Bajaj CT 110X: 70 కిలోమీటర్ల మైలేజ్ - రూ.10 వేల డౌన్ పేమెంట్ - బజాజ్ బైక్‌పై బంపర్ ఆఫర్!
Bajaj CT 110X Down Payment: బెస్ట్ మైలేజీని అందించే బైక్స్‌లో బజాజ్ సీటీ 110ఎక్స్ బైక్ ముందంజంలో ఉంది. దీన్ని రూ. 10 వేలు డౌన్ పేమెంట్ చెల్లించి ఇంటికి తీసుకువెళ్ళిపోయే ఆప్షన్ ఉంది.

Bajaj CT 110X Bike on Down Payment and EMI: మీరు ప్రతిరోజూ ఇంటి నుంచి ఆఫీస్‌కి వెళ్లడానికి అనువైన బైక్ కోసం చూస్తున్నట్లయితే మీకు ఒక మంచి ఆప్షన్ ఉంది. తక్కువ ధరలో లభించే, మైలేజీ పరంగా కూడా పర్ఫెక్ట్ గా ఉండే బైక్ గురించి తెలుసుకుందాం. ఈ బైక్ బజాజ్ సీటీ 110ఎక్స్. ఇది నగరంలోని రద్దీగా ప్రాంతాల కోసం బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
ఎంత డౌన్‌పేమెంట్ కట్టాలి?
బజాజ్ సీటీ 110ఎక్స్ బేస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర దాదాపు రూ.70 వేల వరకు ఉంది. దీని ఆన్ రోడ్ ధర దాదాపు రూ.85 వేల వరకు ఉండవచ్చు. రూ.10 వేలు డౌన్ పేమెంట్ చేస్తే దాదాపు రూ.75 వేలు లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రుణం 9.7 శాతం వడ్డీ రేటుతో మూడు సంవత్సరాల పాటు అందుబాటులో ఉంటుంది. మీరు ప్రతి నెలా రూ. 2400 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మీకు లభించే లోన్ అమౌంట్, వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది.
Also Read: సింగిల్ ట్యాంక్ ఫుల్‌తో 1000 కిలోమీటర్లు నడిచే టాప్ 5 కార్లు - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?
బజాజ్ సీటీ 110ఎక్స్ పవర్‌ట్రెయిన్, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఈ బజాజ్ బైక్ 115.45 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్‌తో మార్కెట్లోకి వస్తుంది. ఇది 7000 ఆర్పీఎం వద్ద 8.6 పీఎస్ పవర్‌ని, 5000 ఆర్పీఎం వద్ద 9.81 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లుగా ఉంది. మ్యాట్ వైల్డ్ గ్రీన్, ఎబోనీ బ్లాక్ రెడ్, ఎబోనీ బ్లాక్ బ్లూతో కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
బజాజ్ సీటీ 110ఎక్స్‌లో బ్రేకింగ్ కోసం రెండు చక్రాలకు డ్రమ్ బ్రేక్‌లను అందించారు. ఇది ముందువైపు 130 ఎంఎం డ్రమ్ బ్రేక్, వెనుకవైపు 110 ఎంఎం డ్రమ్ బ్రేక్‌తో కూడిన కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. సస్పెన్షన్ కోసం లాంగ్ ట్రావెల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, రియర్ హైడ్రాలిక్ ఎన్ఎన్ఎస్ సస్పెన్షన్ సెటప్ అందుబాటులో ఉన్నాయి.
Also Read: రూ.10 లక్షల్లో బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే - ఆల్టో కే10 నుంచి పంచ్ వరకు!
It's a matter of great honour and pride for us that Bajaj Freedom CNG has been awarded "Best Alternative Fuel Two Wheeler of the Year" at the prestigious Times Drive Green Conclave Awards 2024! #RideTheChange#Freedom #BajajFreedom#BajajAuto #TheWorldsFavouriteIndian pic.twitter.com/FZHWFPsf10
— Bajaj Auto Ltd (@_bajaj_auto_ltd) December 5, 2024
The energy was electric when a crew of maniacs and bike junkies linked up to ride the Pulsar N125 on those crazy curves in Delhi and Pune.
— Bajaj Auto Ltd (@_bajaj_auto_ltd) October 30, 2024
Who’s ready to hit the streets and flex with it?#BajajPulsar #DefinitelyDaring pic.twitter.com/N4tJxf4jDH





















