Bajaj Platina vs TVS Sport - కొత్త GST తర్వాత మధ్య తరగతి వాళ్లు మెచ్చిన బైక్ ఏది?
GST తగ్గింపు తర్వాత Bajaj Platina & TVS Sport బైక్‌లు మోస్ట్ అఫర్డబుల్‌గా మారాయి. ఈ మోటార్ సైకిళ్లపై GST గతంలో 28% ఉండగా, ఇప్పుడు 18%కి తగ్గింది. మధ్యతరగతికి ఏ బైక్ మంచిదో తెలుసుకుందాం.

2025 Best Mileage Budget Bikes Under 1 Lakh: భారతదేశంలో, ద్విచక్ర వాహనాలపై ఇటీవలి GST ట్రిమింగ్‌తో సాధారణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు, చాలా బెనిఫిట్ పొందుతున్నారు. మోటార్ సైకిళ్ళపై గతంలో 28% GST ఉండగా, కేంద్ర ప్రభుత్వం దానిని 18%కి (GST 2025) తగ్గించింది. ఇది బైక్‌ల ధరలలో ప్రత్యక్షంగా ప్రతిబింబిస్తుంది. బజాజ్ ప్లాటినా & TVS స్పోర్ట్ వంటి మోస్ట్ పాపులర్ కమ్యూటర్ బైక్‌లు గతంతో పోలిస్తే ఇప్పుడు 10-15% చౌకగా మారాయి. Hero Splendor Plus తర్వాత, ప్లాటినా & స్పోర్ట్ రెండూ భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన బైక్‌లు. ఆఫీస్, కాలేజీ లేదా రోజువారీ ప్రయాణానికి ఇవి బాగా ఉపయోగపడతాయి.
బజాజ్ ప్లాటినా Vs TVS స్పోర్ట్: కొత్త ధర
GST తగ్గింపు తర్వాత, తెలుగు రాష్ట్రాల్లో బజాజ్ ప్లాటినా 100 ఎక్స్-షోరూమ్ ధర రూ. 65,407గా నిర్ణయించారు. ఈ బైక్ ఒకే వేరియంట్‌లో వస్తుంది.
TVS స్పోర్ట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 55,100 నుంచి రూ. 57,100 మధ్య ఉంటుంది. ఈ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది, అవి - సెల్ఫ్ స్టార్ట్ (ES) & సెల్ఫ్ స్టార్ట్ (ES Plus).
ధర పరంగా, TVS స్పోర్ట్ ప్రారంభ వేరియంట్ ప్లాటినా కంటే దాదాపు రూ. 8,000 చౌకగా ఉంటుంది, మీ బడ్జెట్‌కు మరింత అనుకూలంగా ఉంటుంది. అయితే, ప్లాటినా ఫినిషింగ్ & ఫీచర్లు కొద్దిగా ప్రీమియం టచ్ ఇస్తాయి.
ఇంజిన్ & పెర్ఫార్మెన్స్
ప్లాటినా & స్పోర్ట్ - రెండు బైక్‌లు కమ్యూటర్ విభాగానికి చెందినవి. అంటే.. నగరాలు/పట్టణాలు, రోజువారీ వినియోగం & చిన్న ప్రయాణాల కోసం వీటిని డిజైన్ చేశారు. బజాజ్ ప్లాటినా 100 ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో BS6-కంప్లైంట్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ స్మూత్‌గా స్టార్ట్ అవుతుంది, ఉద్గారాలను తగ్గిస్తుంది & మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది.
TVS స్పోర్ట్ కొంచెం పెద్ద ఇంజిన్‌ను కలిగి ఉంది, ప్లాటినా కంటే కొంచెం మెరుగైన పవర్ & టార్క్ ఇస్తుంది. దీనివల్ల సిటీ ట్రాఫిక్‌లో స్పోర్ట్ మరింత చురుగ్గా పని చేస్తుంది.
ఈ రెండు బైక్‌లకు 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది & తక్కువ బరువు కారణంగా నడపడం సులభం.
దేనికి ఎక్కువ మైలేజ్ ఉంది?
మధ్య తరగతి & రోజువారీ ప్రయాణికులకు మైలేజ్ కీలకమైన అంశం. ఈ విషయంలో ఈ రెండు బైక్‌లు నిరాశపరచవు.
బజాజ్ ప్లాటినా 100 లీటర్ పెట్రోల్‌కు 75 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది.
టీవీఎస్ స్పోర్ట్ లీటర్ పెట్రోల్‌తో 80 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.
మీరు రోజుకు 30-40 కిలోమీటర్లు ప్రయాణిస్తే, ఈ రెండు బైక్‌లు పెట్రోల్ ఖర్చులను ఆదా చేస్తాయి. కానీ, టీవీఎస్ స్పోర్ట్ మైలేజ్ పరంగా ఇంకొంచం ఎక్కువ ప్రయోజనం అందిస్తుంది.
రోజువారీ ఉపయోగం & సౌకర్యానికి ఏది మంచిది?
మీరు ప్రతిరోజూ ఆఫీసు లేదా కళాశాలకు వెళుతూ, లుక్స్ & హుషారు కలగలిసిన బైక్ కోరుకుంటే TVS స్పోర్ట్ సరైన ఎంపిక. దీని తేలికైన బరువు & కొంచెం ఎక్కువ ఇంజిన్ పవర్ ట్రాఫిక్‌లో హ్యాండిల్ చేయడాన్ని సులభతరం చేస్తాయి.
సౌకర్యం & మైలేజ్ మీ ప్రాధాన్యత అయితే, బజాజ్ ప్లాటినా 100 ఉత్తమ ఎంపిక. ప్లాటినా మరింత సౌకర్యవంతమైన సీటింగ్‌ను అందిస్తుంది & దాని సస్పెన్షన్ కఠినమైన రోడ్లపై కూడా బైక్‌ను బాగా తీసుకెళ్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, మీరు సౌకర్యం కోసం చూస్తున్నట్లయితే ప్లాటినా 100 ఉత్తమ ఎంపిక & స్టైల్ కోసం చూస్తున్నట్లయితే TVS స్పోర్ట్ బెస్ట్ ఛాయిస్.





















