Car Care Tips: మీ కారు మంచి మైలేజీ ఇవ్వాలా? ఈ 5 టిప్స్ పాటించండి!
కారు కొనుగోలు చేసే ప్రతి వినియోగదారుడు బెస్ట్ మైలేజీ కోసం ప్రయత్నిస్తాడు. అయితే, కారు నడిపే సమయంలో కొన్ని సాధారణ చిట్కాలు పాటించడం వల్ల మైలేజీ మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది.
ప్రస్తుత కాలంలో కార్ల తయారీ కంపెనీలు టర్బో ఇంజన్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. సాధారణ కార్లతో పోల్చితే టర్బో ఇంజిన్ కార్లు ఎక్కువ పవర్‌తో వస్తాయి. అయితే, టర్బో ఇంజిన్ కార్లు నడిపే సమయంలో కొన్ని టిప్స్ పాటించడం వల్ల మంచి మైలేజీ పొందే అవకాశం ఉంటుంది. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కారు గేర్ల గురించి ముందుగా తెలుసుకోండి
సాధారణ ఇంజిన్ కారును టర్బో ఇంజిన్ కారుతో పోల్చినట్లయితే, టర్బో ఇంజిన్ కారులో RPM 2000 వరకు వెళ్లినప్పుడు మాత్రమే, గేర్ షిఫ్టులను ప్రారంభించాలి. వీలైనంత వరకు తక్కువ RPMలో గేర్లను మార్చడం మంచిది. ఇలా చేయడం వల్ల మంచి మైలేజీ వస్తుంది.
2. టార్క్ ను గమనిస్తూ ఉండాలి
టర్బో ఇంజిన్ కార్లతో గరిష్ట మైలేజీ సగటును సాధించాలనుకుంటే, మీరు మీ వాహనాన్ని మాగ్జిమమ్ టార్క్ మీద నడపకుండా చూసుకోవాలి. మీ కారులోని టార్క్ కర్వ్ ను గమనిస్తూ ఉండాలి. మీరు గరిష్ట స్థాయికి టార్క్ కు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తక్కువ టార్క్ మీద రన్ చేయడం వల్ల ఎక్కువ మైలేజీ పొందే అవకాశం ఉంటుంది.
3. వేగంగా బ్రేకులు వేయడం మానుకోవాలి
కారుకు అవసరం అయిన చోట మాత్రమే బ్రేకులు వేయాలి. చీటికి మాటికి బ్రేకులు వేయడం వల్ల కారు మైలేజీ మీద ప్రభావం పడుతుంది. అందుకే, బ్రేకులను వీలైనంత వరకు తక్కువగా ఉపయోగించడం మంచిది. కారు బ్రేకులు తక్కువగా యూజ్ చేయడం వల్ల మంచి మైలేజీ వస్తుంది.
Read Also: వర్షంలో కారు నడుపుతున్నారా? అయితే, కచ్చితంగా ఈ 5 విషయాలు గుర్తుంచుకోవాలి!
5. క్రూయిజ్ కంట్రోల్స్ ఉపయోగించడం
హైవేపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, మీరు మీ కారు క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌ని ఉపయోగించవచ్చు. ఇది కారు నడుపుతున్న వ్యక్తికి ఉపశమనం కలిగించడంతో పాటు వాహనం యొక్క మైలేజీ సగటును పెంచుతుంది. సాధారణ ఇంజిన్ కార్లకు నిరంతరం యాక్సిలరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. యాక్సిలరేటర్ ప్యాడ్లపై ఒత్తిడి పెరగడం వల్ల కూడా మైలేజీ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ టర్బో ఇంజిన్ కార్లలో, క్రూయిజ్ కంట్రోల్స్ చాలా కాలం పాటు వేగాన్ని స్థిరీకరిస్తాయి. ఇవి కారు మంచి మైలేజీ పొందేలా సహకరిస్తాయి.
5. గేర్లను ఎలా మార్చాలి?
టర్బో ఇంజిన్ కారు నుంచి గరిష్ట మైలేజీ సగటును పొందడం అంత ఈజీ కాదు. కానీ, కచ్చితమైన పద్దతులు పాటించడం ద్వారా కొంత మేరకు అధిక మైలేజీ పొందే అవకాశం ఉంటుంది. వాటిలో ప్రధానంగా గేర్లను ఎలా మార్చాలో తెలుసుకోవాలి. రివ్ మ్యాచింగ్ ద్వారా గేర్‌లను సులభంగా మార్చవచ్చు. ఇది టర్బో ఇంజిన్‌పై అనవసరమైన ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫలితంగా టర్బో ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది. ఎక్కువ మైలేజీ పొందే అవకాశం ఉంటుంది.
Read Also: కారులో ఉంచకూడని 6 వస్తువులు ఇవే- ఇంతకీ వాటితో కలిగే సమస్యలు ఏంటంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial