఖర్చు పెరుగుదల కారణంగా కార్ల ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. అదే సమయంలో భారత రూపాయితో పోలిస్తే డాలర్ బలపడటం వల్ల కంపెనీలకు వాహనాల విడిభాగాలను కొనుగోలు చేయడం మరింత ఖరీదుగా మారింది. ఇది వాహనాల ధరపై ప్రభావం చూపుతుంది. కొత్త సంవత్సరంలో హ్యుందాయ్ కార్ల ధరలు రూ.25 వేల వరకు పెరగవచ్చు.
మారుతి సుజుకి కూడా తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వాహనాల ఇన్‌పుట్ వ్యయం, నిర్వహణ ఖర్చులు పెరగడంతో ధరలను పెంచుతున్నారు. వాహన తయారీదారులు వాహనాల ధరలను నాలుగు శాతం వరకు పెంచవచ్చు.
Also Read: సింగిల్ ట్యాంక్ ఫుల్‌తో 1000 కిలోమీటర్లు నడిచే టాప్ 5 కార్లు - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?
Get ready for one of our highlights in 2025: The 20th edition of the #BMWMotorrad Days in Garmisch-Partenkirchen!
— BMWMotorrad (@BMWMotorrad) December 5, 2024
Let's celebrate together from July 4th - 6th and make these days some to remember: https://t.co/yPjOnicQ74#MakeLifeARide #BMWMotorrad pic.twitter.com/kU8J6gXg1V
The #HyundaiIONIQ5 with its ultra-fast charging capability, takes you from 10% to 80% charge in just 18 minutes. Enjoy the convenience as you can spend less time charging and more time exploring.
— Hyundai India (@HyundaiIndia) December 4, 2024
Know more: https://t.co/oCjUXuZYrC#HyundaiIndia #Poweryourworld #ILoveHyundai pic.twitter.com/vdeelFz9Oq





















