2022 Maruti Suzuki Wagon R Launch: రూ.5.5 లక్షల్లోపే కొత్త వాగన్ ఆర్ - 25 కిలోమీటర్లకు పైగా మైలేజ్ - లాంచ్ చేసిన మారుతి సుజుకి!
మారుతి సుజుకి తన కొత్త వాగన్ ఆర్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. ఇందులో మెరుగైన మైలేజ్, ఫీచర్లను అందించారు.
2022 Maruti Wagon R Facelift: మారుతి సుజుకి (Maruti Suzuki) తన కార్ల రేంజ్‌ను అప్‌డేట్ చేస్తూనే ఉంది. ఇటీవలే కొత్త బలెనో కారు మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త వాగన్ ఆర్ కూడా ఎంట్రీ ఇచ్చింది. స్టైలింగ్ పరంగా చూసుకుంటే... ఇందులో డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్స్ ఉన్నాయి. దీంతోపాటు కొత్త అలోయ్ వీల్స్, ఫ్లోటింగ్ రూఫ్ డిజైన్ అందించారు. కొత్త డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ డిజైన్ అందించారు. ఇందులో జెడ్+ వేరియంట్ కూడా ఉంది. దీంతోపాటు రెండు కొత్త కలర్ కాంబినేషన్లు కూడా వచ్చాయి. గల్లాంట్ రెడ్, మాగ్మా గ్రే రంగుల్లో ఈ కారు కొనేయచ్చు. ఈ రెండిట్లోనూ బ్లాక్ రూఫ్ అందించారు.
ఇందులో ఇంటీరియర్ కూడా కొత్తగా ఉంది. బీజ్, డార్క్ గ్రేలతో డ్యూయల్ టోన్ ఉన్న సీట్ ఫ్యాబ్రిక్ డిజైన్‌ను ఇందులో అందించారు. ఇక ఫీచర్ల విషయానికి వస్తే... కొత్త తరహా స్టాప్, స్టార్ట్ సిస్టంను అందించారు. ఏజీఎస్ వేరియంట్లలో హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా ఉంది.
ఇందులో 17.78 సెంటీమీటర్ల స్మార్ట్ ప్లే స్టూడియో ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టంను అందించారు. స్మార్ట్ ఫోన్ నేవిగేషన్ కూడా ఇందులో ఉంది. నాలుగు స్పీకర్ల ఆడియో సిస్టంను ఇందులో అందించారు. క్లౌడ్ బేస్డ్ సర్వీసులు కూడా ఇందులో ఉన్నాయి.
ఇక సేఫ్టీ విషయానికి వస్తే... ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టం, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఫ్రంట్ సీట్ బెల్ట్స్ రిమైండర్, హైస్పీడ్ అలెర్ట్ సిస్టం, వెనకవైపు పార్కింగ్ సెన్సార్లు కూడా ఉన్నాయి.
ఇందులో 1.0, 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్లను అందించారు. డ్యూయల్ జెట్ టెక్నాలజీ కూడా వీటిలో ఉంది. 1.0 లీటర్ ఏజీఎస్ వేరియంట్ లీటర్‌కు 25.19 కిలోమీటర్ల మైలేజ్‌ను, 1.2 లీటర్ ఏజీఎస్ వెర్షన్ మాత్రం 24.43 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తాయి. గతంలో ఉన్న వాగన్ ఆర్‌లతో పోలిస్తే... ఇది దాదాపు 20 శాతం ఎక్కువ.
ధర రూ.5.3 లక్షల నుంచి...
వీటిలో 1.0 లీటర్ మోడల్ ధర రూ.5.3 లక్షల నుంచి, 1.2 లీటర్ వేరియంట్ ధర రూ.5.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఈ కారుపై మారుతి సబ్‌స్క్రిప్షన్ రూ.12,300 నుంచి ప్రారంభం కానుంది. మారుతి పోర్ట్‌ఫోలియోలోని బెస్ట్ సెల్లింగ్ కార్లలో వాగన్ ఆర్ కూడా ఒకటి. ఇందులో సీఎన్‌జీ వేరియంట్‌ను ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు.
Also Read: Baleno Vs Swift: బలెనో వర్సెస్ స్విఫ్ట్ - బడ్జెట్ కార్లలో ఏది బెస్ట్!
Also Read: ఏకంగా మూడు కొత్త కార్లు లాంచ్ చేయనున్న జీప్ - అదిరిపోయే ఫీచర్లు - ధర కూడా తక్కువగానే!