అన్వేషించండి

2022 హ్యుందాయ్ Venue N Line ఫస్ట్ లుక్ రిలీజ్, స్పెసిఫికేషన్లు మీకోసం

హ్యుందాయ్ వెన్యూ N లైన్ రేంజిలో తొలి SUV వచ్చేసింది. ఈ కారు i20 N లైన్ మాదిరిగానే స్పోర్టియర్ వెర్షన్ గా కంపెనీ వెల్లడించింది.

హ్యుందాయ్ కంపెనీ మరో లేటెస్ట్ కారును అందుబాటులోకి తీసుకురాబోతుంది. Venue N Line పేరుతో ఈ కారును మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది. తాజాగా ఈ కారు స్పెసిఫికేషన్లను రివీల్ చేసింది. వెన్యూ N లైన్ శ్రేణిలో తొలి SUVగా కంపెనీ వెల్లడించింది. ఈ లేటెస్ట్ కారు i20 N లైన్ మాదిరిగానే స్పోర్టియర్ వెర్షన్ గా తెలిపింది. ఈ కారుకు అదనపు హంగులు అద్దినట్లు చెప్పింది. కారుకు సంబంధించి బయట, లోపల పలు మార్పులు చేసినట్లు వెల్లడించింది.   

తాజా కారులో కంపెనీ ఏ మార్పులు చేసిందో ఓసారి పరిశీలిద్దాం. N లైన్ ఆల్‌ రౌండ్ డిస్క్ బ్రేక్‌ లు, డ్యుయల్ కెమెరాతో కూడిన డాష్‌ క్యామ్, కొత్త డార్క్ క్రోమ్ గ్రిల్, టెయిల్‌ గేట్ స్పాయిలర్, N లైన్ లోగోలు, రెడ్ ఎక్స్ టీరియర్,  ఫ్రంట్ రెడ్ బ్రేక్ కాలిపర్‌ లు, బ్లాక్ ఇంటీరియర్, N లైన్ ఎక్స్ క్లూసివ్ 16-అంగుళాల  డైమండ్ కట్స్ సహా పలు మార్పులు చేసినట్లు కంపెనీ తెలిపింది.

ఆసక్తికరంగా Venue N Line కేవలం 88.3 kW (120 PS) గరిష్ట శక్తి, 172 Nm  టార్క్‌తో 1.0l టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. DCT డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ను కలిగి ఉంటుంది. i20 N లైన్ మాదిరిగా, ఇంజిన్ స్పోర్టియర్ ఎగ్జాస్ట్ నోట్‌ కలిగి ఉంటుంది. DCT స్టాండర్డ్ వెన్యూలో కూడా అందుబాటులో ఉండే Venue N Line డ్రైవ్ మోడ్‌లను అందిస్తుంది.

Venue N Line వచ్చే నెల 6న  ప్రస్తుత వెన్యూ కంటే కొంచెం ప్రీమియంతో  లాంచ్ చేయబడుతుంది. ప్రస్తుతం SUVల యొక్క నిర్దిష్ట పనితీరు-ఆధారిత వెర్షన్‌లు ఏవీ లేని కారణంగా.. ఈ కారుకు పోటీగా మరే కారు అందుబాటులోకి రావడం లేదు. ఇప్పటికే N లైన్ శ్రేణిలో i20 N లైన్‌ ను  భారత మార్కెట్లోకి విడుదల చేసింది. అదే  విభాగంలో ఇండియాలో రిలీజ్ కాబోతున్న హ్యాచ్‌ బ్యాక్ అయినందున  కార్ల ప్రియులను ఆకట్టుకునే అవకాశం ఉంది.  ఈ కారుతో భారత మార్కెట్లో మరోసారి సత్తా చాటుకునేందుకు హ్యుందాయ్ ప్రయత్నిస్తోంది.

అటు సెప్టెంబర్ 6న Venue N Line ధరలను విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. రోబ్లాక్స్ లో అందుబాటులో  ఉన్న హ్యుందాయ్ మొబిలిటీ అడ్వెంచర్ అనుభవంతో  మెటావర్స్‌ లో కొత్త N లైన్ మోడల్‌ను పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. మొబైల్ ఫోన్‌ లు,  ల్యాప్‌ టాప్‌ లలో ప్లే స్టోర్ ద్వారా రోబ్లాక్స్ యాప్‌ ను డౌన్‌ లోడ్ చేసుకోవడం ద్వారా కస్టమర్లు కొత్త Venue N Line లాంచ్‌ ను చూడగలుగుతారని వెల్లడించింది. 

Also Read: మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం ఉండాలంటే ఈ 10 టిప్స్ ఫాలో అవ్వండి!

వర్చువల్ లాంచ్ అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుందని తెలిపింది. Metaverse లాంచ్ ఈవెంట్ ఇండియా జోన్, టెస్ట్ డ్రైవ్ ట్రాక్, VENUE N లైన్ జోన్, వర్చువల్ షోరూమ్, సర్వీస్ సెంటర్, మినీ గేమ్, N లైన్ మర్చండైజ్ సహా అనేక వినూత్న అనుభవాలను కలిగి ఉంటుంది. వినియోగదారులు ఓవల్ రోడ్ ట్రాక్ చుట్టూ Venue N Line టెస్ట్ డ్రైవ్‌ను వర్చువల్‌ గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు మీరు కాస్త టెక్నాలజీ మీద అవగాహన ఉంటే చాలు. మీరు ఇంటి నుంచే ఆ అనుభూతిని పొందవచ్చు. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు మరో వారంలోనే కస్టమర్లకు కంపెనీ వెల్లడించనుంది.

Also Read: మీ ఆండ్రాయిడ్ ఫోన్ మళ్లీ కొత్తదానిలా పని చేయాలా? ఈ 5 టిప్స్ పాటించండి

టాప్ హెడ్ లైన్స్

Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget