Best Diesel SUV: సిటీ, హైవే డ్రైవింగ్ & హిల్ ట్రిప్స్‌కి సరిపడే బెస్ట్ SUV - ₹17 లక్షల్లో టాప్ ఆప్షన్ ఇదే!
Best Diesel SUV Under 17 Lakhs: హైవేపై ఎక్కువగా డ్రైవ్ చేసేవాళ్లకు, కొండ ప్రాంతాలకు లాంగ్ ట్రిప్స్ వెళ్లేవాళ్లకు డీజిల్ SUV బెస్ట్. ₹17 లక్షల బడ్జెట్‌లో ఏ కారు సూట్ అవుతుందో తెలుసుకోండి.

Best Diesel SUV Under 17 Lakh For Highways: కొంతమంది నెలవారీ కార్ డ్రైవింగ్ దాదాపు 2,000 కి.మీ. వరకు ఉంటుంది. ఉద్యోగం లేదా వ్యాపారం కోసం ప్రతిరోజూ ప్రయాణాలు చేసేవాళ్లు ఇందులోకి వస్తారు. ఈ 2,000 కి.మీ.లో దాదాపు 70% (దాదాపు 1400 km) ప్రయాణం హైవే మీద, మిగిలిన 30% (దాదాపు 600 km) ప్రయాణం సిటీలో ఉండొచ్చు. ఇలాంటి వారిని “హెవీ యూజర్” అనుకోవచ్చు. అంతేకాదు, బిజీ షెడ్యూల్ నుంచి ఊపిరి పీల్చుకోవడానికి ఏడాదిలో రెండు, మూడుసార్లు కొండప్రాంతాలకు 1,000 కి.మీ. వరకు లాంగ్ డ్రైవ్స్ కూడా కొందరు వెళ్తుంటారు. వీళ్లు, ఈ అవసరాలన్నింటినీ తీర్చే ఫ్యూయల్ టైప్, ఇంజిన్ పనితీరు, కంఫర్ట్ వంటివి ఒకే కారులో బ్యాలెన్స్ అయ్యేలా చూసుకోవాలి.
ఇలాంటి డ్రైవింగ్ ప్యాటర్న్ ఉన్న వాళ్లకు డీజిల్ కారు అత్యంత మంచి ఆప్షన్. ఎందుకంటే, హైవే డ్రైవింగ్‌లో డీజిల్ ఇంజిన్ మైలేజ్ బాగా ఇస్తుంది, అలాగే టార్క్ ఎక్కువగా ఉండటంతో హిల్ డ్రైవ్స్‌లో కూడా ఇంజిన్ శక్తిమంతంగా స్పందిస్తుంది.
Mahindra XUV 3XO - పంచ్‌తో కూడిన పెర్ఫార్మెన్స్
ఈ లిస్ట్‌లో ఉన్న కార్లలో, మహీంద్రా XUV 3XO డీజిల్ వెర్షన్ ప్రస్తుత మార్కెట్లో బలమైన ఛాయిస్. ఈ కారు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది, సుమారు 117 bhp పవర్, 300 Nm టార్క్ ఇస్తుంది. హైవే మీద పికప్ అద్భుతంగా ఉంటుంది, హిల్ రోడ్‌ల్లో గేర్ షిఫ్ట్ ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు. కేబిన్ స్పేస్ బాగుంది, రైడ్ క్వాలిటీ సాలిడ్. అంతేకాదు, 6 ఎయిర్‌బ్యాగ్స్, ESP, రియర్ కెమెరా వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా ఉన్నాయి. సిటీ డ్రైవింగ్‌కి కాంపాక్ట్‌గా ఉండటం, హైవే మీద స్టేబుల్‌గా ఉండటం - ఈ రెండింటి మధ్య మంచి బ్యాలెన్స్ ఇస్తుంది.
ఒక్క మైనస్ కూడా ఉంది - బూట్ స్పేస్ కాస్త తక్కువగా ఉంటుంది. లాంగ్ ట్రిప్స్‌కి పెద్ద లగేజ్ తీసుకెళ్లాలనుకునే వాళ్లకు ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు.
Hyundai Creta & Kia Seltos - ప్రాక్టికల్ ఆప్షన్లు
మీరు తరచుగా కుటుంబంతో ప్రయాణిస్తుంటే, హ్యుందాయ్ క్రెటా లేదా కియా సెల్టోస్ కూడా బాగానే సూట్ అవుతాయి. ఇవి XUV 3XO కంటే పెద్దవి, బూట్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. లాంగ్ డ్రైవ్స్‌లో లగేజ్ సౌకర్యంగా సరిపోతుంది. అయితే ₹17 లక్షల బడ్జెట్‌లో ఉంటే వీటిలో లోయర్ వేరియంట్స్ మాత్రమే దొరుకుతాయి.
క్రెటా డీజిల్ ఇంజిన్ స్మూత్‌గా పని చేస్తుంది, మైలేజ్ కూడా దాదాపు 20 కి.మీ./లీటర్ వరకు ఇస్తుంది. సెల్టోస్ డీజిల్ మోడల్ కూడా హైవేలో బలంగా, స్టేబుల్‌గా ఉంటుంది.
CNG కాకుండా డీజిల్ ఎందుకు బెస్ట్?
మీ ప్రయాణాల్లో హైవే, కొండప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున CNG కారు సూట్ కాదు. ఎత్తైన రోడ్లలో టార్క్ తక్కువగా ఉంటుంది, రీఫ్యూయలింగ్ స్టేషన్లు కూడా తక్కువగా ఉంటాయి. అందుకే, డీజిల్ మోడల్ తీసుకోవడం మైలేజ్ & డ్రైవ్ ఎక్స్‌పీరియెన్స్ పరంగా బెటర్.
₹17 లక్షల లోపులో హైవే డ్రైవింగ్, హిల్ రోడ్‌లకు సరిపోయే పవర్‌ఫుల్ కారు కావాలంటే మహీంద్రా XUV 3XO డీజిల్ మీకో స్మార్ట్ ఛాయిస్. మీరు ఎక్కువ లగేజ్‌తో ట్రావెల్ చేస్తుంటే క్రెటా లేదా సెల్టోస్ లాంటి పెద్ద SUV లలో ఎంట్రీ వేరియంట్లు కూడా మంచి ఆప్షన్. ఒక్క మాటలో చెప్పాలంటే - ఎక్కువ దూరాలు, కొండ రోడ్లు, హైవే ట్రిప్స్ కోసం డీజిల్ SUV ఒక్కటే పర్ఫెక్ట్ మ్యాచ్!.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















