News
News
X

Hyundai Tucson SUV Price: హ్యుండాయ్ టక్సన్ ధర రివీల్ చేసిన కంపెనీ - మొదటిసారి ఆ ఫీచర్‌తో!

హ్యుండాయ్ కొత్త టక్సన్ కారు ధరను కంపెనీ రివీల్ చేసింది.

FOLLOW US: 

హ్యుండాయ్ తన నాలుగో తరం టక్సన్ ఎస్‌యూవీ ధరను రివీల్ చేసింది. రెండు ట్రిమ్ లెవల్స్‌లో ఈ కారు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. వీటిలో బేస్ మోడల్ అయిన ప్లాటినం ట్రిమ్ ధర రూ.27.69 లక్షల నుంచి ప్రారంభం కానుంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన సిగ్నేచర్ ట్రిమ్ మోడల్ ధర తెలియరాలేదు. దీనికి సంబంధించిన బుకింగ్స్ గత నెల జులై 19వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి.

ముందు వెర్షన్ కంటే మెరుగైన ఫీచర్లతో ఈ కారును కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో లెవల్ 2 ఏడీఏస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టం) సహా మొత్తం 60కి పైగా కనెక్టివిటీ ఫీచర్లను కంపెనీ అందించింది. ఈ కారుకు ప్రధాన ఆకర్షణ ఇవే.

హ్యుండాయ్ కొత్త టక్సన్ కారును కంపెనీ మనదేశంలో గత నెలలోనే రివీల్ చేసింది. అయితే అప్పుడు ధరను ప్రకటించలేదు. క్రెటా, అల్కజార్‌లను మించే స్థాయిలో ఫ్లాగ్ షిప్ ఫీచర్లతో ఈ కారు మార్కెట్లో లాంచ్ కానుంది. మనదేశంలో హ్యుండాయ్ విక్రయించే వెర్షన్‌లో పెద్ద వీల్ బేస్‌ను అందించనున్నారు.

ఈ టక్సన్ కొత్త తరం డిజైన్‌తో రానుంది. ఈ మోడల్‌లో 18 అంగుళాల అలోయ్ వీల్స్‌ను కూడా కంపెనీ అందించింది. 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కొత్త టక్సన్‌లో ఉంది. కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఎన్నో లేటెస్ట్ ఫీచర్లు ఇందులో అందించారు..

పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్ టోన్ క్లైమెట్ కంట్రోల్, ఫుల్లీ డిజిటల్ డయల్స్, 360 డిగ్రీ కెమెరా, బోస్ ఆడియో సిస్టం, రెండో వరుస సీట్లకు రిక్లెయినర్ లాంటి టాప్ క్లాస్ ఫీచర్లను హ్యుండాయ్ లేటెస్ట్ ఎస్‌యూవీలో చూడవచ్చు.

ఏడీఏఎస్ లెవల్ 3 ఫీచర్లు ఉన్న మొట్టమొదటి హ్యుండాయ్ కారు ఇదే. ఇక ఇంజిన్ ఆప్షన్ల విషయానికి వస్తే... కొత్త హ్యుండాయ్ టక్సన్ ఎస్‌యూవీలో 2.0 లీటర్ డీజిల్, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్లు ఉండనున్నాయి. ఈ రెండు ఇంజిన్లలోనూ ఆటోమేటిక్ గేర్ బాక్స్ వెర్షన్లే ఉండనున్నాయి. ఏడబ్ల్యూడీ/టెర్రెయిన్ మోడ్స్ కూడా అందించనున్నారు.

ఈ కారు అంతర్జాతీయ మార్కెట్లో 2020 సెప్టెంబర్‌లో లాంచ్ చేసింది. టక్సన్ ప్రపంచవ్యాప్తంగా హ్యుండాయ్ బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. అయితే మనదేశంలో మాత్రం టక్సన్ ఊహించిన సక్సెస్ కాలేదు. మరి ఈ కొత్త వెర్షన్ అయినా సక్సెస్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

View this post on Instagram
 
A post shared by Hyundai India (@hyundaiindia)

Published at : 10 Aug 2022 06:02 PM (IST) Tags: Hyundai Tucson SUV 2022 Hyundai Tucson SUV 2022 Hyundai Tucson Hyundai Tucson 2022 2022 Hyundai Tucson SUV Price in India 2022 Hyundai Tucson SUV Ex Showroom Price

సంబంధిత కథనాలు

Skoda Octavia: స్కోడా ఎలక్ట్రిక్ కారు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లిపోవచ్చు!

Skoda Octavia: స్కోడా ఎలక్ట్రిక్ కారు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లిపోవచ్చు!

Hero E-scooter: హీరో నుంచి ఎట్టకేలకు ఇ-స్కూటర్, విడుదల ఎప్పుడంటే?

Hero E-scooter: హీరో నుంచి ఎట్టకేలకు ఇ-స్కూటర్, విడుదల ఎప్పుడంటే?

Electric SUV Space: ఎలక్ట్రిక్‌ SUVల కోసం ₹4 వేల కోట్ల ప్లాన్‌లో మహీంద్ర

Electric SUV Space: ఎలక్ట్రిక్‌ SUVల కోసం ₹4 వేల కోట్ల ప్లాన్‌లో మహీంద్ర

Airplane Mode: విమానంలో ఫోన్లను ‘ఫ్లైట్ మోడ్’లో పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

Airplane Mode: విమానంలో ఫోన్లను ‘ఫ్లైట్ మోడ్’లో పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

Tata Punch Camo Edition: టాటా పంచ్‌లో కొత్త వెర్షన్ - సూపర్ అనిపించే లుక్!

Tata Punch Camo Edition: టాటా పంచ్‌లో కొత్త వెర్షన్ - సూపర్ అనిపించే లుక్!

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల