అన్వేషించండి

డైలీ ఆఫీస్‌ & కాలేజీకి వెళ్లడానికి స్టైలిష్‌ ఎలక్ట్రిక్ బైక్‌లు, ₹74,999 నుంచి - అందరి కళ్లూ మీ మీదే ఉంటాయ్‌!

Electric Bikes, Scooters Under 1 Lakh: పెరుగుతున్న పెట్రోల్ ధరలతో, ఎలక్ట్రిక్ విభాగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్తులో ప్రజలందరి రవాణా సాధనాలు ఎలక్ట్రిక్‌ వాహనాలే కావచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Office College Affordable Electric Bikes Bikes 2025: టూవీలర్ల విభాగంలో, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్‌ భారతంలోనూ ఇప్పుడు ఎలక్ట్రిక్‌ టూవీలర్లే సేల్స్‌ రేస్‌లో ముందున్నాయి. పెట్రోల్ ఖర్చులు తగ్గించుకోవడానికి జనం ఈ-బైక్స్‌ కొంటున్నారు. ఇవి, జేబుపై భారాన్ని తగ్గించడమే కాకుండా, సజావుగా ప్రయాణించడం & సులభమైన నిర్వహణను కూడా అందిస్తాయి. ముఖ్యంగా, నగరాల్లోని రోజువారీ ప్రయాణానికి ఎలక్ట్రిక్‌ బైకులు బాగా ఉపయోగపడుతున్నాయి. మీ బడ్జెట్ పరిమితంగా ఉండి, ₹1 లక్ష కంటే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటే, ఈ వార్త మీ కోసమే. 

ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ (Ola Roadster X)
ఓలా లాంచ్‌ చేసిన కొత్త రోడ్‌స్టర్ X, కంపెనీ ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ బైక్. ప్రత్యేకంగా పట్టణ ప్రయాణికుల కోసం రూపొందించారు. దీని బేస్ వేరియంట్ 2.5 kWh బ్యాటరీతో వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో దీని ధర ₹1,04,999 (ఎక్స్‌-షోరూమ్‌). అయితే, ఎలక్ట్రిక్‌ వెహికల్‌ మీద ఇచ్చే డిస్కౌంట్లు పోను ఇది ₹74,999 ఎక్స్‌-షోరూమ్‌ ధరకు వస్తుంది, భారతదేశంలో అత్యంత అందుబాటు ధర ఎలక్ట్రిక్ బైక్‌గా నిలిచింది. పరిధి పరంగా, IDC (ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్) సర్టిఫికేషన్ ప్రకారం, ఈ బైక్ 252 కి.మీ. వరకు ప్రయాణించగలదు. అయితే, వాస్తవ ప్రపంచ పరిస్థితులలో, ఇది సులభంగా 150 కి.మీ. పరిధిని అందిస్తుంది. ఛార్జింగ్ సమయాలు కూడా ఆకట్టుకుంటాయి - కేవలం 3 నుంచి 4 గంటల్లో 0 నుండి 80% వరకు ఛార్జ్‌ అవుతుంది. MoveOS 5 ఆధారిత 4.3-అంగుళాల LCD డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ మోడ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), జియో-ఫెన్సింగ్ & థెఫ్ట్‌ అలెర్ట్‌ వంటి ఆధునిక సాంకేతికతలు దీనిలో ఉన్నాయి. 

ఒబెన్ రోర్ EZ (Oben Rorr EZ)
ఒబెన్ రోర్ EZ లుక్స్ & పెర్ఫార్మెన్స్ రెండింటిలోనూ ప్రీమియం. దీని బేస్ వేరియంట్ (2.6 kWh LFP బ్యాటరీ) ఎక్స్‌-షోరూమ్‌ ధర ₹99,999, అయితే టాప్ వేరియంట్ (4.4 kWh) ఎక్స్‌-షోరూమ్‌ ధర ₹1,29,999. ఈ బండి బ్యాటరీ LFP (లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్) టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. IDC ప్రకారం దీని రైడింగ్‌ రేంజ్‌ టాప్ వేరియంట్‌కు 175 కి.మీ. పరిధిని అందిస్తుంది. వాస్తవ పరిస్థితులలో ఇది సుమారు 140 కి.మీ. రేంజ్‌ అందిస్తుంది. 277 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 7.5 kW మోటారుతో శక్తినిస్తుంది & బైక్ గరిష్ట వేగం గంటకు 95 కి.మీ.కు చేరుతుంది. ఒబెన్ రోర్ EZ లో మూడు రైడింగ్ మోడ్స్‌ ఉన్నాయి - ఎకో, సిటీ & స్పోర్ట్. 

మ్యాటర్ ఎరా (Matter Erra)
మ్యాటర్ ఎరాను అహ్మదాబాద్‌కు చెందిన మ్యాటర్ మోటార్స్ అభివృద్ధి చేసింది. భారతదేశంలో మొట్టమొదటి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ ఇదే. బేస్ వేరియంట్ (ఎరా 5000) ధరలు ₹1,81,308 నుంచి ప్రారంభమవుతాయి, టాప్ వేరియంట్ (ఎరా 5000+) ధర ₹1,93,826. ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది, కానీ దాని 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో దీని పెర్ఫార్మెన్స్‌ అసాధారణంగా ఉంటుంది. ఇంజిన్‌కు బదులుగా గేర్‌బాక్స్ & ఎలక్ట్రిక్ మోటారు కలయిక దీనికి పెట్రోల్ లాంటి అనుభూతిని ఇస్తుంది. దీని IDC పరిధి 125 నుంచి 172 కి.మీ. & గరిష్ట వేగం గంటకు 100 కి.మీ కంటే ఎక్కువ. 

