27 November to 3rd December 2022 Weekly Horoscope: ఆర్థిక సమస్యలు తీరుతాయి, అనుకున్న పనులు పూర్తిచేస్తారు, తులా నుంచి మీన రాశి వరకూ వారఫలాలు
Weekly Horoscope 27 November to December 3: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

Weekly Horoscope 27 November to 3rd December 2022: నవంబరు 27 నుంచి డిసెంబరు 3 వరకూ తులా రాశి నుంచి మీన రాశి వరకూ వారఫలాలు ఇక్కడ తెలుసుకోండి...
మేషం నుంచి కన్యా రాశివరకూ వారఫలాలు కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
తులా రాశి (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)
ఈ వారం తులారాశివారికి అద్భుతంగా ఉంది. చేపట్టిన పనులన్నీ సక్సెస్ ఫుల్ గా పూర్తవుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది..ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తారు. రాజకీయనాయకులకు మంచి సమయం. అందరితో ఆప్యాయంగా మాట్లాడేందుకు ప్రయత్నించండి. మీపై ఉండే అపార్థాలను తొలగించుకునేందుకు ప్రయత్నించండి. ఇంటా బయటా మీకు గౌరవం పెరుగుతుంది.
వృశ్చిక రాశి (విశాఖ 4 పాదాలు, అనూరాధ, జ్యేష్ఠ)
వృశ్చిక రాశివారికి గ్రహబలం అనుకూలంగా ఉంది. విందు వినోదాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సమయం మీకు అనుకూలంగా ఉంది. మంచి ఆలోచనతో చేసే పని సక్సెస్ అవుతుంది. వ్యాపారులు, ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. నూతన పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించండి. ఈ వారం మీరు ఓ శుభవార్త వింటారు. ముఖ్యమైన పనుల్లో ఆంటకాలుంటాయి కానీ పట్టుదలతో ఉంటే పూర్తిచేయగలరు. మీ ఆరోగ్యంబావుంటుంది...
Also Read: దేవుడు తినడు కదా మరి నైవేద్యం ఎందుకు పెట్టాలి!
ధనుస్సు రాశి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఈ వారం మీకు చేపట్టే పనుల్లో సక్సెస్ అవుతారు. స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారాలు కలిసొస్తాయి. వ్యాపారులు అనుకున్న విధంగా లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. అవసరానికి సహాయం చేసే స్నేహితులు మీరున్నారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు...పెట్టుబడులకు సరైన సమయం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒత్తిడి ఉన్నప్పటికీ బాధ్యతను విస్మరించవద్దు. మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
ఈ వారం ఉద్యోగులు పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో అడ్డంకులు అధిగమిస్తారు. నిముషానికో నిర్ణయం తీసుకునే ఆలోచనను మార్చుకోకుంటే ఇబ్బంది పడతారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఆస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి కాస్త ప్రశాంతతని పొందుతారు. స్తిరాస్థుల కొనుగోలుకి అనుకూల సమయం. దూబరా ఖర్చులు తగ్గించుకోండి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఈ వారం మీరు చేపట్టే కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. కాంట్రాక్టర్లకు కలసివచ్చే కాలం ఇది. వాహనాలు, స్థలాలు కొనుగోలు కోసం ప్రయత్నాలు సాగుతాయి.వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులు కొత్త భాధ్యతలను తీసుకుని సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి బావున్నా ఖర్చులు తగ్గించుకోకుంటే ప్రయోజనం ఉండదు. మీ మనసులో ఆలోచనను స్పష్టంగా చెప్పేందుకు ప్రయత్నించండి.
Also Read: కలలో డబ్బు-బంగారం కనిపిస్తే ఏమవుతుంది, శుభమా-అశుభమా!
మీన రాశి (పూర్వాభాద్ర 4 పాదాం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ వారం మీన రాశివారికి అనుకూల సమయం. నిరుద్యోగులు ఉద్యోగానికి సంబంధించిన సమాచారం వింటారు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది..అప్పుల బాధ తీరుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు సరైన సమయం. పారిశ్రామిక వేత్తలు,కళాకారులకు కూడా కలిసొచ్చే సమయం ఇది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. మీ మనోబలం పెరుగుతుంది. ఎప్పటినుంచో వెంటాడుతున్న సమస్యల నుంచి బయటపడతారు. పెద్దల సలహాతో ముందడుగు వేయడం మంచిది.
2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

