![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Jeep Upcoming SUV: ఏకంగా మూడు కొత్త కార్లు లాంచ్ చేయనున్న జీప్ - అదిరిపోయే ఫీచర్లు - ధర కూడా తక్కువగానే!
జీప్ ఇండియా కొత్త ఎస్‌యూవీలు మనదేశంలో లాంచ్ చేయనుంది.
![Jeep Upcoming SUV: ఏకంగా మూడు కొత్త కార్లు లాంచ్ చేయనున్న జీప్ - అదిరిపోయే ఫీచర్లు - ధర కూడా తక్కువగానే! Jeep To Launch Three SUV Cars in India Soon Jeep Upcoming SUV: ఏకంగా మూడు కొత్త కార్లు లాంచ్ చేయనున్న జీప్ - అదిరిపోయే ఫీచర్లు - ధర కూడా తక్కువగానే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/26/70865370675976d356d2ac6b51ac3053_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Jeep Meredian: జీప్ ఇండియా (Jeep India) మనదేశంలో మూడు కొత్త ఎస్‌యూవీలు లాంచ్ చేయనుంది. కంపాస్ ట్రెయిల్‌హాక్ కూడా మళ్లీ మనదేశంలో తిరిగి లాంచ్ కానుంది. వీటిలో మెరీడియన్ అన్నిటికంటే చాలా ముఖ్యమైనది.ఇవన్నీ మూడు వరుస ఎస్‌యూవీ కార్లే కావడం విశేషం.
జీప్ (Jeep) తన కొత్త ఎస్‌యూవీ ఇమేజ్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఇందులో కంపెనీ చూపించిన కారు కొంచెం పెద్దగా ఉంది. కానీ జీప్ స్టైలింగ్‌లోనే ఉంది. దీంతోపాటు జీప్ మెరిడీయన్, గ్రాండ్ చెరోకిలను (Jeep Grand Cherokee) రన్‌జనగావ్ జాయింట్ వెంచర్ ఫెసిలిటీలో కంపెనీ రూపొందిస్తుందని తెలుస్తోంది.
మెరీడియన్‌ను దాదాపు 80 శాతానికి పైగా లోకలైజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. అంటే ధర కూడా తక్కువగా ఉండనుందని అనుకోవచ్చు. జీప్ మెరీడియన్ లాంచ్ అయ్యే ధర రేంజ‌్‌లో ముందువైపు, వెనకవైపు సస్పెన్షన్ ఉన్న మొదటి కారు ఇదేనని కంపెనీ తెలిపింది. ఇందులో 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉండనుందని తెలుస్తోంది. ఇదే ఇంజిన్ కంపాస్‌లో కూడా ఉన్నప్పటికీ... దాని కంటే శక్తివంతమైన ఇంజిన్ ఇందులో ఉండనుందని తెలుస్తోంది.
పెట్రోల్ ఇంజిన్‌లో కూడా రెండు వేరియంట్లు ఉండే అవకాశం ఉంది. మెరీడియన్ ప్రొడక్షన్ ఈ సంవత్సరం మే నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. లాంచ్ కాకుండా కొంచెం అటూఇటుగా ఆ సమయంలోనే ఉండే అవకాశం ఉంది.
వీటిలో ఇంకోటి మేడ్ ఇన్ ఇండియా జీప్ గ్రాండ్ చెరోకి అయ్యే అవకాశం ఉంది. ఉత్తర అమెరికా బయట పూర్తిగా మనదేశంలోనే అసెంబుల్ చేసి విక్రయించే వాహనంగా ఇది నిలవనుంది. గతంలో రాంగ్లర్‌ను కూడా ఇలానే రూపొందించారు. ఇది ఒక ఫ్లాగ్ షిప్ లగ్జరీ ఎస్‌యూవీ కారు. మనదేశంలో మోస్ట్ ప్రీమియం ఎస్‌యూవీగా కూడా ఇది ఉండనుంది.
ఇది ఒక 2.0 లీటర్ టర్బో పెట్రోల్ పవర్‌ట్రెయిన్ ఇంజిన్ ఉండనుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, క్వాడ్రా ట్రాక్ ఐ 4x4 సిస్టం ఇందులో ఉండనుంది. సెలక్-టెరెయన్ ట్రాక్షన్ మేనేజ్‌మెంట్ కూడా ఇందులో ఉంది. మొదటగా, జీప్ కంపాస్ ఎయిర్ హాక్ లాంచ్ కానుంది. ఇది ఒక ఆఫ్ రోడ్ ఫోకస్డ్ వెర్షన్.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)