అన్వేషించండి

India's Vehicle Number Plates: వెహికిల్ నంబర్ ప్లేట్ రంగుల వెనుక ఇన్ని కథలు ఉన్నాయా? ఏ రంగు దేనికి సంకేతమో తెలుసుకోండి!

ఇండియాలో వాహనాలకు ఉండే నంబర్ ప్లేట్ల రంగులు కేవలం అలంకారం కాదు. అవి ఆ వాహన యజమాని హోదాను, దాని వినియోగాన్ని తెలియజేస్తాయి. ఆ రంగుల రహస్యాల గురించి తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలుపు ప్లేట్ వ్యక్తిగత వాహనాలకు, పసుపు ప్లేట్ వాణిజ్య వాహనాలకు కేటాయింపు.
  • నలుపు ప్లేట్ అద్దెకు తీసుకునే వాహనాలకు, ఆకుపచ్చ ప్లేట్ ఎలక్ట్రిక్ వాహనాలకు.
  • ఎరుపు ప్లేట్ తాత్కాలిక రిజిస్ట్రేషన్, అధికారిక వాహనాలకు, నీలం ప్లేట్ దౌత్య వాహనాలకు.
  • సైనిక వాహనాలకు బాణం గుర్తు, ఉద్యోగులకు బీహెచ్ సిరీస్ ప్లేట్.

India's Vehicle Number Plates:  ఇండియ‌న్ రహదారులపై ప్రయాణించేటప్పుడు మనం రకరకాల రంగుల నంబర్ ప్లేట్లను గమనిస్తుంటాం. ఇవి కేవలం చట్టపరమైన గుర్తింపు కార్డులు మాత్రమే కాదు. నంబర్ ప్లేట్ రంగు, దాని మీద ఉండే అక్షరాల షేడ్, కొన్నిసార్లు ఆ ప్లేట్ పైన ఉండే చిహ్నాలు ఆ వాహనం ఏ అవసరం కోసం వాడుతున్నారో ఇట్టే చెప్పేస్తాయి. ప్రైవేట్ కార్ల నుండి టాక్సీల వరకు, ఎలక్ట్రిక్ వాహనాల నుండి మిలిటరీ ట్రక్కుల వరకు ప్రతి విభాగానికి ట్రాన్స్‌పోర్ట్ అధికారులు ఒక ప్రత్యేక కలర్ కోడ్ కేటాయించారు.

తెల్లటి నంబర్ ప్లేట్ (White Number Plate)..
నలుపు రంగు అక్షరాలతో ఉండే తెల్లటి ప్లేట్ మనకు రోడ్లపై అత్యంత సాధారణంగా కనిపిస్తుంది. ఇది కేవలం సొంత వాహనాలకు (Private Vehicles) మాత్రమే కేటాయిస్తారు. వ్యక్తిగత అవసరాల కోసం కొనుగోలు చేసిన కార్లు, బైకులు, స్కూటర్లకు ఈ ప్లేట్ ఉంటుంది. ఈ వాహనాలను వాణిజ్య పరంగా ప్రయాణికులను చేరవేయడానికి లేదా వస్తువుల రవాణాకు ఉపయోగించకూడదు.

 పసుపు రంగు నంబర్ ప్లేట్ (Yellow Number Plate)
పసుపు రంగు బ్యాక్‌గ్రౌండ్‌పై నలుపు అక్షరాలు ఉంటే అది కమర్షియల్ వాహనం అని అర్థం. టాక్సీలు, క్యాబ్‌లు, బస్సులు, ట్రక్కులు, ఆటో రిక్షాలు ఈ కేటగిరీ కిందకు వస్తాయి. వీటిని వ్యాపార అవసరాలకు వాడుకోవచ్చు. ఇటువంటి వాహనాలను నడిపే డ్రైవర్లకు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్, ప్రత్యేక పర్మిట్లు అవసరం అవుతాయి.

 నల్లటి నంబర్ ప్లేట్ (Black Number Plate)
నలుపు రంగు ప్లేట్ మీద పసుపు అక్షరాలు ఉంటే అవి సెల్ఫ్ డ్రైవ్ రెంటల్ వాహనాలు. అంటే వీటిని అద్దెకు తీసుకుని మనమే డ్రైవ్ చేయవచ్చు. జూమ్ కార్ వంటి కంపెనీలు ఈ రకమైన ప్లేట్లు వాడుతుంటాయి. ఈ వాహనం కమర్షియల్ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నప్పటికీ, దీనిని నడిపే కస్టమర్‌కు సాధారణ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది.

 ఆకుపచ్చ నంబర్ ప్లేట్ (Green Number Plate)
ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) గ్రీన్ ప్లేట్లు కేటాయిస్తారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. వైట్ అక్షరాలు ఉంటే అది ప్రైవేట్ ఈవీ అని, అదే ఎల్లో అక్షరాలు ఉంటే అది కమర్షియల్ ఈవీ అని గుర్తించాలి. ఎలక్ట్రిక్ టాక్సీలు, డెలివరీ వ్యాన్లకు ఈ ప్లేట్లు ఉంటాయి.

ఎరుపు రంగు నంబర్ ప్లేట్ (Red Number Plate)..
కొత్తగా కొన్న వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ అయ్యే వరకు తాత్కాలికంగా (Temporary) ఎరుపు రంగు ప్లేట్ ఇస్తారు. దీని వాలిడిటీ కేవలం 30 రోజులు మాత్రమే ఉంటుంది. మరోవైపు, భారత రాష్ట్రపతి, గవర్నర్ల అధికారిక వాహనాలపై కూడా ఎర్రటి ప్లేట్ ఉంటుంది. అయితే వీటి మీద నంబర్లకు బదులు భారత జాతీయ చిహ్నం (State Emblem) ఉంటుంది.

