By: ABP Desam | Updated at : 27 Feb 2022 07:39 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
మారుతి బలెనో వర్సెస్ స్విఫ్ట్ ఏఎంటీ
Maruti Baleno vs Swift AMT: బలెనో (2022 Maruti Baleno), స్విఫ్ట్ (Swift AMT) కార్ల మధ్య వైరం ఎప్పటి నుంచో ఉంది. వాటి బ్రాండ్ ఇమేజ్, సేల్స్ నంబర్స్ అలాంటివి. స్విఫ్ట్ అనేది ఎప్పటినుంచో ఉన్న ఐకానిక్ బ్రాండ్ కాగా... బలెనో దానికి టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. దీనికి సంబంధించిన కొత్త ఏఎంటీ వేరియంట్ కూడా మార్కెట్లో లాంచ్ అయింది. బలెనో ఏఎంటీ... బడ్జెట్ స్విఫ్ట్‌ల మధ్య ఉన్న తేడాలు ఏంటి? వీటిలో బెస్ట్ ఏది?
1. ఏది పెద్దది?
ఈ రెండు కార్లలో బలెనో సైజే పెద్దగా ఉంది. బలెనో పొడవు 3,990 మిల్లీమీటర్లు కాగా... స్విఫ్ట్ పొడవు 3,845 మిల్లీమీటర్లుగా ఉంది. వెడల్పు విషయంలో కూడా బలెనోనే పెద్దది. బలెనో వెడల్పు 1,745 మిల్లీమీటర్లు కాగా... స్విఫ్ట్ వెడల్పు 1,735 మిల్లీమీటర్లుగా ఉంది. బలెనోలో 16 అంగుళాల అలోయ్ వీల్స్ అందించగా... స్విఫ్ట్‌లో 15 అంగుళాల అలోయ్ వీల్స్ అందుబాటులో ఉన్నాయి.
2. ఎందులో మంచి ఫీచర్లు ఉన్నాయి?
ఈ విభాగంలో కూడా బలెనో ఎంతో సులభంగా విజయం సాధిస్తుంది. ఇందులో కొత్త ఇన్‌ఫొటెయిన్‌మెంట్ సిస్టం ఉన్న 9 అంగుళాల టచ్ స్క్రీన్‌ను అందించారు. దీంతోపాటు 360 డిగ్రీల కెమెరా, వెనకవైపు ఏసీ వెంట్లు, హెడ్స్ అప్ డిస్‌ప్లే, ఆరు ఎయిర్ బ్యాగ్స్, కనెక్టెడ్ టెక్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక స్విఫ్ట్‌లో కూడా బలెనోను మ్యాచ్ చేసేలా ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఆటో క్లైమెట్ కంట్రోల్, టచ్ స్క్రీన్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. స్విఫ్ట్‌లో పాత టచ్ స్క్రీన్ అందుబాటులో ఉంది. వెనకవైపు ఏసీ వెంట్లు కూడా అందించలేదు.
3. దేని పవర్ ఎక్కువగా ఉంది?
ఈ రెండు కార్లలోనూ డ్యూయల్ జెట్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. దీని పవర్ 90 హెచ్‌పీగా ఉంది. రెండు కార్లలోనూ ఒకే తరహా ప్లాట్‌ఫాంను అందించారు. వీటిలో 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అందించారు. దీంతోపాటు 5-స్పీడ్ ఏఎంటీ వేరియంట్ కూడా ఉంది. ఈ రెండు కార్లలోనూ స్విఫ్ట్ బరువే తక్కువ అయినప్పటికీ... దాని పెర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంది.
4. దేని మైలేజ్ ఎక్కువ?
మైలేజ్ విషయానికి వస్తే... రెండిట్లో ఒకదాన్ని ఎంపిక చేయడం చాలా కష్టం. స్విఫ్ట్ బరువు తక్కువగా ఉండటం కారణంగా ఇందులో ఏఎంటీ వేరియంట్ లీటరుకు 23.76 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. ఇక బలెనో ఏఎంటీ వేరియంట్ లీటరుకు 22.94 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. ఈ రెండు కార్ల మైలేజ్ అద్భుతంగా ఉంది.
5. ఏది కొనాలి?
వీటిలో మారుతి స్విఫ్ట్ ధర రూ.5.9 లక్షల నుంచి రూ.8.77 లక్షల మధ్యలో ఉంది. ఇక బలెనో రేంజ్ మాత్రం రూ.6.3 లక్షల నుంచి రూ.9.4 లక్షల మధ్యలో ఉంది. వీటిలో స్విఫ్ట్ చవకైనది అలాగే మెరుగైన పెర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. ఇక బలెనోలో స్పేస్ ఎక్కువగా ఉంది. అలాగే ఇందులో లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఈ రెండిటి మధ్య ధర తేడా కూడా ఎక్కువ లేదు కాబట్టి... బలెనో ఏఎంటీ వేరియంట్ కొనుగోలు చేయడం బెస్ట్.
Best Cars Under Rs 8 Lakhs: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!
Bajaj Upcoming Bikes: చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త మోడల్, దేశంలోనే మొదటి సీఎన్జీ బైక్ - బజాజ్ సూపర్ ప్లాన్!
TVS iQube Sales: టీవీఎస్ బైకులకు పెరుగుతున్న డిమాండ్ - ఏకంగా 67 శాతం వరకు పెరిగిన అమ్మకాలు!
Upcoming SUVs in 2024: 2024లో కారు కొనాలనుకుంటున్నారా? - ఈ నాలుగు ఎస్‌యూవీలు ఎంట్రీ ఇస్తున్నాయి - ఒక్కసారి చూడండి!
New Kia Sonet Facelift: మరికొద్ది రోజుల్లో కొత్త కియా సోనెట్ - డిజైన్‌లో భారీ మార్పులు!
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
/body>