అన్వేషించండి

Night Driving Safety Tips: నైట్ డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ సేఫ్టీ టిప్స్ పాటించకపోతే రిస్క్ లో పడ్డట్టే.. !

Night Driving Safety Tips: రాత్రిపూట డ్రైవింగ్ చేయడం సవాలుతో కూడుకున్న పని. తక్కువ వెలుతురు, అలసట వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టడానికి పాటించాల్సిన బెస్ట్ సేఫ్టీ టిప్స్ గురించి తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రాత్రి డ్రైవింగ్: హెడ్లైట్లు శుభ్రంగా, సరిగ్గా అలైన్ అవ్వాలి.
  • రెండు గంటలకోసారి చిన్న బ్రేక్, నిద్రపోయి ప్రయాణం మంచిది.
  • ఎదురుగా వచ్చే లైట్లపై కాకుండా రోడ్డు అంచుపై దృష్టి పెట్టాలి.
  • రాత్రి పూట వేగ నియంత్రణ, తగినంత దూరం పాటించాలి.

Night Driving Safety Guide: పగటి పూట డ్రైవింగ్ కంటే రాత్రి వేళ ప్రయాణం ఎంతో భిన్నంగా ఉంటుంది. తక్కువ విజిబిలిటీ, పెరిగే అలసట స్థాయిలు, ఊహించని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ప్రకృతి సిద్ధమైన వెలుతురు లేకపోవడం వల్ల దారిలో లోతును అంచనా వేయడం కష్టమవుతుంది. ఎదురుగా వచ్చే వాహనాల లైట్ల వెలుతురు కళ్లపై పడటం వల్ల చూపు మందగిస్తుంది. మన శరీరం సహజంగా రాత్రి పూట విశ్రాంతిని కోరుకుంటుంది, కాబట్టి ఏమరుపాటుగా ఉంటే ప్రతిచర్యలు నెమ్మదించి ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది. అందుకే నైట్ డ్రైవింగ్‌లో సురక్షితంగా ఉండటానికి ఈ క్రింది అంశాలను తప్పక గుర్తుంచుకోవాలి.

విజిబిలిటీ - హెడ్‌లైట్ల నిర్వహణ..
చీకటి పడ్డాక రోడ్డు గుర్తులు, మలుపులు, అడ్డంకులను గుర్తించడం కష్టమవుతుంది. ముఖ్యంగా వెలుతురు తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇది మరింత ప్రమాదకరం. మీ కారు హెడ్‌లైట్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. అవి సరిగ్గా అలైన్ అయి ఉంటేనే దారి స్పష్టంగా కనిపిస్తుంది. చీకటి రోడ్లపై హై బీమ్ వాడటం మంచిదే అయినా, ఎదురుగా ఏదైనా వాహనం వస్తున్నప్పుడు దానిని వెంటనే లో బీమ్ కు మార్చాలి. అలాగే కారు విండ్‌షీల్డ్, మిర్రర్స్ మీద దుమ్ము లేకుండా చూసుకోవడం వల్ల చూపు స్పష్టంగా ఉంటుంది.

చిన్న బ్రేక్స్ కంప‌ల్స‌రీ..
లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అలసట అనేది క్రమంగా పెరుగుతుంది. రోజంతా పనులు ముగించుకుని రాత్రి ప్రయాణం మొదలుపెడితే నిద్రమత్తు వచ్చే అవకాశం ఉంది. ఆవలింతలు రావడం, ఏకాగ్రత తగ్గడం వంటివి ప్రమాదానికి సంకేతాలు. ప్రతి రెండు గంటలకోసారి చిన్న బ్రేక్ తీసుకోవడం వల్ల శరీరం ఉత్తేజితం అవుతుంది. కెఫిన్ వంటి పానీయాలు తాత్కాలికంగా మేల్కొనేలా చేసినా, అవి నిద్రకు ప్రత్యామ్నాయం కావు. బాగా నిద్రపోయి ప్రయాణం మొదలుపెట్టడం అన్నిటికంటే సురక్షితం.

ఎదురుగా వచ్చే వెలుతురు నుండి రక్షణ..
సింగిల్ రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాల హై బీమ్ వెలుతురు కళ్లపై పడి కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి. అటువంటప్పుడు నేరుగా ఆ లైట్లను చూడకుండా, మీ వైపు రోడ్డు అంచు (Lane Edge) మీద దృష్టి పెట్టాలి. లోపలి రియర్ వ్యూ మిర్రర్‌ను 'నైట్ మోడ్'లో ఉంచడం ద్వారా వెనుక వచ్చే వాహనాల వెలుతురు నుండి ఉపశమనం పొందవచ్చు.

వేగ నియంత్రణ..
రాత్రి పూట పరిమిత వేగంతో ప్రయాణించడం చాలా ముఖ్యం. తక్కువ వెలుతురులో ఏదైనా అడ్డంకిని చూశాక స్పందించడానికి తక్కువ సమయం ఉంటుంది. ముందు వెళ్తున్న వాహనానికి, మీ కారుకు మధ్య దూరం ఎక్కువగా ఉండేలా చూసుకోండి. దీనివల్ల అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సి వచ్చినా మీకు తగినంత సమయం లభిస్తుంది.

