News
News
X

Phone Battery: మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం ఉండాలంటే ఈ 10 టిప్స్ ఫాలో అవ్వండి!

మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ 10 టిప్స్ ఫాలో అయితే చాలు..

FOLLOW US: 

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ కామన్ గా కనిపిస్తుంది. ఇంట్లో ఏ వస్తువు ఉన్నా? లేకున్నా? ఫోన్ మాత్రం కచ్చితంగా ఉంటుంది. జనాల అభిరుచికి అనుగుణంగా రోజు రోజుకు సరికొత్త సెల్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఎంత లేటెస్ట్ ఫోన్ అయినా.. కొద్ది రోజులు వాడాక రకరకాల సమస్యలు వస్తాయి. అందులో ప్రధానమైనది బ్యాటరీ. ప్రస్తుతం ఫోన్లతో పాటు ల్యాప్ టాప్ లు, టాబ్లెట్లలో లిథియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తున్నారు. ఈ బ్యాటరీలో చాలా ప్రయోజనాలను కలిగిస్తాయి. కానీ కొద్ది రోజులు వాడాక సమస్యలను కలిగిస్తాయి. నెమ్మదిగా ఆయా బ్యాటరీలు లైఫ్ కోల్పోతాయి. కొద్దిసేపటికే చార్జింగ్ అయిపోతుంది.  అయితే మన ఫోన్ బ్యాటరీని సాధ్యమైనంత ఎక్కువ కాలం ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మీ బ్యాటరీ 0%-  100%కి వెళ్లకుండా ఉంచండి

చాలా మంది తమ బ్యాటరీలను స్విచ్ ఆఫ్ అయ్యేవరకు వాడుతారు. లేదంటే 100% అయ్యే వరకు ఛార్జింగ్ పెడుతారు. ఇలా చేయడం వల్ల బ్యాటరీ చాలా ఒత్తిడికి గురవుతుంది. 60%తో పోలిస్తే మీ బ్యాటరీని పూర్తిగా 100% ఛార్జ్ చేయడం వలన  బ్యాటరీ జీవితకాలం సగానికి తగ్గుతుంది. బ్యాటరీ బాగా పని చేయాలి అంటే  80% వరకు ఛార్జ్ చేయాలి.  30% కంటే తక్కువగా పడిపోకుండా చూసుకోవాలి.   

రాత్రి పూట ఛార్జింగ్ పెట్టి మర్చిపోకండి   

రాత్రి పూట మీ ఫోన్ ను ఛార్జింగ్ పెట్టి మర్చిపోకండి. అలా చేయడం మూలంగా మీ బ్యాటరీ అధిక వోల్టేజ్ నుండి అధిక ఒత్తిడిని ఎదుర్కొంటుంది. అధిక వేడికి గురవుతుంది. దీంతో బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది. అందుకే రాత్రిపూట ఛార్జింగ్ పెట్టినా.. వెంటిలేషన్ ఉన్న ప్రదేశాల్లో పెట్టాలి. అలా చేయడం వల్ల ఫోన్ త్వరగా వేడి కాదు.   

నెమ్మదిగా ఛార్జ్ చేయండి

బ్యాటరీని నెమ్మదిగా ఛార్జ్ చేయడం మంచిది. అందుకని, మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా మీ ఫోన్‌ను ఛార్జ్ చేయడం మూలంగా లాభం కలుగుతుంది.   

మీరు WiFi, బ్లూటూత్‌ ఆఫ్ చేయండి

నెట్‌వర్క్‌లు, ఇతర  పరికరాలకు కనెక్ట్ కావడం వల్ల ఛార్జింగ్ తగ్గిపోతుంది.  అందుకే మీ ఫోన్ WiFi లేదా బ్లూటూత్ వాడనప్పుడు ఆఫ్ చేయడం మంచింది.     

లొకేషన్ సర్వీస్ ను మేనేజ్ చేయండి  

ఈ రోజుల్లో చాలా యాప్‌లు మీ ఫోన్ లొకేషన్ ను ట్రాక్ చేస్తాయి. అలా చేయడం వల్ల ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది. అందుకే అవసరం లేని సమయంలో లొకేషన్ ఆఫ్ చేయాలి. లేదంటే   బ్యాక్‌గ్రౌండ్‌లో లొకేషన్ సర్వీస్‌లను ఉపయోగించకుండా యాప్‌లను బ్లాక్ చేయాలి.   

అసిస్టెంట్ ను ఆఫ్ చేయండి 

Google Assistant, Siri వంటి ఫీచర్‌లు  నిజంగా ఉపయోగకరం. కానీ బ్యాటరీని ఎక్కువగా తీసుకుంటాయి. అందుకే వాయిస్ కమాండ్ ఫంక్షన్‌ని డిజేబుల్ చేయడం ఉత్తమం.

మీ యాప్‌లను మేనేజ్ చేయండి

ఫోన్ వాడకపోయినా.. చాలా యాప్స్ బ్యాగ్రౌండ్ లో రన్ అవుతాయి.  మీ యాప్‌లను ఫోర్స్-క్విట్ చేయడం వల్ల మీ బ్యాటరీ లైఫ్ ఏ మాత్రం మెరుగుపడదు. అంతేకాదు.. బ్యాటరీ సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే యాప్స్ ను చూడకుండా ఉంటే సరిపోతుంది.    

బ్రైట్ నెస్ తగ్గించండి

స్క్రీన్ బ్రైట్‌నెస్ అనేది మీ ఫోన్ బ్యాటరీని బాగా దెబ్బతీస్తుంది. మీరు బ్యాటరీ పవర్ ను ఆదా చేయాలనుకుంటే..  దాని బ్రైట్ నెస్ తగ్గించాలి. అవసరం అయితేనే పెంచాలి.   

స్మార్ట్ బ్యాటరీ మోడ్‌లను ఉపయోగించండి

ప్రస్తుతం వస్తున్న చాలా ఫోన్లు స్మార్ట్ బ్యాటరీ సేవర్ లేదంటే తక్కువ పవర్ మోడ్‌తో వస్తున్నాయి.    CPU వినియోగం, నోటిఫికేషన్‌లు, మెయిల్ పొందడం, స్క్రీన్ బ్రైట్‌నెస్ లాంటి బ్యాటరీ ఎక్కువగా తీసుకునే పనులను స్వయంగా నియంత్రిస్తాయి.  మీ ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ఈ పవర్ సేవింగ్ మోడ్‌లు ఆటోమేటిక్‌గా కిక్ అవుతాయి. మీకు కావలసినప్పుడు వాటిని మాన్యువల్‌గా అన్ చేసుకోవచ్చు.   

డార్క్ మోడ్‌ను  వాడండి..

మీరు లేటెస్ట్ ఫోన్లు కలిగి ఉంటే డార్క్ మోడ్‌కి మారడం ద్వారా మీ బ్యాటరీ డ్రెయిన్‌ను తగ్గించుకోవచ్చు.  డార్క్ మోడ్‌లో దాదాపు 60% బ్యాటరీ పొదుపు చేసుకునే అవకాశం ఉంది.  

Published at : 25 Aug 2022 03:01 PM (IST) Tags: phone Phone battery Battery tips

సంబంధిత కథనాలు

Oneplus Nord Watch: రూ.ఐదు వేలలోపే వన్‌ప్లస్ వాచ్ - ఏకంగా 105 స్పోర్ట్స్ మోడ్స్ కూడా!

Oneplus Nord Watch: రూ.ఐదు వేలలోపే వన్‌ప్లస్ వాచ్ - ఏకంగా 105 స్పోర్ట్స్ మోడ్స్ కూడా!

Samsung Galaxy S24: శాంసంగ్ గెలాక్సీ ఎస్24లో సూపర్ ఫీచర్ - సెకనుకు 30 జీబీ ఇంటర్నెట్ స్పీడ్!

Samsung Galaxy S24: శాంసంగ్ గెలాక్సీ ఎస్24లో సూపర్ ఫీచర్ - సెకనుకు 30 జీబీ ఇంటర్నెట్ స్పీడ్!

Redmi Note 11 Pro 2023: త్వరలో రెడ్‌మీ నోట్ 11 2023 సిరీస్ లాంచ్ - ఓఎస్ డిటైల్స్ లీక్!

Redmi Note 11 Pro 2023: త్వరలో రెడ్‌మీ నోట్ 11 2023 సిరీస్ లాంచ్ - ఓఎస్ డిటైల్స్ లీక్!

WhatsApp document caption: అందుబాటులోకి నయా వాట్సాప్ ఫీచర్, ఇక డాక్యుమెంట్లను క్యాప్షన్‌తో షేర్ చేసుకోవచ్చు!

WhatsApp document caption: అందుబాటులోకి నయా వాట్సాప్ ఫీచర్, ఇక డాక్యుమెంట్లను క్యాప్షన్‌తో షేర్ చేసుకోవచ్చు!

Apple Watch: పేలిన ఆపిల్‌ వాచ్‌- విషయాన్ని బయటకు చెప్పొద్దని వినియోగదారునికి కంపెనీ రిక్వస్ట్‌

Apple Watch: పేలిన ఆపిల్‌ వాచ్‌- విషయాన్ని బయటకు చెప్పొద్దని వినియోగదారునికి కంపెనీ రిక్వస్ట్‌

టాప్ స్టోరీస్

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల