News
News
వీడియోలు ఆటలు
X

2023 Panchangam in Telugu: ఈ రాశులవారికి సంపాదన కన్నా ఖర్చులెక్కువ

నోట్: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

2023 Ugadi Panchangam in Telugu: తెలుగు సంవత్సరాది ఉగాది రాగానే రాశి ఫలితాలు కన్నా ముందుగా ఆదాయ-వ్యయాలు చూసుకుంటారు.  ఎంత సంపాదిస్తాం, ఎంత ఖర్చుచేస్తాం అని లెక్కలేసుకుంటారు. వీటిని నమ్మేవారు శ్రద్ధగా చూసుకుంటే ఇంకొందరు సరదాగా ఆదాయ-వ్యయాలు తెలుసుకుంటారు. శోభకృత్ నామ సంవత్సరంలో ఆదాయ-వ్యయాలు మొత్తం పరిశీలిస్తే ఈ రాశులవారికి సంపాదన కన్నా వ్యయం ఎక్కువగా ఉంది.  

మిథున రాశి
(మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు )
ఆదాయం : 2 వ్యయం : 11 రాజ్యపూజ్యం : 2 అవమానం : 4

శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మిథున రాశివారికి ఆదాయం రెండొంతులుంటే ఖర్చులు 11వంతులు ఉంది.. అంటే 2 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చుచేస్తారని అర్థం. సంపాదన కన్నా ఖర్చు ఎక్కువ. వాస్తవానికి మిథునరాశివారికి గడిచిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బావుంది. శని ప్రభావం తొలగిపోయి గురుడు బలంగా ఉన్నందున ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఆర్థికంగా పుంజుకుంటారు, స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. శని, రాహు బలంవల్ల వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆదాయం పెరుగుతున్నప్పుడు వ్యయం ఎక్కువ ఉందని అంటారేమో..ఆస్తుల కొనుగోలు కూడా ప్రస్తుతానికి వ్యయమే కదా..అలా మంచి మార్గంలో పెరిగే ఖర్చులన్నమాట.

Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి అష్టమంలో గురుడు ఆరోగ్యంపై దెబ్బకొడతాడు, ఏ రంగం వారికీ శుభఫలితాలు లేవు!

కన్యా రాశి
ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆదాయం : 2 వ్యయం : 11 రాజ్యపూజ్యం : 4 అవమానం : 7

కన్యారాశివారికి కూడా సేమ్ టు సేమ్.. రెండు రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చుచేస్తారు. అయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కన్యారాశివారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. శని సంచారం శుభాన్నివ్వడంతో ఆర్థికంగా బాగానే ఉంటుంది..కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది కానీ...అష్టమంలో ఉన్న గురుడు సంచారం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఓ దశలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. సంఘంలో గౌరవం, పేరు ప్రఖ్యాతులకు లోటుండదు

ధనస్సు రాశి
మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదాలు, ఉత్తరాషాడ 1వ పాదం 
ఆదాయం : 8 వ్యయం :11 రాజ్యపూజ్యం : 6 అవమానం : 3

శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో అన్నిటికన్నా అద్భుతంగా ఉన్న రాశి ధనస్సు. శని,దేవతల గురువు బృహస్పతి, శని ఇద్దరూ శుభ స్థానంలోనే ఉన్నారు. ఈ ఫలితంగా గతంలో పడిన బాధలు, ఇబ్బందులు, చికాకులు తొలగిపోయి సంపూర్ణంగా శుభ ఫలితాలు పొందుతారు.మరి ఈ రాశివారికి కూడా ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ ఉంది ఎందుకు అని క్వశ్చన్ చేస్తే.. బావుండండ అంటే ఆదాయం మాత్రమే కాదు కదా.. ప్రశాంతత, సంతోషం, మనశ్సాంతి...తలపెట్టిన పనుల్లో విజయం. ఆస్తులు వృద్ధి చేస్తే ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ అవుతున్నట్టే అని కూడా గుర్తుంచుకోవాలి. 

మీన రాశి
పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
ఆదాయం : 8 వ్యయం : 11 రాజ్యపూజ్యం :1 అవమానం : 2

మీన రాశివారికి ఈ ఏడాది నుంచి ఏలినాటి శని ప్రారంభమవుతోంది. గురుబలం ఉన్నందున ఆదాయానికి లోటుండదు కానీ ఖర్చులు మాత్రం అంతకుమించి ఉంటాయి. అనుకున్న పనులు ఏవీ పూర్తికావు..ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు, ఆందోళన కలిగించే సంఘటనలు జరుగుతాయి. సహనం కోల్పోకుండా మీ ప్రయత్నం మీరు చేస్తారు.

మేష రాశి 
( అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం )
ఆదాయం: 5 , వ్యయం:5  , రాజపూజ్యం:3  , అవమానం:1

మేష రాశివారికి ఈ ఏడాది ఆదాయం-వ్యయం రెండూ సమానంగా ఉన్నాయి. అంటే సంపాదించినది అలా సరిపోతుంది. ఆస్తి ఉండదు అప్పు ఉండదు... ఆర్థిక లాభం లేదు డబ్బు పరంగా ఇబ్బందులు ఉండవని అర్థం. ఈ ఏడాది గ్రహస్థితి పరంగా చూస్తే.. గురుడు, శని రెండు గ్రహాలూ శుభస్థానంలోనే ఉన్నాయి. జన్మంలో రాహుకేతువుల ప్రభావం వల్ల తలపెట్టిన పనుల్లో ఆటంకాలుంటాయి కానీ పూర్తవుతాయి. ఓవరాల్ గా వీరి గ్రహస్థితిబావుంది.

Also Read: ఈ రాశివారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఆరంభం అంతంతమాత్రం - ద్వితీయార్థం సరిలేరు మీకెవ్వరు!

వృశ్చిక రాశి
విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదాలు 
ఆదాయం : 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 3 అవమానం : 3

వృశ్చిక రాశివారికి కూడా సేమ్ టు సేమ్... ఆదాయం-వ్యయం రెండూ సమానంగా ఉంటాయి. సంపాదన అవసరాలు తీరుస్తుంది. ఓవరాల్ గా చెప్పుకుంటే వృశ్చికరాశివారికి ఈ ఏడాది బాగానే ఉంది. అర్థాష్టమ శని కారణంగా ఏడాది ఆరంభంలో అంతంతమాత్రంగా ఉన్నా రానురాను పరిస్థితి మెరుగుపడుతుంది. గురు బలం మీకు అన్నింటా అనుకూల ఫలితాలనిస్తుంది. 

నోట్: పండితుల సూచనలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన విషయాలివి...ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. వీటిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం

Published at : 24 Mar 2023 07:17 AM (IST) Tags: Sri Sobhakritu Nama Samvatsaram Ugadi Panchangam in Telugu 2023-2024 yearly horoscope for all zodiac signs Ugadi Predictions 2023-2024 in telugu 2023- 2024 horoscope in Telugu

సంబంధిత కథనాలు

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన  ముఖ్యమైన విషయాలివి!

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి!

జూన్ 3 రాశిఫలాలు, ఈ రెండు రాశులవారికి ఈ శనివారం చాలా ప్రత్యేకం

జూన్ 3 రాశిఫలాలు, ఈ రెండు రాశులవారికి ఈ శనివారం చాలా ప్రత్యేకం

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!

జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!

టాప్ స్టోరీస్

Assembly Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి - కీలక ఆదేశాలు ఇచ్చిన ఈసీ

Assembly Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి - కీలక ఆదేశాలు ఇచ్చిన ఈసీ

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు-  నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ విచారం- సహాయక చర్యల కోసం స్పెషల్‌ టీం ఏర్పాటు

Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ విచారం- సహాయక చర్యల కోసం స్పెషల్‌ టీం ఏర్పాటు

BRS Politics : మూడో కూటమికి చాన్స్ లేదన్న కేటీఆర్ - జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసినట్లేనా ?

BRS Politics : మూడో కూటమికి చాన్స్ లేదన్న కేటీఆర్ - జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసినట్లేనా ?