Used Car Buying Tips: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? అయితే వీటిని చెక్ చేయాల్సిందే!
Car Buying Tips: ఒకవేళ మీరు సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటే ఈ టిప్స్ కచ్చితంగా ఫాలో అవ్వండి.
కారు కొనడం అనేది మనలో చాలా మంది కల. కానీ కొన్నిసార్లు ఈ కల నెరవేరదు ఎందుకంటే కార్ల ధర ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ భరించలేరు. సెకండ్ హ్యాండ్ కార్లు కొనే వారు చాలా మంది ఉన్నారు. మీరు కూడా సెకండ్ హ్యాండ్ కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నిజానికి వాడిన కారును కొనుగోలు చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే ఇబ్బందుల్లో పడవచ్చు.
బడ్జెట్ ఫిక్స్ అవ్వండి
సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసే ముందు బడ్జెట్ ఫిక్స్ అవ్వండి. దీని తర్వాత మీరు ఎంచుకున్న కారు మార్కెట్ విలువ, రీసేల్ వ్యాల్యూ, డిమాండ్ గురించి సమాచారాన్ని తప్పనిసరిగా సేకరించాలి. అలాగే వేర్వేరు ప్లాట్‌ఫారమ్‌లలో ఒకే మోడల్‌కు చెందిన కార్ల రేట్లను తప్పకుండా చెక్ చేయండి. మీ నిర్ణీత బడ్జెట్ కంటే ఎక్కువ విలువైన కారును ఎప్పుడూ కొనుగోలు చేయకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి.
టెస్ట్ డ్రైవ్ చేయండి
మీరు ఏదైనా పాత కారును కొనుగోలు చేయబోతున్నట్లయితే దానికి ముందుగా కారును సుదీర్ఘంగా టెస్ట్ డ్రైవ్ చేయండి. ఈ సమయంలో వాహనంలో ఎటువంటి లోపం లేదని నిర్థారించుకోండి. వాహనం కదులుతున్నప్పుడు దాని ఇంజిన్‌తో సహా అన్ని ఇతర భాగాల శబ్దాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించండి. అలాగే ఈ కారు నడపడం ఎంత సౌకర్యంగా ఉంది దాని ఇంజిన్ పనితీరు ఏమిటి అనే దానిపై శ్రద్ధ వహించండి. వీలైతే అనుభవజ్ఞుడైన వ్యక్తిని కూడా వాహనం నడిపేటప్పుడు పక్కన కూర్చోపెట్టుకోండి.
జాగ్రత్తగా చెక్ చేసుకోండి
మీరు ఒక మంచి టెస్ట్ డ్రైవ్ తీసుకున్న తర్వాత కారు మార్కెట్ ధర, అమ్మే వ్యక్తి అడుగుతున్న ధర రెండింటినీ అంచనా వేయండి. డ్రైవింగ్ చేసేటప్పుడు కనిపించిన అన్ని లోపాలను పరిగణనలోకి తీసుకోండి. వాహనంలో ఏదైనా లోపం ఉంటే దానిని రిపేర్ చేయడానికి అయ్యే ఖర్చును ఖచ్చితంగా అంచనా వేయండి. దీని తర్వాత కారు సరైన ధరను నిర్ణయించండి.
ఖచ్చితంగా ఒక మెకానిక్ ద్వారా చెక్ చేయంచండి
ఇది కాకుండా కారును కొనుగోలు చేసే ముందు దానిని మంచి మెకానిక్ లేదా కంపెనీ సర్వీస్ సెంటర్‌లో చెక్ చేసుకోండి. తద్వారా మీరు తర్వాత సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. మెకానిక్ ద్వారా దాన్ని చెక్ చేసిన తర్వాత, మీరు ఇప్పటివరకు అర్థం చేసుకోలేకపోయిన లోపాల గురించి మీకు తెలుస్తుంది.
సర్వీస్ రికార్డును చెక్ చేయండి
చివరగా వాహనాన్ని తీసుకునే ముందు, దాని సర్వీస్ రికార్డ్‌ను చెక్ చేయండి. వాహనంలో ఎంత సర్వీస్ జరిగింది, ఏ భాగాలు మార్చారు అనే విషయాలను తెలుసుకోవడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. అలాగే వాహనం మీటర్ బ్యాకప్ చేయబడలేదని నిర్ధారించుకోండి. మీరు సర్వీస్ రికార్డులను సరిగ్గా పొందినట్లయితే వాహనాన్ని తీసుకోవచ్చు.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial