Axor Brutale Dual Spoiler Helmet: వామ్మో.. యాక్సర్ బ్రూటల్ హెల్మెట్ కాస్ట్ రూ.8000 - ఇందులోని ప్రత్యేకతలు ఏంటో చూద్దామా..!
రూ. 8,000 ధరలో యాక్సర్ బ్రూటల్ హెల్మెట్ ప్రీమియం ఫీచర్లు, గట్టి భద్రతను అందిస్తోంది. దీని డ్యూయల్ స్పాయిలర్ డిజైన్, ఈసీఈ 22.06 సర్టిఫికేషన్ రైడర్లకు బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చని నిపుణులు అంటున్నారు.

Axor Brutale Dual Spoiler Helmet News: ఈప్రీమియం హెల్మెట్ రంగంలో యాక్సర్ (Axor) తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా యువ రైడర్లను ఆకట్టుకోవడానికి సరికొత్త హంగులతో బ్రూటల్ డ్యూయల్ స్పాయిలర్ (Axor Brutale Dual-Spoiler) మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. సుమారు రూ. 8,000 ధరలో లభించే ఈ హెల్మెట్ కేవలం చూడటానికి మాత్రమే కాకుండా, భద్రత పరంగా కూడా ఎలా ఉందో కూడా తెలుసుకుందాం.
ఫిట్టింగ్ , కంఫర్ట్ ..
ఈ హెల్మెట్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీని 'టూ-షెల్ సైజ్' నిర్మాణం గురించి. సాధారణంగా చాలా బ్రాండ్లలో ఒకే షెల్ సైజ్ వాడటం వల్ల హెల్మెట్ తలకు సరిగ్గా సెట్ కాదు. కానీ యాక్సర్ బ్రూటల్ ప్రతి సైజుకు పక్కాగా సరిపోతుంది. దేశీయ బ్రాండ్లు అయిన ఇగ్నైట్ (Ignyte) వంటి వాటితో పోలిస్తే ఇది తలకు చాలా స్నగ్ (Snug) గా, భద్రంగా అనిపిస్తుంది. ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు ఈ కంఫర్ట్ వల్ల అస్సలు ఇబ్బంది కలగదు.
సెక్యూరిటీ ఫీచర్లు - బిల్డ్ క్వాలిటీ..
సెక్యూరిటీ విషయంలో యాక్సర్ ఎక్కడా రాజీ పడలేదు. దీనికి ఐఎస్ఐ (ISI), డాట్ (DOT) తో పాటు అత్యంత కఠినమైన ఈసీఈ 22.06 (ECE 22.06) సర్టిఫికేషన్లు ఉన్నాయి. పాలీకార్బోనేట్ షెల్ చాలా ధృడంగా అనిపిస్తుంది. ప్రమాద సమయాల్లో సులభంగా తొలగించగల 'ఎమర్జెన్సీ రిమూవబుల్ చీక్ ప్యాడ్స్' ఉండటం ఈ ధరలో లభించే గొప్ప ఫీచర్. హైవేలపై వేగంగా వెళ్తున్నప్పుడు గాలి సౌండ్ (Wind Noise) కూడా చాలా తక్కువగా వినిపిస్తుంది.
ఫీచర్లు - రోజూవారీ వాడకం..
ప్రాక్టికల్ ఫీచర్ల విషయంలో కూడా ఇది ముందుంది. డీ-రింగ్ క్లోజర్ సిస్టమ్‌కు చిన్న మాగ్నెటిక్ హోల్డర్ ఇచ్చారు, దీనివల్ల ఎక్స్‌ట్రా స్ట్రాప్ గాలికి కొట్టుకోకుండా ఉంటుంది. లోపలి వైపు సన్ వైజర్ ఉండటం వల్ల పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రయాణించవచ్చు. గ్లోవ్స్ వేసుకున్నప్పుడు వైజర్ ఆపరేట్ చేయడం కొంచెం కష్టంగా అనిపించినా, వాడుతున్న కొద్దీ అది అలవాటు అవుతుంది.
డిజైన్ - ఏరోడైనమిక్స్..
వెనుక వైపు ఉన్న డ్యూయల్ స్పాయిలర్ డిజైన్ హెల్మెట్‌కు అగ్రెసివ్ స్పోర్ట్స్ లుక్ ఇస్తుంది. ఇది కేవలం షో కోసమే కాకుండా, హై స్పీడ్ వద్ద బైక్ స్థిరంగా ఉండటానికి సహకరిస్తుంది. డిజైన్ అనేది వ్యక్తిగత ఇష్టం కాబట్టి, కొందరికి ఇది కొంచెం అతిగా అనిపించవచ్చు, కానీ మెజారిటీ రైడర్లకు మాత్రం ఈ స్టైలింగ్ నచ్చుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు
ఓవరాల్ గా మంచి భద్రతతో పాటు ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి యాక్సర్ బ్రూటల్ ఒక అద్భుతమైన ఆప్షన్. టూరింగ్ చేసే వారికి, రోజూ ఆఫీసుకు వెళ్లే వారికి ఇది అన్ని రకాలుగా సెట్ అవుతుంది. రూ. 8,000 బడ్జెట్‌లో ఒక కంప్లీట్ ప్యాకేజీ కావాలనుకుంటే దీని వైపు మొగ్గు చూపవచ్చని నిపుణులు అంటున్నారు. ఏదేమైనా పిండి కొద్ది రొట్టే అన్నట్లుగా ఎనిమిది వేల ప్రీమియం రేటుతో లభించే ఈ హెల్మెట్లో సౌకర్యాలు కూడా అదే రేంజిలో ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ట్రెండింగ్ వార్తలు





