 నీలం రంగు నంబర్ ప్లేట్ (Blue Number Plate)..
విదేశీ రాయబార కార్యాలయాలకు (Embassy) చెందిన వాహనాలకు బ్లూ కలర్ ప్లేట్ ఇస్తారు. వీటిపై రాష్ట్ర కోడ్‌కు బదులుగా 'CC' (Consular Corps), 'DC' (Diplomatic Corps) లేదా 'UN' (United Nations) వంటి కోడ్‌లు కనిపిస్తాయి. ఇవి దౌత్యవేత్తల ప్రత్యేక హోదాను సూచిస్తాయి.

పైకి చూపిస్తున్న బాణం గుర్తు (Upward Arrow)
సైనిక వాహనాలపై (Military Vehicles) నంబర్ ప్లేట్లు భిన్నంగా ఉంటాయి. వీటి ప్రారంభంలో పైకి చూపిస్తున్న బాణం గుర్తు (Broad Arrow) ఉంటుంది. ఇవి సాధారణ ఆర్టీఓ (RTO) పరిధిలోకి రావు. రక్షణ శాఖ ప్రత్యేక నంబరింగ్ వ్యవస్థను అనుసరిస్తాయి.

బిహెచ్ (BH) సిరీస్ ప్లేట్..
తరచుగా ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి బదిలీ అయ్యే ఉద్యోగుల కోసం 'భారత్ సిరీస్' (BH) నంబర్ ప్లేట్ ప్రవేశపెట్టారు. దీనివల్ల రాష్ట్రం మారిన ప్రతిసారీ కొత్తగా వాహనాన్ని రీ-రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన తలనొప్పి ఉండదు.

 

Frequently Asked Questions

తెల్లటి నంబర్ ప్లేట్ ఏ వాహనాలకు ఉపయోగిస్తారు?

తెల్లటి నంబర్ ప్లేట్ నలుపు అక్షరాలతో సొంత (ప్రైవేట్) వాహనాలకు కేటాయిస్తారు. వీటిని వ్యక్తిగత అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి.

పసుపు రంగు నంబర్ ప్లేట్ దేనిని సూచిస్తుంది?

పసుపు రంగు బ్యాక్‌గ్రౌండ్‌పై నలుపు అక్షరాలతో ఉండే ప్లేట్ కమర్షియల్ వాహనాలను సూచిస్తుంది. టాక్సీలు, బస్సులు, ట్రక్కులు దీని కిందకు వస్తాయి.

ఆకుపచ్చ నంబర్ ప్లేట్లు ఏ వాహనాలకు ఉంటాయి?

ఆకుపచ్చ నంబర్ ప్లేట్లు ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) కేటాయిస్తారు. వైట్ అక్షరాలు ప్రైవేట్ ఈవీలను, ఎల్లో అక్షరాలు కమర్షియల్ ఈవీలను సూచిస్తాయి.

కొత్త వాహనాలకు ఇచ్చే ఎరుపు రంగు ప్లేట్ యొక్క ఉద్దేశ్యం ఏమిటి?

కొత్తగా కొన్న వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ అయ్యే వరకు తాత్కాలికంగా ఎరుపు రంగు ప్లేట్ ఇస్తారు. దీని వాలిడిటీ 30 రోజులు మాత్రమే ఉంటుంది.

విదేశీ రాయబార కార్యాలయ వాహనాల నంబర్ ప్లేట్లు ఎలా ఉంటాయి?

విదేశీ రాయబార కార్యాలయ వాహనాలకు బ్లూ కలర్ ప్లేట్లు ఉంటాయి. వీటిపై 'CC', 'DC', లేదా 'UN' వంటి కోడ్‌లు ఉంటాయి.

టాప్ హెడ్ లైన్స్

స్పోర్టీ లుక్‌తో వచ్చిన ఏప్రిలియా SXR GT 175 మ్యాక్సీ స్కూటర్.. ఇంజిన్‌, ఫీచర్లు, సౌకర్యం ఎలా ఉన్నాయి?
Aprilia SXR GT 175 ఫుల్‌ రివ్యూ.. ఈ బండిని కొనొచ్చా? ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి?
39hp పవర్.. ట్విన్ సిలిండర్ ఇంజిన్.. కేటీఎం డ్యూక్‌కు పోటీ.. Kawasaki Z300 గురించి ఇంకా మీకేం తెలుసు?
యూత్‌ఫుల్‌ బైక్‌ కవాసాకి Z300 గురించి 5 కీలక విషయాలు.. కొనే ముందే మీకివి తెలియాలి!
Top 10 Best Selling SUVs: బడ్జెట్‌ కార్లలో ఏది నంబర్ వన్? అమ్మకాల్లో ముందున్న టాప్ 10 SUVల లిస్ట్‌
గత 6 నెలల్లో జనం ఎక్కువగా కొన్న టాప్‌ 10 కార్లు.. వీటికి ఫుల్‌ డిమాండ్‌, మీ బడ్జెట్‌లోనే!
కేటీఎం డ్యూక్, టీవీఎస్ అపాచీకి గట్టి పోటీ.. Kawasaki Z300 లాంచ్‌.. ఈ బండి ప్రత్యేకతలు ఇవే!
యూత్‌ చేతికి కొత్త బండి.. స్పోర్టీ 296cc ఇంజిన్, 39hp పవర్‌తో Kawasaki Z300 ఎంట్రీ

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Teja Sajja : US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
IND VS NZ Result Update: :  టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
Embed widget