ఏకాగ్రత దెబ్బతినకుండా..
డ్రైవింగ్ చేసేటప్పుడు పరధ్యానంగా అస్సలు ఉండకూడదు. కారు డ్యాష్‌బోర్డ్ వెలుతురు మరీ ఎక్కువగా ఉంటే నైట్ విజన్ దెబ్బతింటుంది, కాబట్టి దానిని కళ్లకు ఇబ్బంది లేకుండా సర్దుబాటు చేయాలి. పెద్ద శబ్దంతో మ్యూజిక్ వినడం, ఫోన్ వాడటం లేదా తోటి ప్రయాణికులతో సుదీర్ఘ చర్చలు చేయడం వల్ల ఏకాగ్రత తగ్గుతుందని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. వర్షం, పొగమంచు వంటి వాతావరణ పరిస్థితుల్లో డ్రైవింగ్ ఇంకా కష్టమవుతుంది. అటువంటి సమయాల్లో ఫాగ్ ల్యాంప్స్ వాడుతూ, అతి తక్కువ వేగంతో ప్రయాణించాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ నైట్ జర్నీ ఎంతో సురక్షితంగా సాగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Frequently Asked Questions

రాత్రి పూట డ్రైవింగ్ చేయడం ఎందుకు ప్రమాదకరం?

రాత్రి పూట తక్కువ వెలుతురు, పెరిగే అలసట, ఊహించని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఎక్కువ. వెలుతురు లేకపోవడం వల్ల దారి లోతును అంచనా వేయడం కష్టం.

రాత్రి పూట డ్రైవింగ్ చేసేటప్పుడు హెడ్‌లైట్ల నిర్వహణ ఎలా ఉండాలి?

హెడ్‌లైట్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి మరియు సరిగ్గా అలైన్ అయి ఉండాలి. ఎదురుగా వాహనాలు వస్తున్నప్పుడు హై బీమ్ నుండి లో బీమ్ కు మార్చాలి.

రాత్రి పూట లాంగ్ డ్రైవ్‌లలో అలసటను ఎలా అధిగమించాలి?

ప్రతి రెండు గంటలకోసారి చిన్న బ్రేక్ తీసుకోవడం వల్ల శరీరం ఉత్తేజితం అవుతుంది. ప్రయాణం మొదలుపెట్టే ముందు తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం.

ఎదురుగా వచ్చే వాహనాల లైట్ల వెలుతురు కళ్లపై పడితే ఏమి చేయాలి?

నేరుగా ఆ లైట్లను చూడకుండా, మీ వైపు రోడ్డు అంచు (Lane Edge) మీద దృష్టి పెట్టాలి. వెనుక వచ్చే వాహనాల లైట్ల కోసం రియర్ వ్యూ మిర్రర్‌ను 'నైట్ మోడ్'లో ఉంచాలి.

రాత్రి పూట డ్రైవింగ్‌లో వేగాన్ని ఎంత నియంత్రించుకోవాలి?

రాత్రి పూట పరిమిత వేగంతో ప్రయాణించడం ముఖ్యం. ముందు వెళ్తున్న వాహనానికి, మీ కారుకు మధ్య దూరం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

టాప్ హెడ్ లైన్స్

Kia Sorento: భారత్ మార్కెట్‌లో కియా సోరెంటో SUV ఎంట్రీ.. లగ్జరీ కారు సూపర్ ఫీచర్లు
భారత్ మార్కెట్‌లో కియా సోరెంటో SUV ఎంట్రీ.. లగ్జరీ కారు సూపర్ ఫీచర్లు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
7 సీటర్ కోసం చూస్తున్నారా.. Volkswagen Tayron పై రూ.1.50 లక్షలు ఆదా, 9 ఎయిర్ బ్యాగ్స్
7 సీటర్ కోసం చూస్తున్నారా.. Volkswagen Tayron పై రూ.1.50 లక్షలు ఆదా, 9 ఎయిర్ బ్యాగ్స్
మీ దగ్గర 1.82 లక్షలు ఉంటే చాలు, టాటా పంచ్ EV ని కొనేయొచ్చు! వడ్డీ రేట్లు, EMI పూర్తి లెక్కలు ఇవిగో!
కొత్త Tata Punch EV కొనడానికి లోన్‌ ఎంత ఇస్తారు? తక్కువ EMI కోసం ఎన్నేళ్ల టెన్యూర్‌ ఎంచుకోవాలి?

వీడియోలు

Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Team India Review Meeting | టీమిండియా ఓటములు, గాయాలపై బీసీసీఐ బిగ్ రివ్యూ
MS Dhoni IPL Impact Player | ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
Women's T20 Asia Cup 2026 india vs hong kong | హాంకాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి భారత్
Gundenininda Gudigantalu Serial September 4 | మీనా దెబ్బకు దారికొచ్చిన సంజీవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
Konda Surekha: బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
Pawan Kalyan On Fire: సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Pedakakani Temple Issue: పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
Dragon: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో షాహిద్ & ఆలియా... కన్ఫర్మ్ గురూ
ఎన్టీఆర్ 'డ్రాగన్'లో షాహిద్ & ఆలియా... కన్ఫర్మ్ గురూ
Health Insurance : హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి? ముందుగా తీసుకుంటే ఎందుకు మంచిదంటే..
హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి? ముందుగా తీసుకుంటే ఎందుకు మంచిదంటే..
Sahaa Movie : గుండు కొట్టించుకుంటామన్నా... నెంబర్స్ ఛాలెంజ్ చేశా - 20 థియేటర్సే ఇచ్చారు భయ్యా... హీరో ఎమోషనల్
గుండు కొట్టించుకుంటామన్నా... నెంబర్స్ ఛాలెంజ్ చేశా - 20 థియేటర్సే ఇచ్చారు భయ్యా... హీరో ఎమోషనల్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Embed widget