అన్వేషించండి

Car Safety Tips: కారులో ఉంచకూడని 6 వస్తువులు ఇవే- ఇంతకీ వాటితో కలిగే సమస్యలు ఏంటంటే?

ఇళ్లు, ఆఫీస్ తర్వాత చాలా మంది ఎక్కువగ సమయం గడిపేది కారులోనే. మనం ఉపయోగించే పలు వస్తువులను కారులో తీసుకెళ్తాం. అయితే, కొన్ని వస్తువులను మాత్రం కారులో అలాగే ఉంచడం మంచిది కాదు.

ప్రస్తుత రోజుల్లో చాలా మంది కార్లు వినియోగిస్తున్నారు. వాటిలో రోజు వారిగా మనం ఉపయోగించే పలు వస్తువులను తీసుకెళ్తాం. అయితే, కొన్ని వస్తువులను తీసుకెళ్లినా, అందులోనే ఉంచడం వల్ల పలు ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాదు,భద్రతా వ్యవస్థలతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే కారులో ఉంచకూడని పలు వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..   

1.ఏరోసోల్ క్యాన్లు/ లైటర్లు

డియోడరెంట్‌లు,  లైటర్ల వంటి ఏరోసోల్ క్యాన్‌లు పేలుడుకు దారితీసే అధిక ఉష్ణోగ్రతలకు అనువుగా ఉంటాయి. అందువల్ల, ఈ వస్తువులను కారులో ఎప్పుడూ ఉంచేందుకు ప్రయత్నించ కూడదు. ముఖ్యంగా ఎండలో పార్క్ చేసినప్పుడు ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ సమయంలో ఈ వస్తువులు కారులో ఉండటం మూలంగా పేలుడు జరిగే అవకాశం ఉంటుంది.

2.ఎలక్ట్రానిక్స్

పార్క్ చేసిన కారు లోపల వేడి పెరుగుతుంది. ముఖ్యంగా ఎండలో పార్క్ చేసిన కార్లలో గాడ్జెట్‌లతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలను ఉంచడం వల్ల వేడి తీవ్రతకు బ్యాటరీలు చెడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే, వీలైనంత వరకు పార్క్ చేసిన కారులో వీటిని ఉంచకపోవడం ఉత్తమం.

3.ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్

నిజానికి ఈ విషయం కాస్త ఆశ్చర్యం కలిగించినా వాస్తవం. అధిక ఉష్ణోగ్రత లేదంటే సూర్యరశ్మికి ప్రభావితం అయ్యే ప్లాస్టిక్ బాటిల్ నీరు తాగడం వల్ల క్యాన్సర్ లేదంటే గుండె జబ్బులకు దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.   విపరీతమైన వేడి ప్లాస్టిక్‌ను విచ్ఛిన్నం చేస్తుంది. ఇది తాగునీటిలోకి ప్రవేశిస్తుంది. ఈ కారణంగా  ఎక్కువ సేపు కారును పార్క్ చేసిన కార్లలోని  ప్లాస్టిక్‌ వాటర్ బాటిళ్లను పారవేయడం మంచిది.

4.నగదు & ముఖ్యమైన పత్రాలు

మీ కారులో నగదు, ముఖ్యమైన పత్రాలను ఎప్పుడూ ఉంచవద్దు. ఒకవేళ వీటిని ఆగంతకులు గమనిస్తే వాటిని దొంగతనం చేసే అవకాశం ఉంటుంది.  కాబట్టి ఎప్పుడూ నగదు,  ముఖ్యమైన పత్రాలను దగ్గరే ఉంచుకోవడం ఉత్తమం.

5.చిన్న పిల్లలు & పెంపుడు జంతువులు

మీ పిల్లలను పార్క్ చేసిన కారులో ఉంచకూడదు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా హీట్ స్ట్రోక్‌ తగిలే అవకాశం ఉంటుంది. దీని కారణంగా పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వేడికి ఎక్కువ సున్నితంగా ఉండే పెంపుడు జంతువులకు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.   

6.ఆహార వ్యర్థాలు & చెత్త

మిగిలిపోయిన ఆహార పదార్థాలతో పాటు, చెత్తను కారులో ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  ఆహార వ్యర్థాలు, చెత్తను వదిలివేయడం మంచి పద్దతి కాదు.  ఎందుకంటే  మిగిలిపోయిన ఆహార పదార్థాల్లో సూక్ష్మజీవుల సంతానోత్పత్తి బాగా పెరుగుతుంది. ఫలితంగా కారులో దుర్వాసన వస్తుంది. అందుకే వీలైనంత వరకు కారును శుభ్రంగా ఉంచుకోవడం ఉత్తమం. చెత్త కారులోనే వేయకుండా, ఓ సంచిలో వేయడం మంచిది. ఆ తర్వాత వీలున్న చోట చెత్త బుట్టులో ఆ సంచిని పడవేయడం ఉత్తమం.  

Read Also: కారు డ్రైవ్ చేసేటప్పుడు సడెన్‌గా బ్రేక్స్ ఫెయిల్ అయితే - టెన్షన్ అవ్వకుండా ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget