Love Horoscope Today 29th November 2022: ఈ రాశి దంపతుల మధ్య మంచి సమన్వయం ఉంటుంది
Love Horoscope Today 29th November 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
![Love Horoscope Today 29th November 2022: ఈ రాశి దంపతుల మధ్య మంచి సమన్వయం ఉంటుంది Love Horoscope Today 29th November 2022: Love Rashifal 29 November 2022 Daily Love Horoscope and Compatibility Reports , prediction for Aries, Gemini,Leo, Libra and Other Zodiac Signs Love Horoscope Today 29th November 2022: ఈ రాశి దంపతుల మధ్య మంచి సమన్వయం ఉంటుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/28/888cb390551c53e925617032581396081669632596243217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Love Horoscope Today 29th November 2022: ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...
మేష రాశి
ఈ రాశి దంపతుల మధ్య మంచి అవగాహన, సమన్వయం ఉంటుంది. ప్రేమికులు మాత్రం ఏదో ఒక విషయంలో కోపం ప్రదర్శిస్తారు
వృషభ రాశి
ఈ రాశివారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది..కుటుంబంలో అందరి మధ్యా సన్నిహిత సంబంధాలుంటాయి. ప్రేమికుల విషయానికొస్తే..మీ మనసులో మాట చెప్పేందుకు ఇదే అనువైన సమయం
మిథున రాశి
వైవాహిక జీవితంలో స్తబ్దత ఉంటుంది కానీ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ ప్రియమైన వారితో కొన్ని విషయాలు చెప్పడానికి సంకోచిస్తారు.
కర్కాటక రాశి
ఈ రాశికి చెందిన దంపతులు వైవాహిక జీవితంలో ఒత్తిడి నుంచి ఈ రోజు కాస్త ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామి కోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడతారు. ప్రేమికుల మధ్య మనస్పర్థలు రావొచ్చు.
Also Read: ఆర్థిక సమస్యలు తీరుతాయి, అనుకున్న పనులు పూర్తిచేస్తారు, తులా నుంచి మీన రాశి వరకూ వారఫలాలు
సింహ రాశి
ఈ రాశికి చెందిన ప్రేమికుల మధ్య సమస్యలొస్తాయి. వైవాహిక జీవితాన్ని గడుపుతున్న వారు కొంత ఒత్తిడి కలిగి ఉంటారు. కొన్ని విషయాలపై నేరుగా జీవిత భాగస్వామితో మాట్లాడడం మంచిది లేదంటే సమస్యలు పెరుగుతాయి.
కన్యా రాశి
ఈ రాశి ప్రేమికులకు ఇది శుభసమయం. మనసుకి నచ్చిన వారితో సంతోష సమయం గడుపుతారు.. నిజమైన ప్రేమికులు... తమ ప్రేమను పెళ్లి దిశగా తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. దంపతుల మధ్య మాటపట్టింపులు ఉంటాయి..
తులా రాశి
ఈ రోజు మీ ప్రియమైన వారిని మెప్పించేలా, మరింత ఆకట్టుకునేలా మాట్లాడతారు. ప్రపోజ్ చేయాలి అనుకున్నవారు ఈ రోజు సక్సెస్ అవుతారు. ఈ రాశివారి వైవాహిక జీవతం బావుంటుంది.
వృశ్చిక రాశి
మీ ప్రేమ భాగస్వామితో విలువైన సమయం గడుపుతారు. దంపతుల మధ్య మాటపట్టింపులు ఉంటాయి కానీ సైలెన్స్ ద్వారా దాన్ని జయించేందుకు ప్రయత్నిస్తారు. వివాదం జరిగే సమయంలో మాటతూలడం సరికాదు
Also Read: ఈ రాశులవారి జీవితంలో ఊహించని మార్పు వస్తుంది, మేషం నుంచి కన్యా రాశి వరకూ వారఫలాలు
ధనుస్సు రాశి
ఈ రాశివారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ జీవితం అంతకుమించి అనేలా ఉంటుంది. జీవిత భాగస్వామి, ప్రేమ భాగస్వామితో మంచి సమన్వయం కుదురుతుంది. ఒకేమాటపై ఉండేందుకు ప్రయత్నిస్తారు.
మకర రాశి
జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది. అయితే అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. కష్టమైన సవాళ్లను ఇద్దకూ కలసి ఆలోచిస్తే సులభంగా పరిష్కరించగలుగుతారు. ప్రేమికులకు శుభసమయం.
కుంభ రాశి
వైవాహిక జీవితంలో కొంతకాలంగా ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. ఇద్దరి మధ్యా మనస్పర్థలు తగ్గి ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ప్రేమికులు కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కోక తప్పదు
మీన రాశి
ఈ రాశివారి వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. అనుకున్న పనిలో విజయం సాధించేందుకు మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తిసహకారం ఉంటుంది. ప్రేమికుల మధ్య అలకలు ఉంటాయి..
2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)