మీ ఆండ్రాయిడ్ ఫోన్ మళ్లీ కొత్తదానిలా పని చేయాలా? ఈ 5 టిప్స్ పాటించండి
మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? ఆ ఫోన్ తరచూ ఇబ్బంది పెడుతుందా? అయితే, ఈ టిప్స్ ఫాలోకండి.. మళ్లీ కొత్త ఫోన్ లాంటి పని తీరును పొందండి..
ప్రస్తుతం జనాలు అత్యంత ఎక్కువ ఇష్టపడే వస్తువు ఏదైనా ఉందంటే అది మోబైల్ మాత్రమే. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లు తక్కువ ధరలో మంచి ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్నాయి. అయితే, ఎంత కొత్త ఫోన్ అయినా.. కొద్ది రోజుల తర్వాత రకరకాల సమస్యలతో వేధిస్తుంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇంకాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అయితే, మీ పాత ఆండ్రాయిడ్ ఫోన్ మళ్లీ కొత్తదానిలా పని చేయాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అవేంటో చూద్దామా!
సాధారణంగా ఫోన్ ఎప్పుడూ మన చేతిలో ఉంటుంది. ముఖానికి దగ్గరగా పెట్టుకుని చూస్తుంటాం. అందుకే ఫోన్ చాలా అందంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటాం. మంచి ఫౌచ్ వేయిస్తాం. చక్కటి స్క్రీన్ ప్రొటెక్టర్ వాడతాం, దుమ్ము పట్టకుండా శుభ్రం చేస్తుంటాం. బయటి వరకు ఓకే.. మరి ఫోన్ లోపల నిండిపోయిన చెత్త మాట ఏంటి? అవును.. బయట మాత్రమే కాదు.. ఫోన్ లోపల ఉన్న అనవసర అంశాలను తొలగిస్తేనే.. ఫోన్ చక్కగా పని చేస్తుంది. తన జీవితకాలాన్ని కూడా పెంచుకుంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్ మళ్లీ కొత్తదానిలా పనిచేయాలంటే ఈ క్రింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
అనవసర యాప్స్ అన్నీ డెలిట్ చేయండి
మీ ఫోన్ లో ఉన్న యాప్స్ అన్నింటినీ ఓసారి గమనించండి. వాటిలో మీరు ఉపయోగించని, లేదంటే అవసరం లేని యాప్స్ ను తొలగించండి. ఇలా చేయడం మూలంగా స్టోరేజ్ పెరగడమే కాకుండా ఫోన్ పనితీరు మెరుగుపడుతుంది. అందుకే ఎప్పటికప్పుడు ఫోన్ లోని అనవసర యాప్స్ ను డెలిట్ చేస్తూ ఉండాలి.
అనవసర పాత ఫైల్స్ తొలగించాలి
పనికిరాని యాప్‌లను తీసివేసిన తర్వాత.. మీ Android ఫోన్‌లో సేవ్ చేసిన అనవసరపు ఫైల్స్ ను తొలగించండి. మీరు డౌన్ లోడ్ చేసిన పైల్స్ ను మర్చిపోవడం ద్వారా పెద్ద మొత్తంలో స్టోరేజ్ వేస్ట్ అవుతుంది. అందుకే ఎప్పటికప్పుడు అనవసర ఫైల్స్ డెలిట్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం మూలంగా ఫోన్ లో స్పేస్ పెరిగి ఫోన్ స్మూత్ గా రన్ అవుతుంది.
హోమ్ స్క్రీన్ సెట్టింగ్లను మార్చండి
మీ ఫోన్ హోమ్ స్క్రీన్ ను బట్టే ఆఫోన్ ఎలా ఉందో చెప్పవచ్చు. అందుకే చూడగానే ఆకట్టుకునేలా హోమ్ స్క్రీన్ ను రూపొందించుకోవాలి. యాప్ గ్రిడ్ సైజ్ లాంటి సెట్టింగ్‌లు మార్చుకోవాలి. 4x5 యాప్‌ల గ్రిడ్ నుంచి 5x5కి వెళ్లడం చిన్న మార్పులా అనిపించవచ్చు, కానీ చాలా అందంగా కనిపిస్తుంది. స్క్రీన్ మీదే నోటిఫికేషన్ చూసేలా సెట్ చేసుకుంటే.. ప్రతీసారి యాప్స్ లోకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఫోన్ మీద కూడా ఎక్కువ ఒత్తిడి పడదు.
మీ ఫోన్ సెట్టింగ్లను ఆప్టిమైజ్ చేయండి
మీ ఫోన్ సెట్టింగులను ఎప్పటికప్పుడు ఆప్టిమైజ్ చేస్తూ ఉండాలి. ఉదాహరణకు డార్క్ మోడ్ ను ఆన్ చేయడం వల్ల యాప్ మెరుగ్గా కనిపించడమే కాకుండా, బ్యాటరీని ఆదా చేస్తుంది.
మీ ప్రైవసీ ఆప్షన్లను కస్టమైజ్ చేసుకోండి
మీరు ఫ్రీగా ఉన్న సమయంలో ప్రైవసీ సెట్టింగులను చూస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు వాటిని కస్టమైజ్ చేసుకోవాలి. అలా చేసుకోవడం మూలంగా అనవరమైన యాక్సెస్ లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఐదు టిప్స్ ఫాలో అయితే మళ్లీ మీ ఆడ్రాయిడ్ ఫోన్ కొత్తదాని మాదిరిగా పనిచేస్తుంది.
Also Read: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!