First Car: ఫస్ట్ టైమ్ కారు కొంటున్నా, సీనియర్ సిటిజన్లకు కూడా సరిపడే కారు ఏది? - Maruti Suzuki Swift లేదా Hyundai Grand i10 Nios?
ఫస్ట్ టైమ్ కార్ కొనేవారితో పాటు, 60 ఏళ్లు పైబడిన కుటుంబ సభ్యుల కోసం Maruti Suzuki Swift లేదా Hyundai Grand i10 Nios మధ్య ఏ కారు కంఫర్ట్‌గా ఉంటుంది?. ఇక్కడ తెలుసుకోండి.

Which Car Is Better For First Car Buyer: కొత్త కారు కొనడం, కుటుంబ సభ్యులతో లాంగ్ ట్రిప్స్ వేయడం చాలా మంది కల. జీవితంలో మొట్టమొదటి కారు కొనేవాళ్లు, తమతో పాటు 60 ఏళ్ల వయస్సు దాటిన అమ్మానాన్నల కోసం కంఫర్ట్ చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. చిన్న ట్రిప్స్ అయినా, ఇంటర్‌సిటీ డ్రైవింగ్ అయినా - వెనుక సీట్లో కూర్చునే పెద్దవారికి మోకాళ్లు, భుజాలు, నడుము వంటివి సరిగ్గా సర్దుకునే స్థలం, గుంతలు & స్పీడ్ బ్రేకర్ల వద్ద కూడా మృదువైన ప్రయాణం, కారులోకి ఎక్కడం-దిగడం సులభంగా ఉండటం వంటివన్నీ ఉండాలి. ఈ వెసులుబాట్లు అన్నీ ఉండేలా, ఇప్పుడు చాలా మంది ఫస్ట్ టైమ్ బయ్యర్స్ ఎదుర్కొనే డౌట్ ఇదే - మారుతి సుజుకి స్విఫ్ట్ కొనాలా? లేక హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ కొనాలా?.
ఈ రెండు కార్లు మన మార్కెట్‌లో ప్రాచుర్యం పొందిన హ్యాచ్‌బ్యాక్‌లు. ఫస్ట్ టైమ్ కారు కొనేవాళ్లకు ఈ రెండు మంచి ఆప్షన్లు. కానీ... పెద్దవారి కంఫర్ట్ పరంగా చూస్తే చిన్న చిన్న తేడాలే చాలా కీలకం అవుతాయి.
Maruti Suzuki Swift: కాస్త విశాలమైన కేబిన్
మారుతి సుజుకీ స్విఫ్ట్, కేబిన్ పరంగా కాస్త వెడల్పుగా ఉంటుంది. వెనుక సీట్లో కూర్చునే వారికి మోకాళ్ల దగ్గర, భుజాల దగ్గర తగిన స్థలం దొరుకుతుంది. రోడ్ మీద వెళ్తున్నప్పుడు రైడ్ క్వాలిటీ మృదువుగా ఉంటుంది. అంతేకాదు, సీట్ హైట్ కూడా మధ్యస్థంగా ఉండటం వల్ల పెద్దవారు కారులోకి ఎక్కడం-దిగడం కాస్త సులభంగా ఉంటుంది. ఇంటర్‌సిటీ ట్రిప్స్ లేదా వారాంతపు చిన్న ప్రయాణాలకు ఇది బాగానే సూటవుతుంది.
Hyundai Grand i10 Nios: స్మూత్ డ్రైవ్, కానీ వెనుక స్థలం కాస్త తక్కువ
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ కూడా సిటీ యూజ్‌కి మంచి కారు. దాని ఇంజిన్ స్మూత్‌గా పని చేస్తుంది, డ్రైవ్ చాలా రిఫైన్‌డ్‌గా ఉంటుంది. కానీ, దీని వెనుక సీట్ లెగ్‌రూమ్‌ను స్విఫ్ట్‌తో పోలిస్తే కాస్త తక్కువగా ఉంటుంది. కాస్త ఎక్కువ దూరం ప్రయాణాల్లో పెద్దవాళ్లు కాళ్లు చాపుకోవడం కాస్త కష్టమవుతుంది. అలాగే సీటింగ్ పొజిషన్ నేలకి దగ్గరగా ఉండటంతో ఎక్కడం, దిగడం పెద్దవారికి కాస్త ఇబ్బంది కావచ్చు.
ఇంకో రెండు మంచి ఆప్షన్లు
మీరు, పెద్దవారి సౌకర్యాన్నే ముందుగా దృష్టిలో ఉంచుకుంటే, ఇంకో రెండు కార్ల గురించి కూడా ఆలోచించవచ్చు, అవి: మారుతి వాగన్ ఆర్ & టాటా పంచ్.
Maruti Wagon R & Tata Punch
మారుతి వాగన్ ఆర్ & టాటా పంచ్ - ఈ రెండు కార్లలో సీట్లు ఎత్తుగా ఉంటాయి, పెద్దవాళ్లు లోపలకు ఎక్కడం- కిందకు దిగడం చాలా సులభం. వీక్షణ (visibility) కూడా బాగుంటుంది, రోడ్డుపై డ్రైవింగ్ కూడా కంఫర్ట్‌గా ఉంటుంది. టాటా పంచ్ అయితే SUV స్పూర్తితో ఉండే కారు కాబట్టి స్టాన్స్ కూడా బలంగా ఉంటుంది.
హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో మాత్రమే చూసుకుంటే, మారుతి సుజుకి స్విఫ్ట్ పెద్దవారి ప్రయాణానికి మరింత అనుకూలం. కానీ మీరు కంఫర్ట్‌కి ప్రాధాన్యం ఇస్తే, వాగన్ ఆర్ లేదా టాటా పంచ్ లాంటి హయ్యర్ స్టాన్స్ వాహనాలు మరింత సరైన ఎంపికలు అవుతాయి.
మొత్తం మీద, పెద్దవారి ప్రయాణం సాఫీగా, సౌకర్యవంతంగా ఉండాలంటే కారు ఎంపికలో ఎత్తు, సీటింగ్ పొజిషన్, ఎక్కడం-దిగడంలో సౌలభ్యం వంటి అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోండి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