మీ బడ్జెట్ ₹75,000 వరకు ఉంటే & రోజువారీ సిటీ రైడింగ్ కోసం ఓలా రోడ్‌స్టర్ X ఉత్తమ ఎంపిక. కొంచెం ఎక్కువ రేంజ్ & పవర్ కోరుకుంటే ఒబెన్ రోర్ EZ కు ఓటేయవచ్చు. ఎలక్ట్రిక్‌లో కూడా గేర్‌లను ఆస్వాదించాలనుకుంటే మ్యాటర్ ఎరా మీకు సరిపోయే ప్రీమియం ఆప్షన్‌.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills by Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ కథ ముగించేస్తాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ కథ ముగించేస్తాం: తుమ్మల నాగేశ్వరరావు
India-China Direct Flights: 5 ఏళ్ల తరువాత భారత్ నుంచి చైనాకు డైరెక్ట్ ఫ్లైట్.. ఇరు దేశాలకు ముఖ్యమైన రోజు
5 ఏళ్ల తరువాత భారత్ నుంచి చైనాకు డైరెక్ట్ ఫ్లైట్.. ఇరు దేశాలకు ముఖ్యమైన రోజు
Hyderabad CP Sajjanar: మద్యం మత్తులో డ్రైవింగ్ చేసేవాళ్లంతా టెర్రరిస్టులు, మానవ బాంబులు: ఐపీఎస్ సజ్జనార్
మద్యం మత్తులో డ్రైవింగ్ చేసేవాళ్లంతా టెర్రరిస్టులు, మానవ బాంబులు: ఐపీఎస్ సజ్జనార్
Gopichand 33: భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో గోపీచంద్... ఇంటర్వెల్‌కు హైలైట్!
భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో గోపీచంద్... ఇంటర్వెల్‌కు హైలైట్!
Advertisement

వీడియోలు

Skeleton Lake: 16 వేల అడుగుల ఎత్తులో ఎటు చూసినా ఎముకలే..
Shubman Gill Performance | వరుసగా ఫెయిల్ అవుతున్న శుబ్మన్ గిల్
Rohit Sharma Records | India vs Australia ODI Series | రికార్డుల మోత మోగించిన రోహిత్
India vs Australia | Women's World Cup | ఆసీస్ తో భారత్ ఢీ
India vs Bangladesh | Women's World cup | బంగ్లాతో తలపడనున్న భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills by Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ కథ ముగించేస్తాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ కథ ముగించేస్తాం: తుమ్మల నాగేశ్వరరావు
India-China Direct Flights: 5 ఏళ్ల తరువాత భారత్ నుంచి చైనాకు డైరెక్ట్ ఫ్లైట్.. ఇరు దేశాలకు ముఖ్యమైన రోజు
5 ఏళ్ల తరువాత భారత్ నుంచి చైనాకు డైరెక్ట్ ఫ్లైట్.. ఇరు దేశాలకు ముఖ్యమైన రోజు
Hyderabad CP Sajjanar: మద్యం మత్తులో డ్రైవింగ్ చేసేవాళ్లంతా టెర్రరిస్టులు, మానవ బాంబులు: ఐపీఎస్ సజ్జనార్
మద్యం మత్తులో డ్రైవింగ్ చేసేవాళ్లంతా టెర్రరిస్టులు, మానవ బాంబులు: ఐపీఎస్ సజ్జనార్
Gopichand 33: భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో గోపీచంద్... ఇంటర్వెల్‌కు హైలైట్!
భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో గోపీచంద్... ఇంటర్వెల్‌కు హైలైట్!
NBK111 Movie: బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమా పూజకు మూహూర్తం ఖరారు... బడ్జెట్‌లో కోతలు??
బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమా పూజకు మూహూర్తం ఖరారు... బడ్జెట్‌లో కోతలు??
Kurnool Bus Accident: 18 మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగింత, ఒక మృతదేహంపై రాని క్లారిటీ
18 మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగింత, ఒక మృతదేహంపై రాని క్లారిటీ
Cyclone Montha Impact in AP: మొంథా తుఫాన్ ముప్పు.. ఈ 30 వరకు ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు
మొంథా తుఫాన్ ముప్పు.. ఈ 30 వరకు ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు
Telangana Employees Salaries: తెలంగాణ ఉద్యోగుల జీతాలపై కీలక నిర్ణయం.. అర్ధరాత్రి వరకు టైమ్, లేకపోతే జీతాలు బంద్!
తెలంగాణ ఉద్యోగుల జీతాలపై కీలక నిర్ణయం.. అర్ధరాత్రి వరకు టైమ్, లేకపోతే జీతాలు బంద్!
Embed widget