News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Hyundai i20 N Line Sale: కొత్త హ్యుందాయ్ ఎన్20 సేల్ ప్రారంభం - ధర, ఫీచర్లు ఎలా?

Hyundai i20 N Line Sale: 2023 హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ కారు సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. దీని ఎక్స్ షోరూం ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

FOLLOW US: 
Share:

2023 హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ (2023 Hyundai i20 N Line Sale) కారు ఇప్పుడు భారతదేశంలో సేల్‌కు అందుబాటులో ఉంది. ఈ అప్‌డేట్ చేసిన మోడల్ పరిధిలో ఎన్6, ఎన్8 రెండు ట్రిమ్‌లు ఉన్నాయి. ఇవి రెండూ 1.0 లీటర్ టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతాయి. దీంతోపాటు కొత్త 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ డీసీటీతో సహా రెండు గేర్‌బాక్స్‌ల ఆప్షన్‌ను కూడా ఇవి పొందుతాయి. ఈ ఇంజన్ 6,000 ఆర్పీఎం వద్ద 120 పీఎస్ శక్తిని, 1,500 నుంచి 4,000 ఆర్పీఎం మధ్య 172 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

2023 హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ డిజైన్, ఫీచర్ల విషయానికి వస్తే... ఇందులో కొత్త ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ అందించారు. అలాగే ఈ కారులో 16 అంగుళాల అలోయ్ వీల్స్ కూడా ఉన్నాయి. ఈ కారుపై ఎన్ బ్రాండింగ్ లోగోను కూడా చూడవచ్చు. ఈ కారులో ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (హెచ్ఏసీ), వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (వీఎస్ఎం), 3 పాయింట్ సీట్ బెల్ట్స్, ఆల్ డిస్క్ బ్రేక్స్, ఆటోమేటిక్ రేర్ హెడ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు కూడా అందించారు.

2023 హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ కారులో 35 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఎన్ లోగో ఉన్న మూడు స్పోక్ల స్టీరింగ్ వీల్, ఎన్ లోగో ఉన్న లెదర్ సీట్లు, లెదర్ కవర్డ్ గేర్ షిఫ్టర్, రెడ్ యాంబియంట్ లైటింగ్ ఇంటీరియర్‌లో అందించారు. కొత్త ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం కూడా ఈ కారులో ఉంది. ఏడు స్పీకర్ల బోస్ సిస్టం, 60కి పైగా కార్ కనెక్టెడ్ ఫీచర్లు, 127 ఎంబెడెడ్ వీఆర్ కమాండ్స్, 52 హింగ్లిష్ వాయిస్ కమాండ్స్, ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్స్, సీ-టైప్ ఛార్జర్ ఫీచర్లు కూడా ఇందులో అందించారు.

దీని ఇంజిన్ ఎలా ఉంది?
ఈ కారులో 1.0 లీటర్ టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్ అందించారు. హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ ఇంజిన్ 120 పీఎస్ పవర్, 172 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. మాన్యువల్, డీసీటీ ఆప్షన్లలో ఈ కారు అందుబాటులో ఉంది. దీన్ని ఎన్6, ఎన్8 ట్రిమ్‌ల్లో కొనుగోలు చేయవచ్చు.

2023 హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ ఇంజిన్ ఎంటీ వేరియంట్ ధర (2023 Hyundai i20 N Line Sale Price) మనదేశంలో రూ.9.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది. టాప్ ఎండ్ డీసీటీ వేరియంట్ ధర రూ.12.3 లక్షలుగా నిర్ణయించారు. ఇది కేవలం ఎక్స్ షోరూం ధర మాత్రమే. ప్రస్తుతం మనదేశంలో ఉన్న ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఇది కూడా ఒకటిగా నిలిచింది.

Read Also: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? అయితే వీటిని చెక్ చేయాల్సిందే!

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 25 Sep 2023 11:07 PM (IST) Tags: 2023 Hyundai i20 N Line 2023 Hyundai i20 N Line Price 2023 Hyundai i20 N Line Specifications 2023 Hyundai i20 N Line Features 2023 Hyundai i20 N Line Launched 2023 Hyundai i20 N Line Sale

ఇవి కూడా చూడండి

Toyota Urban SUV: టయోటా అర్బన్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ డిజైన్ ఇదే - లాంచ్ ఎప్పుడంటే?

Toyota Urban SUV: టయోటా అర్బన్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ డిజైన్ ఇదే - లాంచ్ ఎప్పుడంటే?

Hyundai Price Hike: 2024లో పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు - ఎందుకు పెరగనున్నాయి? ఎంత పెరగనున్నాయి?

Hyundai Price Hike: 2024లో పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు - ఎందుకు పెరగనున్నాయి? ఎంత పెరగనున్నాయి?

Best Cars Under Rs 8 Lakhs: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

Best Cars Under Rs 8 Lakhs: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

Bajaj Upcoming Bikes: చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త మోడల్, దేశంలోనే మొదటి సీఎన్‌జీ బైక్ - బజాజ్ సూపర్ ప్లాన్!

Bajaj Upcoming Bikes: చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త మోడల్, దేశంలోనే మొదటి సీఎన్‌జీ బైక్ - బజాజ్ సూపర్ ప్లాన్!

TVS iQube Sales: టీవీఎస్ బైకులకు పెరుగుతున్న డిమాండ్ - ఏకంగా 67 శాతం వరకు పెరిగిన అమ్మకాలు!

TVS iQube Sales: టీవీఎస్ బైకులకు పెరుగుతున్న డిమాండ్ - ఏకంగా 67 శాతం వరకు పెరిగిన అమ్మకాలు!

టాప్ స్టోరీస్

BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ

BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం
×